బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Drama Tragedy

5.0  

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Drama Tragedy

ఒక వేశ్య కథ

ఒక వేశ్య కథ

3 mins
1.9K


కాలేజి లో అందరినీ సిటీ లో ఉండే స్కూల్ లో సర్వే కి పంపారు...నన్ను మాత్రం గన్నారం అనే పల్లె కు పంపారు మా కాలేజ్ వాళ్ళు.....సాయంత్రం బస్సు వుండదు...షేర్ ఆటో కోసం ఎదురుచూస్తూ వుండాలి....అని అనుకుంటూనే స్కూల్ కి వెళ్ళ....సర్వే బాగానే జరిగింది....ఆటో కోసం ఎదురుచూస్తూ చూస్తూ కిరాణా షాపు దగ్గరే కూర్చున్న....

దూరం గా ఎక్కడో అందరు గుమి గుడి ఉన్నారు....

నాకు ఎందుకు లే అని అనుకున్నా కానీ...మనసు వింటే గా.... కాళ్ళు అటే అడుగులు వేసాయి.....


ఎవరో చని పోయారు అనుకుంటా...అందరు మాటలాడు కుంటున్నారు....ఎవ్వరూ ఎడవటం లేదు....అందరు చనిపోయిన వ్యక్తి గురించే మాట్లాడుకుంటున్నారు.....

ఎక్కడ ఎక్కడ తిరిగి సచిందో....అందుకే ఇలా      ఎడ్స్ వచ్చి చచ్చింది 20 ఏళ్లకే అని....

నాకు ఎందుకు లే అని వెళ్లి ఆటో లో కూర్చున్న.... నా పక్కనే ఒక అమ్మాయి కూర్చుంది....చాలా ఏడ్చినట్టు ఉంది....కనులు ఎర్రగా ఉన్నాయి.... నా మనసు ఉండ లేక అడిగేస మీరు ఆ అమ్మాయి వాళ్ళ...అదే చనిపోయిన అమ్మాయి....

అవును అన్నట్టు తల ఊపింది....

ఎందుకండీ అంత ల ఏడుస్తారు....ఎవరికీ ఎలా రాసి పెట్టీ ఉంటే అల అవుతుంది...

నా మాట పూర్తి అయ్యే లోపే తను మాట్లాడటం మొదలు పెట్టింది....

తను... నా ఫ్రెండ్ ....చిన్నపుడు ఇక్కడే పత్తి చేనులో పనికి వెళ్ళే వాళ్ళం....నాకు 15 ఏళ్ల కే పెళ్లి చేసి పట్నం పంపంరు మా వాళ్ళు....

దాని పేరు...జమున.....దానికి అందం తో పాటు అమాయకం కూడా చాలా నే ఇచ్చాడు దేవుడు....చిన్న వయసులోనే అమ్మ నీ పోగొట్టుకుంది....నాన్న పచ్చి తాగు బోతూ....అందుకే వాళ్ళ అమ్మమ్మా దాని నీ, వాళ్ళ చెల్లని తన దగ్గరకు తెచ్చుకుంది....దానికి 12 ఏళ్లు రాగానే వల్ల అమ్మామా కూడా కాలం చేసింది...దాంతో వాళ్ళ మెన మామ గారి ఇంటికి తీసుకెళ్ళి పెంచుకున్నాడు...కాని వాళ్ళ అత్తకు వాళ్ళంటే అస్సలు పడక పోయేది...పుట పుట కు అరిచేది...అందుకే అది చదుకో వల్ని ఉన్న పొలం పనులు చేస్తూ ఉండేది...కాని దాని చెల్లి జీవితం అయిన బాగుండాలని దాన్ని దగరలో ఉన్న ప్రభుత్వ స్కూల్ లో చేర్చి పంపేది...రూపాయి రూపాయి కూడబెట్టి చెళ్లకి పుస్తకాలు పెన్నులు కొని పెట్టేది...దాన్ని నేను చూసిన రెండు ఏళ్ల లో అది వేసుకుంది చింగిన 4 జతల బట్టలు....చెప్పులు ఒక్క సారి కూడా తోడగ లేదు...

