Lahari Mahendhar Goud

Comedy Drama Children

4  

Lahari Mahendhar Goud

Comedy Drama Children

నేటి డాడీ

నేటి డాడీ

2 mins
178


 సరదాగా ఆధ్యను తీసుకొని సాయంత్రం పూట దగ్గరలోని పార్క్ కి వెళ్లింది శృతిఆధ్య ఆడుకుంటూ ఉన్నది కాస్త శృతి దగ్గరకు వచ్చి

మమ్మీ... మమ్మీ...

అటు చూడు

మా మాథ్స్ మిస్ వస్తుంది

అని కొంచం ఎక్సయిట్మెంట్ కొంచం భయంతో చెప్తూ ఉండగానే

మమత ఆధ్యను చూసి నవ్వుతూ వచ్చి

హెల్లొ ఆధ్య పాప

నువ్వేంటి ఇక్కడ

ఆడుకోవటానికి వచ్చావా

ఒక్క దాన్ని మీ డాడీ ఎలా పంపించాడు

ఆద్య ఒక్కతే రాలేదండి

నేను తీసుకుని వచ్చాను అని శృతి నవ్వుతూ అక్కడికి వచ్చింది

మీరూ... అంటూ కొంత ఆశ్చర్యార్థకంగా శృతినే చూస్తున్న మమతకు

నేను ఆధ్య వాళ్ళ మమ్మీని...అంటూ పరిచయం చేసుకుంది శృతి

ఏంటి ఆధ్య నీకు మమ్మీ ఉందా అంటూ నోరేళ్ల పెట్టింది మమత

శృతి కోపంగా

అదేం ప్రశ్నండీ

మమ్మీ లేకుండా పాప ఎలా వస్తుంది...

అయ్యో సొరి అండి నేనేదే కంగారులో అలా అడిగేశాను

అని మమత కొంచం ఇబ్బందిగా చేతులు నలుపుకుంటూ ఉంటే

అది కాదండీ

ఎప్పుడూ ఆధ్య వాళ్ళ డాడీయే

లంచ్ టైంలో వచ్చి భోజనం తినిపించి వెళ్తుంటే...అంటూ మమత చెప్పటం పూర్తి అవకుండానే

హా వెళ్తుంటే అని శృతి సీరియస్ గా చూస్తుంటే

మమత కొంచం తడబడుతూ

అంటే ఆధ్య పాపకు మమ్మీ లేదేమో అనుకున్నారు

మా స్టాఫ్ అంతా

వెంటనే శృతీ బాధతో నిండిన కోపంతో

అలా ఎలా అనుకుంటారండి

అయ్యో అది కాదు మేడం

ఆధ్య స్కూల్లో జాయిన్ అయిన డే వన్ నుండి

ఇప్పటి వరకు మీరు ఒక్క సారి కూడా స్కూల్ కి రాలేదు కదా

మే బీ సింగిల్ పేరెంట్ ఏమో అనుకున్నాం

అందుకే మీ హస్బెండ్ కొంచం లేట్ గా వచ్చినా కూడా

మా స్టాఫ్ లో ఎవరో ఒకరు ఆధ్య పాపకు తినిపించే వాళ్ళు

చాలా కన్సర్న్ ఉండేది ఆధ్య పాప మీద

అయినా మీరు ఏం మమ్మీ అండి

పాపను చూడటానికి ఒక్క సారి కూడా మీరు స్కూల్ కి రాలేదు అని మమత అడగగానే

అంటే ఆధ్యను చూడటానికి స్కూల్ కి రాకపోతే

పాపకు మమ్మీ లేనట్లేనా

పాప వాళ్ళ మమ్మీ జాబర్ అయుండొచ్చుగా

ఎందుకు అలా ఆలోచించలేకపోయారు...శృతి అడిగిన ప్రశ్నకు మమత దగ్గర సమాధానం లేక మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది

________________

ఇంటికి వస్తూనే శృతి ఆమె భర్తతో

మీ కూతురు మీద మితిమీరిన ప్రేమతో

బయట నన్ను అందరిలో చంపేస్తున్నారు తెలుసా

ఆధ్య కేవలం మీకు మాత్రమే కూతురా

నాకు ఏమి కానట్లు

ఎన్ని సార్లు అడిగినా నన్ను ఆధ్య స్కూల్ కి తీసుకువెళ్ళారా మీరు

ఏమైనా అంటే టైమింగ్ సింక్ అవట్లేదు అని తప్పించుకొని

నలుగురిలో నాకు కూతురు మీద ప్రేమలేనట్లు మీరే చేస్తున్నారు

వెంటనే ఆధ్య వాళ్ళ డాడీ

చూడు శృతి నువు ఏ విషయంలోనైనా నాతో గొడవపడు కానీ నా కూతురు విషయంలో మాత్రం నాకు ఆధ్యకు మధ్యలోకి ఎవర్నీ రానివ్వన్ను అని చెప్పి కూతురుని తీసుకొని ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్ళాడు

వెళ్తున్న తండ్రీ కూతురును అలాగే చూస్తూ ఉండిపోయింది శృతి...

ఈ సమస్య కేవలం శృతిది మాత్రమే కాదు

నేటి మమ్మీలందరిదీ

ఇంక్లూడింగ్ మీ....



Rate this content
Log in

Similar telugu story from Comedy