కిరణ్ విభావరి

Inspirational

4.9  

కిరణ్ విభావరి

Inspirational

సియాచిన్

సియాచిన్

10 mins
371


సియాచిన్, ఈనాడు పత్రిక సేకరణ జయ జవాన్ జయ హింద్ 


ఒక కప్పు టీ చేసుకోవాలంటే మూడు నిమిషాలు చాలు మనకి. మూడు గంటలు పట్టిందంటే... అది సియాచిన్ ప్రాంతం అయివుండాలి. మంచును కరిగించి, ఆ నీటిని మరిగించి, టీ కాచేసరికి అంత టైమవు తుంది. కష్టపడి చేసుకున్నాం కదా 


అని ఒక్కో గుక్కా ఓ పావుగంట తాగుదామను కుంటే అది అత్యాశే. గబగబా తాగకపోతే మూడో నిమిషంలో కప్పులో మంచుముక్కే మిగులుతుంది మరి.


కప్పు టీ చేసుకోడానికే ఇంత కష్టమైన చోట దాదాపు పదివేల మంది సైనికులు ఏడాది పొడుగునా రేయింబగళ్లు కాపలా కాస్తున్నారు.


సియాచిన్... హిమాలయాల్లో ఉన్న అతి పెద్ద మంచుదిబ్బ. కీలకమైన సరిహద్దు ప్రాంతం. పశ్చిమాన పాకిస్థాన్, తూర్పున చైనా... మధ్య త్రికోణాకారంలో ఉన్న ఈ పర్వత ప్రాంతం ప్రపంచంలోనే ఎత్తైన


యుద్ధభూమి. అక్కడ ఇప్పుడు శత్రువుల కన్నా ఎక్కువగా ప్రకృతితో యుద్ధం చేస్తున్నారు మన సైనికులు. .


తలదాచుకోను వెచ్చని నీడ ఉండదు. తాగడానికి నీరుండదు. గుండెల నిండా పీల్చుకోడానికి గాలీ ఉండదు. అయినా సరే ఒంటిమీద ఇరవై ముప్పై కిలోల బరువును


మోస్తూ గస్తీ తిరగాలి. పైనుంచో పక్క నుంచో విరిగిపడే మంచు చరియల కింద కూరుకుపోకుండా, 200కి.మీ. వేగంతో వీచే మంచుతుపానుకు చిక్కకుండా, హఠాత్తుగా విచ్చుకునే మంచులోయల్లోకి జారిపోకుండా... మూడు నెలలు డ్యూటీ చేసి 


సురక్షితంగా తిరిగి వచ్చాడంటే ఆ సైనికుడు మరో జన్మ ఎత్తినట్లే.


సియాచిన్ కి సైన్యాన్ని వారికి అవసరమైన వస్తువుల్ని పంపించే బేస్ క్యాంపే సముద్ర మట్టానికి 12 వేల అడుగుల ఎత్తున ఉంటుంది. అక్కడి నుంచి పై పైకి వెళ్లినకొద్దీ వరసగా వందకు పైగా సైనిక స్థావరాలుం టాయి. 128కి. మీ. పరిధిలో ఉన్న 


ఈ స్థావ రాల్లో అన్నిటికన్నా పైన ఉన్నది 23 వేల అడుగుల ఎత్తున ఉన్న బనా పోస్ట్. ఒక్కో సైనిక పోస్టులోనూ అవసరాన్నిబట్టి ఆరు నుంచి 10 మంది వరకూ సైనికులుంటారు.


మనకి చలికాలంలో ఉండే కనిష్ట ఉష్ణోగ్రత అక్కడ వేసవి కాలపు గరిష్ఠ ఉష్ణోగ్రత. ఇక చలి కాలం అయితే పగలు


మైనస్ 30 ఉంటే రాత్రయ్యేసరికి మైనస్ 60 డిగ్రీల వరకూ వెళ్తుంది. ఆ చలి తట్టుకోలేక గత మూడున్నర దశాబ్దాల్లో దాదాపు 900 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణమే శత్రువు


సియాచిన్లో బాధ్యతలు నిర్వహించాల్సిన సైనికులకు నెలరోజులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. మంచుకొండల్ని ఎక్కడం, తీగ వంతెన సాయంతో లోయల్ని దాటడం, కూరుకుపోయిన వారిని రక్షించడానికి మంచు గొడ్డలితో మంచుపలకల్ని 


