ప్రేమ సాంకేతికం
ప్రేమ సాంకేతికం
సాయంత్రం 7:30 అవుతుంది.
తను ఎందుకు ఇంటికి ఇంకా రాలేదు అంటూ పదె పదే గోడకున్నా గడియారం చూస్తు సోఫా లో కూర్చొంది ..తన పక్కనే ఉన్నా టేబుల్ మీద ఇంటికి రాగానే ఆరెంజ్ జ్యూస్ ఇద్దామని ఉంచింది.
సరిగ్గా 7:40 అవుతుంది ..ఎవరో డోర్ దగ్గరకు వచ్చి కంగారు అతని ముఖం లో స్పష్టంగా కనిపిస్తుంది.డోర్ పక్కన ఉన్న కాలింగ్ బెల్ మీద నొక్కాడు
సార్ ఎప్పుడు ఇంటికి వస్తారా అని మనసులో ఏవో ఊహల ఉయ్యల్లో ఊగుతుంది..
కాలింగ్ బెల్ మ్రోగుతున్న శబ్దం విని ఊహల ఉయ్యల్లోనించి దిగి "ఎప్పుడూ చూస్తానా అనే ఆరాటంతో డోర్ తీసి".... తీసి చూసేసరికి ఆశ్చర్యంగా. డోర్ అవతల ఉన్న వ్యక్తి సిరి ని చూడగానే హత్తుకునే విధంగా కౌగిలించుకున్నాడు.. అతనే తన భర్త..తను ఏమి మాట్లాడలేదు...కంగారు మెత్తం తగ్గే వరకు కౌగిలించుకున్నాడు..తన కూడా ఏదో అయ్యింది లేకపోతే ఇతను ఎప్పుడూ భావోద్వేగానికి గురి కాలేదు.అంటూ తన కౌగిట్లో సేదతీరుతున్న అతని భుజం మీద తన రెండు చేతులు వెసింది..
కాసేపు గడిచాక....
ఇప్పుడు చెప్పండి సిద్దుగారు అంటూ సోఫాలో కూర్చోపెట్టి పక్కన ఆరెంజ్ జ్యూస్ ఇచ్చింది.
అది కాదు సిరి ! కాస్తా వర్క్ ప్రెజర్ అంతే నిన్ను ఎప్పుడూ చూస్తానా అని కంగారు తో వచ్చాను.నిన్ను చూడగానే కాస్తా ఎమోషనల్ అయ్యాను అంతే నాకు నువ్వు తప్పా ఇంక ఎవరు ఉన్నారు.అంటూ సగం త్రాగిన జ్యూస్ గ్లాసు పక్కన టేబుల్ మీద పెట్టాడు.
"అది సరే నువ్వు ఎందుకు అంత స్పీడ్ గా డోర్ తీసావు ? "
"హ ఏమి లేదు సిద్దు గారు .. ఎవరా అని చూసాను అంతే"
"ఏదో కారణం ఉంది అందుకే అంత స్పీడుగా వచ్చావు"
కారణం లేదు కాకర కాయ లేదు అంటూ సగం త్రాగిన జ్యూస్ గ్రేస్ తీసుకుని ఏం చెప్పాలో అనే టెన్షన్ పడుతు త్రాగే స్తుంది ..
సిరి ఎంత పని చేసావ్ .
నేనేం చేసాను జ్యూస్ త్రాగను అంతే కదా సార్
అంతేనా సిరి అంటూ కొంటెగా చూస్తూ దగ్గరికి వచ్చాడు.
సిద్దు ఏంటి వింతగా చూస్తున్నారు అని ఆలోచిస్తుంది. ఒక్కసారిగా గుర్తోకొచ్ఛి హ మీరు త్రాగారు కదా అంటూ తన చీరతో పెదవులని తుడుస్తుంది ..
