STORYMIRROR

Chalapathi Valle

Classics Inspirational Children

2.5  

Chalapathi Valle

Classics Inspirational Children

బస్సు

బస్సు

2 mins
246

ఉదయం అయ్యి కొన్ని గంటల అయినా నాకు మాత్రం ఆర్టీసి బస్సు వస్తే కానీ తెల్లవారినట్టు అనిపించదు.... అదేంటో?


డైరీ 2021@ 01... 

నేనొచ్చే సమయానికే బస్సు వెళ్ళిపోయింది...


(నాకు ఇది అలవాటే ..‌.రోజూ బస్సు కి అందుకోకవడం.. కాలేజీలో ఏదో చెప్పి మేనేజ్ చేయడం)



ఈ బస్సు వెళ్ళిపోతే ఇంకో 9:30కి బస్సు ఉందని ధీమా ఉన్నా నాలో భయం మాత్రం ఉంది...దాని బయటపెట్టకుండా బస్సు కోసం వెయిట్ చేస్తున్నా వారిలో కలిసాను...వెయిట్ చేస్తున్నావారిలో మా కాలేజీ స్టూడెంట్స్ చూసి నా మనసు కుదుట పడింది...


మా కాలేజీ స్టూడెంట్స్ మొహాల్లో భయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి... వారిలో ఒకడైతే బుక్ కూడా చదువుతున్నాడు... బహుశా ఈ రోజు టెస్ట్ ఉందేమో..


తొమ్మిదిన్నర దాటినా ఇంకా బస్సు రాకపోవడంతో పక్కనున్న వారైతే డ్రైవర్ని తిట్టిపోస్తున్నారు, స్టూడెంట్స్ కంగారు పడుతూ చేతికున్న వాచీ తదేకంగా చూస్తున్నారు, కొందరైతే ఏకంగా "బస్సు ఇక రాదేమో" అని ఆటోలో వెళ్తున్నా రోజూ ఎరిగిన దృశ్యాలే‌.


"సరిగ్గా నా ఆలోచనలకి... వారి ఎదురు చూపులకి స్వస్తి చెబుతూ వచ్చింది బస్సు"


రావడంతోనే బస్సు ఎక్కడం... బస్సు తీయడం అన్ని వేగం గా జరిగిపోయాయి... కొందరు సీట్లు మావే అన్నటుగా ఇద్దరు కుర్చున్నారు... మరికొందరు సీట్లు లేకా ఇబ్బందులు పడుతున్నారు....అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు....స్త్రీ కూర్చోవాల్సినా సీట్లో కూడా పురుషులే కూర్చున్నారు..వాల్లే పైనే" స్త్రీ గౌరవించండి"అని ఎర్రని అక్షరాలతో రాయబడింది".... "మన ఆశయాలు ఆలోచనలగానో అక్షరాల్లో గానో నిక్షిప్తమై ఉండిపోయింది"..


నాకైతే సీటు దొరికింది...నా సీటు వారిలో ఒకరికి ఇవ్వాలనిపించింది... కానీ నేను కూర్చున్నా సీట్లో ముగ్గురం కుర్చున్నాము... అందులో మా కాలేజీ స్టూడెంట్ "ఎక్కడికి వెళ్తావు?" "ఆర్టిసి బస్సులో సీటు దొరకాలంటే ఎంతో పుణ్యం చేస్కోవాలి"... అనడంతో కాస్త ఆలోచించి "హ అది కాదురా"... పాపం వాళ్లకి అని మరోసారి నేను అనడం తో "నువ్వు కూర్చోరా బాబు" అని నేను వేసుకున్న బ్యాగ్ ను వెనక్కి లాగాడు...


సిద్దార్థ్ మన కాలేజ్ దగ్గరకొస్తే సీటు ఇద్దామని చెప్పి ఫోన్లో ఎవరితోనో అనుకుంటా మాట్లాడుతున్నాడు...


సరే అని జవాబిచ్చాను... అయినా నా మనసు కుదుట పడలేదు..


ఓయ్ మీ తమ్ముడు చూడు చాలా డల్ గా ఉన్నాడు ఒకసారి మాట్లాడు... అంటూ ఫోన్ ఇచ్చాడు..



ఒరే సిద్దు ఏమైంది ఎందుకు డల్ గా ఉన్నావు.. సరే.. చెప్పొద్దూ కానీ నీకు విండో సీటు ఇష్టం కదా... రైల్లో ప్రతిసారీ నన్ను లేపి మరీ నువ్వే కూర్చుంటావు!! స్టేషన్ ఎప్పుడొస్తుందా అని తొంగి తొంగి చూస్తావు కదా..


అది రైల్ అక్కా ఇది బాస్!!


ఏదైనా మనం చూసే దృష్టిలో ప్రపంచం ఇమిడి ఉంది... అది బాస్ విండో అయినా రైల్ విండో అయినా అవతల ప్రపంచం చాలా పెద్దది..‌.విండోలో ప్రపంచానికి చూసినప్పుడు ఛా! ఇంత చిన్న విషయానికి బాధపడుతున్నానా? అనిపిస్తుంది...ఎంజాయ్...


హమ్మ్!!! సరే అక్కా!!! కాలేజీ దగ్గరకొచ్చింది.. ఇంటికొచ్చాక ఏమైందో చెప్తాను... అని ఫోన్ బావకి ఇచ్చి మేం దిగాము..


మా కాలేజీ స్టూడెంట్స్ దిగాక ఇప్పుడు వాళ్లందరికి సీట్లు దొరికాయి... అది బావా చూసి చూసావా? ప్రతి ఒక్కరికీ ఒకరోజు/ అవకాశం వస్తుంది....ఇందాక మనకి వచ్చింది.. ఇప్పుడు వారికీ వచ్చింది.. అంతే మనం చెయ్యాల్సింది వెయిట్ చేయడం తప్పా!!!


ఎప్పటిలాగే కాలేజ్ కి పరుగు పరుగున వెళ్ళాను..


Rate this content
Log in

Similar telugu story from Classics