కిరణ్ విభావరి

Tragedy

5.0  

కిరణ్ విభావరి

Tragedy

నా రాముడు

నా రాముడు

10 mins
433


ముందుగా రామ జన్మభూమి లో రాముడి గుడి కట్టించే అధికారం మనకు దక్కినందుకు అభినందనలు.నేను రాముడ్ని దేవుడని నమ్మను. కానీ మనిషి ఎలా ధర్మ బద్దం గా జీవించాలో చెప్పిన మహనీయ పాత్ర రాముడు. అటువంటి వారికి గుడికట్టడంలో తప్పులేదు కదా. దేవుడని నమ్మని వారు కూడా దీన్ని స్వీకరించాలి. ఆయన సీతా దేవిని అడవుల పాలు చేసాడుగా అని అంటారు...కానీ భర్త కన్నా ముఖ్యంగా ఆయన ఒక రాజు.... ప్రజాస్వామ్య వ్యవస్థ లో ప్రజలకు నచ్చిందే రాజు చెయ్యాలి అంతే కాని తనకు ఇష్టమైన పని కాదు. ప్రజాస్వామ్యాన్ని హేతుబద్దంగా పాటించిన గొప్ప వ్యక్తి అందుకే ఆయన అలా చెయ్యవలసి వచ్చింది..అది వేరే విషయం. అయితే నా ఫ్రెండ్స్ చాలా మంది నన్ను హిందూ వాది అని అంటారు. అవును నేను హిందూ మతము మరియు దాని ధర్మాన్ని పూజిస్తూ గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అత్యంత ప్రాచీన మతం, ఏం మతపు ఒత్తిడికి లొంగకుండా తన ఉనికిని కొల్పోని మతం నా హిందూ మతం. నేను ఈ మతంలో పుట్టాను కాబట్టి నా మతాన్ని గౌరవించడం నా కర్తవ్యం. (నేను మా అమ్మకు పుట్టాను కాబట్టి మా అమ్మను ప్రేమిస్తా, గౌరవిస్తాను. ఆమె బాగోగులు చూసుకుంటాను. పక్కింటి వాళ్ళ అమ్మ మంచివారు ఆమెను గౌరవిస్తాను అంతే కానీ మా అమ్మకన్నా ఎక్కువ కాదు కదా..మాట్లాడితే చాలు హిందూ వాది అంటారు...మన అమ్మను మనం పొగడడం, ప్రేమించడం ఎలాగో నా మతాన్ని గౌరవించడం అంతే ముఖ్యం) మని శంకర్ అయ్యర్ అనే కాంగ్రెస్ పార్టీ ప్రభుద్దుడు..దశరథుడికి చాలా గదులు ఉన్నాయి..రాముడు ఆ గదిలోనే పుట్టాడని గారెంటి ఏంటి అని ప్రశ్నించాడు. ఆలాంటి నీచమైన కామెంట్లు చేసే వాళ్ళకి ఈ తీర్పు చెంప పెట్టు. ఈ తీర్పు సాక్ష్యాలను పరిశీలించి ఇచ్చారు అంతేగానీ భావోద్వేగాలకు లోబడి కాదు అని అందరూ గుర్తు పెట్టుకోవాలి. ముస్లిం రాజులు దాదాపు 40000 గుడులను ద్వంసం చేసి మసీదులు కట్టారు. మనం వాటన్నిటినీ కూల్చి మందిరం కట్టమని అడగట్లేదు కదా కేవలం ఒక్క రామ జన్మ భూమిని అది హిందువుల నమ్మకానికి గౌరవానికి ప్రతీక అది మాత్రమే అడుగుతున్నాం. ఇది మన హిందువుల ఆత్మ గౌరవానికి మైలు రాయి...హిందూస్తాన్ లో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన మతంలో మనం మన హక్కులను తుంగలో తొక్కి బతుకుతున్న కాలంలో ఇది ఒక మరువరాని విజయం.