కోయడంలాంటి వాటితోపాటు ముఖ్యంగా ఆ వాతావరణంలో తమను తాము కాపాడుకోవటం ఎలాగో నేర్పిస్తారు. ఎందుకంటే అక్కడ గాలి పీల్చడం దగ్గర్నుంచీ నీరు తాగడం వరకూ ప్రతి పనీ ఓ సాహసమే. సాధారణంగా చుట్టూ ఉన్న 


వాతావరణానికి అలవాటుపడేం దుకు ప్రయత్నిస్తుంది. మన శరీరం. అందుకే ఎండల్నీ వానల్నీ చలిని తట్టుకుంటున్నాం. అయితే సముద్ర మట్టానికి 17 వేల అడు గుల ఎత్తు దాటాక మనిషి శరీరంలో వాతా వరణాన్ని తట్టుకునే శక్తి పూర్తిగా 


పోతుంది. ఈ సైనికులేమో 23 వేల అడుగుల ఎత్తు వరకూ వెళ్తారు. మంచుతో ముంచుకొచ్చే ప్రమాదాలకు అందకుండా జాగ్రత్తపడుతూనే ఆరోగ్యంతో మరో యుద్ధమూ చేస్తారు. శ్వాస కోసం నిద్రలేస్తారు!


శ్వాస... మనకి అసంకల్పితంగా జరిగి పోయే ప్రక్రియ. అక్కడ దానికి చాలా కష్ట పడాలి. మనకు దొరికే ఆక్సిజన్లో పది శాతమే అక్కడ దొరుకుతుంది మరి. అందు కని పట్టుమని నాలుగు గంటలు నిద్రపోవ డానికి కూడా ఉండదు. రాత్రిపూట 


ఒకరు ఎప్పుడూ మెలకువగా ఉండి గంటకోసారి మిగిలినవాళ్లను లేపుతుంటారు. లేచి, గుండెల నిండా ఆక్సిజన్ పీల్చుకుని మళ్లీ పడుకుంటారు. అలా లేపకపోతే గదిలో కిరోసిన్ స్టవ్ వల్ల వెలువడే కార్బన్


మోనాక్సైడ్ పీల్చుకుని నిద్రలోనే ప్రాణాలు విడుస్తారు. ఇక అంత ఎత్తున ఉండటం వల్ల కళ్లు తిరుగుతుంటాయి. భరించలేని తలనొప్పి వేధిస్తుంటుంది. తిండి తినబుద్ది కాదు, నిద్ర పట్టదు. దాంతో బరువు తగ్గి పోతారు. ఎక్కువ కాలం ఆ 


వాతావరణంలో ఉంటే జ్ఞాపకశక్తిని కోల్పోతారు, మాట స్పష్టత పోతుంది. అంతేకాదు, మెదడులోకీ ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి అకస్మాత్తుగా జబ్బుపడతారు. డీహైడ్రేషన్ కి గురవుతారు. చెవులు వినిపించవు. తెల్లని మంచుని చూసి చూసి 


కనుచూపు కూడా దెబ్బతింటుంది. కత్తిలా కోసేస్తుంది!


నడిచే నేల మంచు. చుట్టూ కన్పించే కొండలు మంచు. వీచే గాలీ మంచులా చల్లగా ఉంటుంది. ఆ చల్లదనాన్ని తట్టుకోడా నికి ఐదారు పొరల దుస్తులు ధరిస్తారు. కాళ్లకీ చేతులకూ రకరకాల తొడుగులు వేసు కుంటారు. కళ్లకి గాగుల్స్ 


పెట్టుకుంటారు. . శరీరంలోని ఏ భాగంలోనూ అంగుళం కూడా ఆచ్చాదన లేకుండా క్షణమైనా ఉండడానికి వీల్లేదు. అలా ఉన్నప్పుడు లోహపు వస్తువు ఏదైనా తాకితే అక్కడ చర్మం ఉన్నపళాన ఊడొచ్చేస్తుంది. కేవలం కొద్ది సెకన్లు చాలు,


ఫ్రాస్ట బైట్ తన పని చేసేస్తుంది. అందుకని ఇంత పకడ్బందీగా దుస్తులు ధరించి సరుకులు మోస్తూ ఒక స్థావరం నుంచి మరో స్థావరానికి నడుస్తుంటే- శరీరం వేడికి లోపల చెమట పడుతుంది. అది దుస్తు లోపల సన్నని మంచుముక్కలుగా 


మారి *......


