శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

రంగుల కల

రంగుల కల

2 mins
374



            రంగుల కల

        -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


  

   వర్షం ధారాపాతంగా కురుస్తుంది...!

  

  నిద్రపోతున్న నాకు ఒక్కసారిగా మెలుకొవొచ్చింది. సమయం చూస్తే... అర్థరాత్రి రెండవుతుంది. ఆసమయంలో భార్యను దగ్గరకు తీసుకుని కౌగిట్లో బంధించాలని ఎంతగానో మనసు పీకుతున్నా...బలవంతంగా వెనక్కి తగ్గాను.

  

   నా భార్య మాత్రం ఆదమరచి నిద్రపోతుంది....

  ఒక వారం రోజులుగా ఒకటే అలకపాన్పు. తనకు పిల్లలు కావాలట. భార్యకు హఠాత్తుగా వచ్చిన ఆకోరిక నచ్చలేదు నాకు.

  

  "అప్పుడే మనం పిల్లల్ని కనడానికి తొందరెందుకు...? ఒక ఐదేళ్లయినా ఇద్దరం సుఖంగా గడుపుదామని చెప్పాను కదా... దీనికి నేను రెడీగా లేను" అంటూ చెప్పాను .

  

  నా మాటలు కుసుమని మరింతగా బాధ పెట్టాయి. పిల్లలు పుడితే మన సంతోషానికి అడ్డనిచెప్పి...నాతో మందులు వాడిస్తున్న మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నేను పీల్స్ వాడుతున్న విషయం నా స్నేహితురాలికి చెప్పినప్పుడు చాలా భయపెట్టింది. "నువ్వు ఇలా చేయడం అసలు మంచిది కాదు. నీ హెల్త్ పాడవ్వడమే కాదు...కనే వయసులో పిల్లల్ని కసకపోతే...పిల్లలు పుట్టే ఛాన్స్ పోగొట్టుకుంటావు. ఇకనైనా పిల్లల్ని కనడానికి ప్రయత్నించు" అని.  ఓపక్క మా పుట్టింట్లో మీఇంట్లో కూడా నన్నే సతాయిస్తున్నారు....పెళ్లైపోయి మూడేళ్లు దాటిపోయినా ఇంకా నెల తప్పలేదని. మనవడో మనుమరాలో పుడితే...తమ ముచ్చట తీర్చుకోవాలని వారి సంబరం. నాకు మాత్రం లేదూ...ఓ బిడ్డను కని మాతృత్వం పొందాలని. కానీ....దీనికి మీరు కాదూకూడదంటుంటే నేను మాత్రం ఏం చేయగలను...? అంటూ పెద్ద రభసే చేసింది .


   ఇకపై తాను వాడే మందుల్ని వాడననిచెప్పి...నా ఎదురుగానే చెత్తబుట్టలో పడేసింది. 


   నా భార్య చేసిన తెగువకు కోపం వచ్చి...నోటికి వచ్జినట్టు తిట్టేసాను. అందుకే...తాను చేసింది పెద్ద తప్పు కాదంటూ నేనన్ని మాటలన్నందుకు వారం రోజులుగా నాకు దూరంగా పడుకుంటుంది. నేను కూడా ఆవిషయంలో భార్యను క్షమించలేక...దూరంగానే వున్నాను.


   కానీ...ఈ వర్షంలో ...నా శరీరం అదుపుతున్నట్టుగా ఉంది. లేచి...వాష్రూమ్ కెళ్లివచ్చాను....

   

   హాల్లో....వర్షం హోరుకి అదేపనిగా కొట్టుకుంటున్న కిటికీ తలుపుల్ని దగ్గరకు లాగి వేస్తుంటే....ఆ పక్కనే కాళీ స్థలంలో పూరిపాక వేసుకుని ఉంటున్న రాములింట్లో నుంచి చిన్నపిల్లవాడి ఏడుపు వినిపించింది. ఆ ఉరుములు మెరుపులకి అనుకుంటాను ఒకటే ఏడుస్తున్నాడు. పాపం...ఆ పూరి గుడిసెలో నలుగురి పిల్లల్నేసుకుని భార్యతో ఎలా కాపురం చేస్తున్నాడో అర్థం కాలేదు నాకు. పాపం కూలీ నాలీ చేసుకుంటూ...గంజన్నం...పచ్చడి మెతుకులతోనే వారి కడుపుల్ని నింపుతూ...ఎంతో సంతోషంగా కనిపిస్తూ ఉంటాడు రాముడు. ఆర్థికంగా వారెంతో వెనుకపడి వున్నా...అంతమంది పిల్లల్ని కని పెంచుతూ... ఉన్న ఒకే ఒక ఇరుకుపాటి గదిలో ఎలా కాపురం చేస్తున్నారోనని వీస్తుపోతూ ఉంటాను.


