Chalapathi Valle

Abstract Children Stories Children

4  

Chalapathi Valle

Abstract Children Stories Children

పాప

పాప

2 mins
290


కాలేజీ కి టైం అవుతుంది. కానీ ఇంకా బస్ రానేలేదు... కొన్ని నిమిషాల తర్వాత బస్సు వచ్చింది...


బస్సు ఎక్కి నేను సీట్లో కూర్చున్నా...

బస్సు ఓ ఊరు మీదుగా వెళుతుంది...

గాలి రావడం లేదనీ విండో ఓపెన్ చేసాను...

చల్లగా వీస్తున్నా గాలి జోకొట్టేలా ఉంది...

బస్సు ఓ వూరు బస్సు స్టాండ్ దగ్గిర ఆగడంతో ఒక మహిళ పాప ని బస్సు ఎక్కించడానికి అవస్థలు పడుతుంది.. నార్మల్ గా ఆర్టీసీ డ్రైవర్ ఒక బస్సు స్టాండ్ దగ్గర ఎక్కువ సమయం ఆపడు..


ఎక్కు బస్సు ఎక్కువే నాకెందుకు ఈ దరిద్రం తగిలిందో అంటూ పాపని బస్సు మెంట్లు ఎక్కమని మెంట్లు పైకి తోసేస్తుంది... పాప మెంట్లు దేవుకుంటూ ఎక్కింది.. ...పాపకి కంటిచూపు లేదు అని విషయం తెలిసిన ఆ మహిళ కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పాపతో ప్రవర్తిస్తుంది...


పాప చాలా కష్టంతో బస్సు ఎక్కగానే బస్సు కండక్టర్ తో రెండు టికెట్ల ఇవ్వడని అడిగింది...


బస్సు కండక్టర్ టిక్కెట్లు ఇవ్వగానే ఆ మహిళ కి కండక్టర్ కి టికెట్స్ విషయంలో చిన్న వాగ్వాదం జరిగింది.... బస్సు చార్జీలు ఎక్కువ ఉన్నాయని ఆమె బాధ


పాప అలా నిల్చొనే ఉంది.... రోడ్ మీదున్న గుంతలకి బస్సు ఊగి పోతుంది... పాప ఇట అటు పడిపోతుంది...


ఏవమ్మా? పాప పడిపోతుంది పాపని జాగ్రత్తగా చూసుకోకుండా నీకు డబ్బులు కావాల్సి వొచ్చిందా ఇంతవరకు సీట్లో కూర్చోబెట్టకుండా కండక్టర్ తో బేరం ఆడుతున్నావ్ ఏంటి  అని బస్సులో‌ ఓ పెద్దాయన మాట అందుకుంటే మిగిలిన వారు కూడా నాలుగు చివాట్లు పెట్టారు ఆమెకి ....


నేను ..‌..నేను.... అంటూ ఆమె ఏదో చెప్పబోతుంటే

అపమ్మా!!! .... మీ లాంటి వారు ఉండబట్టే పాపం అభం శుభం తెలియని వయస్సులో అమ్మా దగ్గర గారాబంగా పెరగాల్సిన పిల్లలు రోడ్ మీద పడుతున్నారు... అని అన్నారు అదే పెద్దాయన


పాపకి పింఛను వస్తుంది గాని లేకపోతే నువ్వు పాప ని ఎప్పుడో వదిలేసే దానివి అంది అని మరో మహిళ 


నేను ఆ పాప ని దగ్గర తీసుకుని నా సీట్ ఇచ్చి

అవయవాల గుడ్డివో, సొట్టావో అయితే ఫర్వాలేదు.. 

ఆలోచనలు గుడ్డివో, సొట్టావో అయితేనే ప్రమాదం.. అని చెప్పి ఆమె వంక తిరిగాను..


ఆమె మొహం కిందికి చూస్తోంది... పాపని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి నేను బస్సు తిగిపోయాను....




Rate this content
Log in

Similar telugu story from Abstract