STORYMIRROR

Dinakar Reddy

Drama

4  

Dinakar Reddy

Drama

నిక్షిప్తమైన జ్ఞాపకాలు

నిక్షిప్తమైన జ్ఞాపకాలు

1 min
467

ధన్వీ! ఏం చేస్తున్నావమ్మా?

అని పిలుస్తూ నేను డ్రాయింగ్ రూమ్ లోపలికి వెళ్లాను.


మా మూడేళ్ళ అల్లరి పిడుగు ధన్వి పాత ఫోటో ఆల్బమ్స్ ముందు వేసుకొని చూస్తోంది.

దాని అల్లరికి భరించలేక మా ఆవిడ ప్లే చేసిన ట్రిక్ ఇది అని అర్థం చేసుకున్నాను.


ఒక్కో ఫోటోలోని వ్యక్తి దగ్గరా తన చిన్ని చూపుడు వేలితో గుచ్చి ఎవరు అని అడగడం.నేను దానికి మీ అత్త మీ పెదనాన్న అంటూ వివరించడం.

తను చూసిన వాళ్ళ ఫోటోలు రాగానే చూసి కేరింతలు కొట్టడం.

కొన్ని ఫోటోలు మళ్ళీ మళ్ళీ తిప్పి చూడడం.


ఎన్నెన్నో జ్ఞాపకాలు నిక్షిప్తమైన ఆ ఫోటోలు చూపిస్తూ చూస్తూ నేను కాలంలోకి వెళ్లి వచ్చినట్లు ఫీలయ్యాను.

తండ్రీ కూతుళ్ళూ కొంచెం ఈ లోకంలోకి వస్తే భోజనం చేద్దాం అని మా ఆవిడ పిలవడంతో ఈ లోకంలోకి వచ్చాను.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Drama