. . . - - శరీరాన్ని కోసేస్తుంటే- ఆ అవస్థ వర్ణనా తీతం. దానికి తోడు నెలల తరబడి స్నానం చేయడానికి ఉండదు. పొడి తువ్వాలుతో ఒళ్లు తుడుచుకోవటమే. దుస్తులు ఎప్పుడు మార్చుకోవాలి. ఎప్పుడు ఒళ్లు తుడుచుకోవాలి అన్నది కూడా 


వైద్య అధికారుల సూచన మేరకే చేయాలి. మంచుబొరియలే ఇళ్లు


ఫైబర్ గ్లాస్ ప్యానెల్స్ కట్టిన చిన్న గుడారాల్లోనో, మంచు బొరియల్లోనో సైనికులు నివసిస్తుంటారు. ఆఫీసరు. సైనికుడు


అన్న తేడా లేకుండా అందరూ అందులోనే సర్దుకుపోతారు. ఒక మంచం అంత ఉండే స్థలంలో ఆరుగురు పడుకోవాలి. అలా పడుకోవడానికి వీలు కానప్పుడు ముగ్గురు ముగ్గురు చొప్పున వంతులేసుకుని పడు కుంటారు. కొన్ని చోట్లయితే అది 


కూడా సాధ్యం కాదు. అందుకని మంచునే గుహలా తవ్వి స్థావరంగా చేసుకుంటారు. కాలకృ త్యాలు తీర్చుకోడానికి డీఆర్‌డీవో ప్రత్యేకంగా కట్టిచ్చిన క్యాబిన్స్ వాడతారు. అసలా చలిలో కాలకృత్యాలు తీర్చుకోవడమూ ఇబ్బందే. విరేచనం 


అవడానికి మందులు ఎక్కువగా వాడాల్సివస్తుంది. హీటర్లుండవు. కిరస నాయిల్ స్టవ్ మీద ప్రత్యేకంగా రంధ్రాలు చేసిన డబ్బాలను కప్పుతారు. అవి రేడియే టర్లుగా పనిచేస్తాయి. అవి తప్ప మిగతావేవీ అక్కడ పనిచేయవు. వాటివల్లే వారు 


విశ్రాంతి తీసుకునే గదిలో కాస్త వెచ్చదనం ఉంటుంది. అక్కడి నుంచి మళ్లీ మైనస్ 40, 50 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండే సెంట్రీ పోస్టు దగ్గరికెళ్లి డ్యూటీ చేయడం అంటే నరకమే. అలాగని బద్దకించి ఒక్క పోస్టుని కాసేపు ఎవరూ వెళ్లకుండా వదిలేస్తే- 


కాచుకుని ఉన్న శత్రువు నిమిషాల్లో దాన్ని వశం చేసుకో వచ్చు. ఇక ఆ తర్వాత తిరిగి దాన్ని ఆక్ర మించుకోవాలంటే చాలా ప్రాణాలను పణంగా పెట్టాల్సివస్తుంది. అందుకే ఎంత కష్టమైనా సరే బద్ధకించకుండా డ్యూటీ చేస్తారు. సైని కులు. 


పండగలూ పనిగంటలూ సెలవులూ ఏమీ ఉండవక్కడ. ఇరవై నాలుగ్గంటలూ ఏడాది పొడుగునా కాపలా పనే. ఆపిల్ క్రికెట్ బంతిలా...


