STORYMIRROR

Lahari Mahendhar Goud

Comedy Classics Inspirational

4  

Lahari Mahendhar Goud

Comedy Classics Inspirational

రాఖీ డే... మా డే

రాఖీ డే... మా డే

2 mins
379


రాఖీ అనగానే అందరూ సొంత అన్నదమ్ముల్లే అవుతారు

ఇలా ఎందుకు అంటున్నానంటే


వాళ్ల స్కూల్ డేస్ లో 

మా తమ్ముడి ఫ్రెండ్ అక్షయ్ 

డైలీ పొద్దున్నే ఇంటి ముందు సైకిల్ ఆపి మా తమ్ముడు మీదే ఎదో ఒక కంప్లైంట్ చెప్పే వాడు

అందుకే వాన్ని చూస్తే చాలు ఎక్కడ లేని కోపం వచ్చేది

కానీ, 

రాను రానూ వాడూ మాలో ఒకడిగా కలిసిపోయాడు

ఎంతలా అంటే వాడు, మా తమ్ముడూ ఇద్దరూ కూడా నా దృష్టిలో ఒకటే

అలాగే నాకు వాళ్లిద్దరూ చూపించే కేరింగ్ లో, ప్రేమలో ఎక్కడా తేడా తెలియదు...

ఇంకా చెప్పాలంటే మా తమ్ముడు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు వాడికి స్వయంగా నా చేతులతో రాఖీ కట్టలేకపోయా కానీ

అక్షయ్ మాతో కలిసాక మాత్రం ఇప్పటి వరకూ వాడికి రాఖీ కట్టకుండా ఉండలేను కావొచ్చు

వాడూ అంతే

ఎన్ని పనులున్నా అర్థ రాత్రి వచ్చైనా రాఖీ కట్టించుకొని వెళ్తాడు

ఒక రకంగా చెప్పాలంటే నా ఇద్దరు తమ్ముళ్లు నా స్ట్రెంథ్ 


ఆగండి ఆగండి స్టొరీ ఇంకా అవలేదు


మా అమ్మ వాళ్లు ఆరుగురు అక్కాచెల్లెళ్ళు అయితే

వాళ్ళ పిల్లలం మేము మొత్తం 15 మెంబెర్స్

అందరం కూడా కసిన్స్ అన్నట్లుగా కాకుండా చాలా యూనిటీగా కలిసుంటాం

ప్రతీ ఈవెంట్ లో మా బ్యాచ్ ఉంటే ఆ సందడే వేరు అంటూ బంధువర్గం అంతా మమ్మల్ని చూసి తెగ సంబరపడిపోతుంటారు 

మా పిల్ల బ్యాచ్ మొత్తం ప్రతీ రాఖీకి ఒక చోట కలిసి చాలా చాల ఎంజాయ్ చేస్తాం

ఆ రోజు మార్నింగ్ 11 లోపు అందరం ఒక చోట కలవాలన్నది మా రూల్

ఆ రోజు నో స్పౌస్,నో కిడ్స్(అంటే చాలా మందికి పెళ్లి అయి, పిల్లలు కూడా ఉన్నారు)


ఓన్లీ వీ ఆర్ ఎనాఫ్


అందరూ రాగానే మొబైల్స్ కూడా ఫ్లైట్ మోడ్ పెట్టేయాల్సిందే ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా

ఇంక ఆ రోజు మొత్తం మాది

అందరం చిన్న పిల్లల్లా కొట్టుకుంటూ, ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తాం

అలా మేము ఒక చోట కలిసామంటే కిష్కింధ కాండే

కానీ మా గోళను భరించటం అంత ఈజీ కాదండీ

పక్కింట్లో ఉన్న వాళ్ళు పారిపోయెలా ఉంటుంది 


అన్నట్లు చెప్పటం మర్చిపోయానండి మా బ్రదర్స్ అందరూ మాంచి చెఫ్ లు

ఆ రోజు మేము వాళ్ళకి కావాల్సినవి కట్ చేసి ఇస్తే చాలు వంట మొత్తం వాళ్ళే చేసేస్తారు అదే వాళ్ళు మాకు ఇచ్చే రాఖీ గిఫ్ట్


చివరకు రాత్రి 9 తర్వాత అందరం ఔటింగ్ కి వెళ్లి బయట

కూడా ఎంజాయ్ చేశాక ఏ ఐస్క్రీమో తిని నైట్ 11 కి ఇళ్లకు డిస్పాచ్ అవుతాము


మా ఫ్రెండ్స్ చాల మంది మా కసిన్స్ తో నేను ఎంజాయ్ చేసిన దానికి జెలస్ ఫీల్ అవుతుంటారు




రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Comedy