మహమ్మద్ జన్మస్థలం..మదీనా మాక్కా...అది అంగరంగ వైభోగంగా అలరారుతోంది

జీసస్ క్రీస్తు జన్మస్థలం బెత్లేహేం... క్రీస్తు వుల ప్రార్థనలతో కీట కిట లాడుతుంది..

కానీ మన రాముని జన్మ భూమి మాత్రం రాళ్ళతో నిండి ఉంది...ఇది మన జాతికే అవమానం కాదా... ఒకసారి నేను చదివిన జోక్ ఒకటి గుర్తుకు వస్తుంది.

ఒకరిని" నీది ఏ మతం "అంటే??

"నాది మానవ మతం..మానవ జాతి..మానవత్వమే నా మతం" అని చెప్పాడు

"ఓహ్ అయితే నువ్వు హిందువువా" అని ఆయన చక్కా పోయాడు...

ఇలా ఉంటుంది మన పరిస్తితి...అందరూ తమ తమ మతానికి దైవానికి పూర్తి నమ్మకంతో అంకితం అయితే

మనం మాత్రం దేవుడు లేడు దెయ్యం లేదు అంటూ మన పురాణాల్ని, మన దేవుళ్ళని కించపరుస్తూ ప్రశ్నిస్తూ ఉంటాం...మనకు తోడు టీవీ వాళ్ళు కూడా మన మతం మీదే డిబెట్లు...ఎందుకంటే మనం చేతకాని వాళ్ళం చీము నెత్తురు లేని వాళ్ళం.. నేను మతవిద్వేసం పెంచుకోండి అని చెప్పట్లేదు...మన మతాన్ని మనం ప్రేమించుకుందాం అని చెప్తున్నా...

మతం మనల్ని మనుషులుగా చేస్తుంది. నిజంగా దైవానికి భయపడేవారు ఎప్పుడూ తప్పు చెయ్యరు. అందరినీ గౌరవిస్తూ మానవత్వంతో బతుకుతారు. మానవత్వంనే మతంగా చేసుకోరు అది ఒక ధర్మంగా భావిస్తూ ధర్మాన్ని నిలబెడతారు. ఇప్పుడు దేవుడు లేడు, మానవత్వం నా మతం అని చెప్పుకోవడం ఒక ఫ్యాషన్ అవుతోంది అందుకే ఇదంతా రాయవలసి వచ్చింది

లౌకిక వాదం చాలా ముఖ్యం కానీ హిందువులను మార్చినప్పుడు గుర్తుకు రాని లౌకిక వాదం హిందువులుగా మారినప్పుడు గుర్తుకు వస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ లో ఘర్ వాపసి పేరుతో. 200 అన్య మతస్థుడు లను హిందూ మతంలో చేర్చినప్పుడు గుర్తుకు వచ్చిన లౌకికవాదం ఏటా 8 లక్షల హిందువులు వేరే మతంలోకి మారుతున్నప్పుడు గుర్తుకురాదు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ముస్లింలు 8రెట్ల అధికంతో పెరుగుతుంటే పాకిస్తాన్ లో హిందువులు 12 శాతం నుండి 2 శాతానికి పడిపోయారు...అప్పుడు గుర్తుకు రాదు లౌకికవాదం. కేవలం మనమే పాటించాలని రాసిపెట్టారా నవంబర్ 9 ...బెర్లిన్ గోడ కూల్చిన రోజు

నవంబర్ 9 ... కర్తర్పుర్ కారిడార్ ఏర్పాటు చేసిన రోజు

నవంబర్ 9... రెండు మతాల పరస్పర ఆమోదం తో మందిర నిర్మాణం కోసం ముస్లింలు తమ మసీదును అర్పించిన రోజు...

ఇది జాతి ఔన్నత్యాన్ని...అనేకం లో ఏకం అనే భావనకు నిదర్శనం.



Rate this content
Log in

Similar telugu story from Tragedy