రియల్, ఫ్రూటీ లాంటి జ్యూసు పాకెట్లు, రకరకాల బిస్కట్లు, చాకొలెట్లు, సూప్స్,


డ్రై ఫ్రూట్స్.. ఎవరికైనా అయితే ఆ పాకెట్లన్నీ చూస్తే నోరూరిపోతుంది. జిహ్వ చచ్చి పోయి ఉన్న అక్కడి వారికి మాత్రం వాటిని చూస్తే విరక్తి పుడుతుంది. టిన్ క్యానుల్లో వచ్చిన ఆ ఆహార పదార్థాలనుంచి నారింజో ఆపిల్


పండో బయటకు తీయడం ఆలస్యం- క్రికెట్ బంతిలా గట్టిగా మారిపోతుంది. పదార్థాల్ని సుత్తీ శానం లాంటి వాటితో పగలగొట్టుకుని వేడి చేసుకుని నిమిషంలో తినేయాలి. కోడిగుడ్లు కూడా రాళ్లలాగా మారిపోతాయి


మరి. జ్యూస్ పాకెట్ పైన కాగితం తీసేస్తే లోపల జ్యూస్ గడ్డకట్టి ఇటుక లాగా ఉంటుంది. తప్పదు కాబట్టి తినడమే కానీ లేకపోతే ఆ చల్లని పాకెట్లని వేడి చేసుకుని తినబుద్దే కాదసలు అంటారు. సైనికులు. నాలుగైదు నెలలపాటు తాజా ఆహారం 


అనేది కంటికి కూడా కనపడకుండా బతకడం అంటే నరకమేగా. మంచి నీళ్లు తాగాలన్నా మంచు ముక్కల్ని స్టవ్ మీద కరగబెట్టా ల్సిందే. అదెంత సేపు... వేడి చేసుకుంటే కాస్త చలీ తగ్గుతుంది కదా అనుకోవచ్చు కానీ, అదీ కష్టమే. 


ఎందుకంటే... గ్లోవ్స్ వేసుకున్న చేతులతో కిరోసిన్ స్టవ్ వెలిగించడమంటే- బ్రహ్మ ప్రళయమే! ఆ చేతులు కదలవు!


గ్లోవ్స్ వేసుకున్నా పనిచేసుకోవచ్చు కానీ అవి ఒక్కటే వేసుకుంటే చలికి తట్టుకోలేరు. అందుకని వాటి మీద మిటెన్స్(వీటికి వేళ్లు విడివిడిగా ఉండవు. బొటన వేలొక్కటే విడిగా ఉంటుంది) వేసుకోవాలి. అవి వేసు కుంటే చేతులు తేలిగ్గా కదలవు. 


వాటిని తీసి పడేసి గబగబా పనిచేసుకుందామనిపిస్తుంది కానీ ఆ తర్వాత అసలు పనిచేయడానికి వెళ్లే ఉండవని గుర్తొచ్చి ఎంత కష్టమైనా


హెలికాప్టర్ దిగడానికి బోర్న్ విటా! 


అసాధారణమైన వాతావరణంలో అసాధ్యమైన పనుల్ని సుసాధ్యం చేస్తున్న సియాచిన్ సైనికుల గురించి మరికొన్ని...


* సన్నగా మంచుకురుస్తున్నప్పుడు హెలిపాడ్ ఎక్కడుందో కన్పించదు పైలట్ కి. అందు కని బోర్న్ విటా,


జామ్, డ్రైఫ్రూట్స్ లాంటివి ఉపయోగించి హెలిపాడ్ సరిహద్దులు కన్పించేలా చేస్తారు. * సైనికులు నీళ్లు నింపిన కండోమ్ ని జేబులో ఉంచుకుంటారు. ఎందుకంటే పెట్రోలింగ్ చేసేటప్పుడు ఎక్కడ చిక్కుబడిపోతారో తెలియదు. తేలికగా ఉండి లీటరు 


నీళ్లు పట్టే కండోమ్ జేబులో ఉంటే ఆ నీటితో రెండు రోజులు ప్రాణాలు కాపాడుకోవచ్చు. * అక్కడ డ్యూటీ చేసేవారికి జీతంతో పాటు అదనంగా నెలకు రూ.14వేల సియాచిన్ అలవెన్సు ఇస్తారు. * వాతావరణం కాస్త పర్వాలేదనుకున్నప్పుడు సి 


విటమిన్ టాబ్లెట్ సాయంతో పాలు తోడుపెట్టుకుని పెరుగు చేసుకుంటారట.


