STORYMIRROR

Chalapathi Valle

Abstract Classics Children

4  

Chalapathi Valle

Abstract Classics Children

మొదటి సినిమా

మొదటి సినిమా

1 min
319

మా నాన్నగారు గబ్బర్ సింగ్ సినిమా పెట్టమంటే... టివి లో టైప్ చేసి సినిమా పెట్టాను...


గబ్బర్ సింగ్ సినిమా అంటే ఎప్పుడూ గుర్తుకు వచ్చింది... ఓ సందర్భం



చిన్నప్పుడూ మావురులో ఏ సినిమా విడుదలైతే ఆ సినిమా కొంత కాలానిక తర్వాత వేసేవారు కొత్తగా గబ్బర్ సింగ్ సినిమా విడుదలైతే ఊరిలో వేసారు..

మా ఇంటికి అతి దగ్గరిగా ఉండడంతో నేను వెళ్ళాను... సినిమా అంటే ఏంటో అప్పుడు తెలియదు లేండి... అలాంటి పనితనం అది


తెరపై మనుషులు కదలికలు చూడడానికి నా పనితనం తహతహలాడిది... సినిమా తెరపై వేసారు


నేను వెళ్ళి సినిమా చూస్తున్నా గుంపులో దూరాను...

హిరో ఎంట్రీ ఇచ్చినప్పడల్లా ఈలలు, కేకలు వేశేవారు...

నాకప్పుడు అర్థం కాకపోయినా నేను కేకలు వేసే వాన్ని... అదో సరదా 


సినిమా చూస్తున్నప్పుడు మా అమ్మ సరిగ్గా వచ్చింది ఇంటికి రా నాన్నా అంటూ



హు !! ఉండు అమ్మా సినిమా చూసి వస్తాను అన్నాను..



సినిమా అప్పుడే అవ్వదు నాన్నా ?? టైం అవుతుంది ఇంటికి రా అని చెప్పింది... నేను మొండికేయడం చూసి ఇంట్లో అన్నీ పనులు చేసి నాతో పాటు సినిమా చూడడానికి కొచ్చింది అమ్మా.... మా ఇద్దరం కలిసి చూసినా మొదటి సినిమా అది...


అమ్మా వస్తూ వస్తూ ఓ దుప్పటి కూడా తెచ్చింది... అమ్మా ఒడిలో చక్కగా కూర్చొని అమ్మా దుప్పటీ చుట్టూ కప్పింది...


అమ్మ మనుషులు సినిమాలోకి ఎలా వెళ్లారమ్మా అని అడగ్గా సినిమా చూస్తూ తనకేమీ తెలియదని భుజాలు ఎగరేయడం చూసి సినిమా చూడడం మొదలు పెట్టాను.... చూట్టూ చలిగా ఉందాప్పడు... అమ్మా ఒడిలో ఒదిగిపోయి ఎప్పుడు నిద్ర పోయానో నాకు తెలియదు...



అది ఆ సందర్భం


***




Rate this content
Log in

Similar telugu story from Abstract