పట్టనపు సదువులు
పట్టనపు సదువులు
అది ఓ పెద్ద పట్టణం ఎక్కడ చుసిన అయిదంతస్తుల మేడలు పెద్ద పెద్ద భవనాలు. ఇకపోతే జానూ చదువుతున్నది ఓ పెద్ద ప్రయివేటు స్కూలు. తన స్నేహితురాలు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది. జానూ ఎప్పుడు చదువుతూనే కాలం గడుపుతుంది తన స్నేహితురాలు సుమ వారానికో ఉత్తరం రాసి తను చదువు, ఆట అలానే తన ఊరి ప్రకృతిని చూస్తూ ఎలా సంతోషంగా కాలం గడుపుతుంది అని రాసేది ఉత్తరం లో ఇద్దరు +2ముగించి జానూ డాక్టర్ కి చదువుతుంది సుమ ఆర్ట్స్ కాలేజీ లో చేరింది. వెంటనే జానూ వాళ్ళ నాన్న చూసావా గ్రామపు చదువులు దండగ అవి కించపరిచారు. కానీ సుమ 3ఏళ్లలో డిగ్రీ పూర్తి చేసుకొని గ్రూప్ 1పరీక్షలు రాసి పాస్ అయ్యింది. జానూ వెంటనే చాలా సంతోషంగా వాళ్ళ నాన్నతో ఎప్పుడు ఎవరిని చులకనగా మాట్లాడకండి నాన్న. మీరు నాకు లక్షలు ధార పోసి చదివించారు. కానీ సుమ వాళ్ళ నాన్నగారు ప్రభుత్వ పాఠశాలనే నమ్మరు చక్కగా అదే సర్కారు ఉద్యోగము వచ్చింది. పట్టణాలలో చదువులు కొంటున్నాం నాన్న పల్లెల్లో చదువులమ్మ తల్లి ప్రేమాతో బిడ్డలను కాపాడుతుంది. ప్రకృతి వాళ్లకు సహకరిస్తుంది. ఇదే జగమెరిగిన సత్యం.