   ఆవర్షంలో వాళ్ళని తల్చుకునేసరికి..నాకేదో జ్ఞానోదయమైంది.

   

  అవును...నేను చేస్తున్నది తప్పు. ఇంత సంపాదిస్తూ కూడా...ఒక బిడ్డను కనడానికి...నేనెంతో ఆలోచిస్తున్నాను. పిల్లలు పుడితే ఖర్చులెక్కువవుతాయనీ....తమ సంతోషానికి అడ్డొస్తారనీ ఆలోచిస్తున్నాను. లక్షల్లో స్కూలు ఫీజులు కట్టాలనే కదా...బాగా డబ్బు సమకూరేకా పిల్లల్ని కందామనుకున్నాను. నిజానికి చదివేపిల్లలు ఎలాంటి స్కూల్లో వేసినా బాగానే చదువుతారు. లక్షలు వసూలు చేసే స్కూళ్లే అవసరం లేదు. నాతండ్రి నన్ను కార్పొరేట్ స్కూల్లో చదివించినా...తాను మాత్రం ఓకుగ్రామంలోని గవర్నమెంటు స్కూల్లోనే చదువుకుని... మంచి ఆఫీసరుగా ఉద్యోగం చేశారు. లంకంత ఇల్లుంచుకుని కూడా పిల్లలుంటే.... మా మధ్య అడ్డనుకుంటూ... నేనెందుకింత చీప్ గా ఆలోచించి పిల్లల్ని కనకుండా వున్నాను...? నాలో నేనే అనుకున్నా చాలా సిగ్గుగా అనిపించింది ఆక్షణం. 

   

   మనిషిలో పరివర్తన రావాలంటే...తాను గమనించిన చిన్న విషయం చాలు. బయట భోరున వర్షం పడుతున్నా...నాలో దాగున్న మబ్బులు వీడిపోయాయి. నా మనసు మార్చుకుని ఇక ఆలస్యం చేయకుండా నా భార్య రంగుల కలను నెరవేర్చాలనిపించింది.


   కిటికీ తలుపుల్ని మూసేసి... నిద్రపోతున్న భార్య దగ్గరగా చేరాను. ఆ ఉధృతమైన వర్షం నాలో ఇంత మార్పు తీసుకొస్తుందని నాభార్య అసలు ఊహించలేదనుకుంటాను. భార్యలో లీనమౌతూ...క్షమించమని ఏదో చెప్పుకుపోతున్నాను. నాభార్య కిలకిలా నవ్వుతుంటే... నా చెవులకెంత ఇంపుగా వినిపించిందో..?


   మూడు నెలలు గడిచాయి....!


   నా భార్య నెల తప్పింది...తన పుట్టింట్లో...మా ఇంట్లో కూడా ఎంతో సంతోషించారు. చూస్తుండగానే నెలలు నిండాయి.


   ఓ శుభముహూర్తంలో పండంటి మగబిడ్డను ప్రసవించి...నాకు వంశోద్దారకుణ్ని అందించి... మాతృత్వంతో పరవసించిపోయింది నా భార్య. 

   

   అప్పుడే చిన్నగా వస్తున్న నీరెండలో... చిటపటచినుకులు పడుతుంటే విరబూసిన ఇంద్రధనస్సులోని రంగులన్నీ.... మా కన్న బిడ్డలో కనిపించడంతో...నాభార్య కళ్ళే కాదు నా కళ్ళు కూడా ఆనందంతో మెరిసాయి...!!*


          ****     ****    ****



Rate this content
Log in

Similar telugu story from Inspirational