ఎండాకాలం చుట్టిలు వచ్చినపుడు ...మేము పనికి వెళ్ళే పొలం యజమాని ఇంటికి చుట్టాలు వచ్చారు...మేము పనులు చేస్తుంటే మాతో కబుర్లు చెప్పేవాడు....మీకు ఇక్కడ పని చేస్తే వచ్చే నెల డబ్బులు పట్నం లో ఒక్క గంటలో సంపాదించవచ్చు అని వాగుతు వుండే వాడు..ఒక రోజు హఠాత్తుగా జమున ఎవరో అబ్బాయితో లేచిపోయింది అని ఊరంతా మాటలు....ఎం అర్ధం కాలేదు...రోజంతా నాతోనే తీరిగు తుంది నాకు తెలియకుండా ఎలా అని...అది అల వెళ్లిపోయిందని మా వాళ్ళు బయపడి నాకు వెంటనే పెళ్లి చేశారు.... వాళ్ళ చెల్లిని కూడా తన కన్న 20 ఏళ్ల పెద్ద వాడికి ఇచ్చి చేసి పంపారు.అడిగే వాళ్ళు లేరు కదా...


సంవత్సరం క్రితం నాకు అది వరంగల్ స్టేషన్ లో కలిసింది.....నేను పిల్లలతో మా పుట్టింటికి పండగకు వస్తుంటే...

దాని మెడలో తాలి లేదు....చాలా సన్నగా అయిపోయింది....ఎంటే అని అడిగే లోపే....నన్ను పట్టుకొని లబోదిబో అని ఏడ్ చేసింది...

అది ఎవ్వరితో లేచిపోలేదు....మేము పొలం పనులు కోసం వెళ్ళిన ధగర మాకు పరిచయం అయినా సచ్చినో డూ .... దాన్ని మోసం చేసి పట్నం లో పని పెట్టిస్తా అని...ఇంట్లో చెప్తే పంపించారు అని...నెల జీతం పట్టు కొని వచ్చి చెల్లి నీ కూడా తెచ్చుకోవచ్చు అని మాయ మాటలు చెప్పి...దాన్ని తీసుకెళ్లి ....దాన్ని ముంబయి లో అమ్మే సాడు అట...దానికి రాని భాష...ఎక్కడ ఉందో కూడా తెలియకుండా 4 గదుల మధ్య బందిని చేశారట...వాళ్ళు చెప్పినట్టు వినక పోతే చవ కొట్టే వారట....చిన్న పిల్ల అని చూడకుండా....దాని జీవితం నాశనం చేశారు...రోజుకు 200 కూలికి దాని జీవితం బలి అయిపోయింది...2 సం తరువాత దానికి రోగం వచ్చిందని తెలిసీ చేతిలో 5 వెలు పెట్టీ వెళ్ళ గొట్టర్ట....అది ఊరికి వెళ్లి జరిగింది చెప్పిన ఎవ్వరూ నమ్మ లేదట...అందరు దాన్ని నాన తిట్లు తిట్టకుంటూ వెళ్లారట...దాని చెల్లి నయినా కలుద్దాం అని వస్తె వల్ల చెల్లి మొహం మీదే తలుపులు మూసి వెళ్లి పోయింద్ట...ఎం చేయాలో అర్థం కాక స్టేషన్ లో కూర్చుంటే నాకు కన పడి దాని బాధ అంతా చెప్పు కుంది.... ఇ ప్పుడూ ఈల....

అని చెప్తూ బోరుమంది.....

ఏమి అనుకోకు.....బాధ నీ ఎవరికీ చప్పుకోలేక 2 రోజులుగా ఏడుస్తున్న నువ్వు నన్ను అడిగే సరికి ఉండ బట్టలేక ఇలా చెప్పేశా...

అయ్యో...పరవ లేదు అండి...నేను దిగే చోటు వచ్చింది...వెళ్తాను బాధ పడకండి...అని చెప్పి ఇంటికి వెళ్లి పోయా.... ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటే ఎంతో బారం గా అనిపించింది....అందరు తన పరిస్థిుల గురించి కాక వాళ్లకు తోచిన ది మాట్లాడుతుంటే నక్ చాలా భాధగా అనిపించింది...20 ఏళ్ళ అమ్మాయి...ఎం తెలియని వయసు...ఎంత నరకం అనుభవించింది....ఎప్పుడు కూడా పైన చూసి ఒక మనిషి గురించి అంచనా వేయ కూడదని....


ఇది కథ కాదు...నిజ జీవితం లో జరిగిన సంఘటన....
Rate this content
Log in

Similar telugu story from Drama