SATYA PAVAN GANDHAM

Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Inspirational Others

"రంగుల ప్రపంచం"

"రంగుల ప్రపంచం"

1 min
265


"రంగుల ప్రపంచం"

దోపిడీలు చేసే నాయకుల్లారా...!

మీరు దోచుకోవడానికి ఓట్లు కావలె!!

కనబడలేదా సామాన్యుడి మనుగడలు?

దాచుకోవడానికి కనీసం ఓ చిత్తు నోటైనా లేకపోయే !!

దౌర్జన్యాలు చేసే సంపన్నుల్లారా...!

మీరు తినడానికి పరమాన్నాలు కావలె!!

వినబడలేదా పేదోడి ఆకలి కేకలు?

నింపుకోడానికి కనీసం ఓ ఎంగిలి మెతుకైనా దూరమాయే!!

లంచాలు మరిగే ఉద్యోగుల్లారా..!

మీరు ఉండడానికి కోటలు కావలె!!

గుర్తించలేరా నిరుద్యోగుడి కన్న కలలు?

నిలుపుకోడానికి కనీసం ఓ చిన్న నీడైనా కరువాయే!!

అలసత్వం వహించే సోమరుల్లారా..!

మీరు అనుభవించడానికి సోకులు కావలె!!

ఆపలేరా శ్రామికుడి సేద్యపు స్వేదములు?

కప్పుకోవడానకి కనీసం ఓ కట్టు బట్టైనా దొరక్కపోయే!!

ఏది సమానత్వం?

ఏది సౌభ్రాతృత్వం?

ఇంకెంత కాలం ఈ రాక్షస ఆంక్షలు?

ఇంకెన్నాళ్ళు ఈ బానిస సంకెళ్లు?

ఏ రామసేతు కాపాడింది

ఈ రాక్షస పాలకుల నుండి నా ఈ లోకాన్ని

ఏ కృష్ణ గీతిక రక్షించింది

ఈ కసటు మనస్కుల నుండి నా ఈ ఇహాన్ని

పెళ.. పెళ.. పెళ... పెళమంటూ

పగులుతోంది... పగులుతోంది... నా గుండె రాతిముక్కలై,

దభ.. దభ.. దభమంటూ

మ్రోగుతుంది... మ్రోగుతుంది... నా మది పిడుగుల శబ్ధమై,

సల... సల... సలమంటూ

మరుగుతోంది... మరుగుతోంది... నా ఆవేదన అగ్నిపర్వతమై,

భళ.. భళ.. భళమంటూ

ఉంకుతోంది... ఉంకుతోంది... నా ఊపిరి పెను ఉప్పెనై

ఎక్కడ నా ఊహా జనం?

ఎక్కడ నా స్వేచ్చా సమాజం?

ఎక్కడ నా కలల ప్రపంచం?

ఎక్కడ నా రంగుల విశ్వం?

- సత్య పవన్ ✍️✍️✍️


Rate this content
Log in

Similar telugu story from Inspirational