ఏమిటీ సియాచిన్? ఎందుకీ కాపలా? భారత్, పాకిస్తాన్ల మధ్య సరిహద్దు విషయమై చేసుకున్న కరాచీ, సిమ్లా తదితర ఒప్పందాల్లో సియాచిన్ గ్లేషియర్ ప్రాంతంపై స్పష్టత లేకపోవటంతో ఆ ప్రాంతాన్ని రెండు దేశాలూ తమదిగా


భావిస్తూ వచ్చాయి. మనుషులు తిరిగే ప్రాంతం కాకపోవటంతో 1970వ దశకం వరకూ ఇది ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. మనదేశం నుంచీ సియాచిన్ వెళ్లాలంటే హెలికాప్టర్ తప్ప మరో మార్గం లేదు. పాకిస్తాన్ నుంచి మనకన్నా కాస్త 


సులభంగా ఎక్కవచ్చు. దాంతో అటునుంచి పర్వతారోహకుల తాకిడి పెరిగింది. వారికి తోడుగా పాక్ సైనికాధికారులు వెళ్లేవారు. ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్లో భాగంగా చూపుతూ అమెరికాలో మ్యాపులు ప్రచురితమయ్యాయి. జర్మన్ పర్వతారోహకుల 


ద్వారా ఈ విషయం తెలుసుకున్న భారత అధికారి కల్నల్ నరేంద్రకుమార్ స్వయంగా ఒకటికి రెండుసార్లు సియాచిన్ కి వెళ్లి వచ్చి సవివరంగా నివేదికలు ఇచ్చారు. అదే సమయంలో సియాచిన్ని ఆక్రమించుకోవడానికి పాకిస్థాన్ సైన్యం 


సిద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో సరిగ్గా వారికన్నా మూడు రోజుల ముందే భారత సైన్యం అక్కడికి చేరుకుని సియాచిన్ గ్లేసియర్‌ నీ చుట్టుపక్కల


ప్రాంతాల్నీ తన అదుపులోకి తీసుకుంది. ఒకవేళ ఆ ప్రాంతం పాకిస్థాన్ వశమైతే సియాచిన్ మీదుగా లదాఖోకీ శత్రువు తేలిగ్గా చేరుకునే వీలుంటుంది. అందుకే కీలకమైన ఈ ప్రాంతాన్ని సరైన సమయంలో వశపర్చుకున్న భారత్ అప్పటి నుంచీ 


అక్కడ సైనిక స్థావరాలను


కొనసాగిస్తోంది.


అలాగే సర్దుకుపోతారు. ముక్కు, చెవులు, చేతివేళ్లు.... చలి ప్రభావానికి ప్రమాదానికీ


మొట్టమొదట లోనయ్యే భాగాలు. కిలోలకొద్దీ బరువున్న దుస్తుల్ని ఆయుధాల్నీ మోస్తూ తిరిగే బదులు ఆ చలికి కదలకుండా ఓ మూల ముడుచుకు కూర్చోవాలనిపిస్తుంది. అలా కూర్చుంటే శరీరం బిగుసుకుపోతుంది. వాళ్లు ఆరోగ్యంగా 


ఉండాలంటే వ్యాయామం చాలా ముఖ్యం. అందుకని హెలికాప్టర్ ఒకచోట దించిన సరు కుల్ని చుట్టుపక్కల స్థావరాలకి చేరవేసే బాధ్యత సైనికులదే. ఒకప్పుడు కిరోసిన్ క్యాన్స్న వీపున మోస్తూ ఐదారు గంటలు నడిచేవారు. ఇప్పుడు బేతిక్యాంప్ 


నుంచి చివరి క్యాంపు వరకూ పైప్లాన్ వేసి మధ్యలో పంపింగ్ స్టేషన్లు పెట్టారు కాబట్టి ఆ పని తప్పింది. గస్తీ తిరిగేటప్పుడు డేగ కళ్లతో చుట్టుపక్కల చూడడం ఎంత అవస రమో కింద నేలను పరిశీలించి చూడడమూ అంతే అవసరం. హఠాత్తుగా 


మంచు పెళ్ల కదిలి లోతుగా గొయ్యి ఏర్పడి అందులో కూరుకుపోవచ్చు. అందుకే వరసగా తాడుప ట్టుకుని నడుస్తుంటారు. ఏ ఒక్కరు జారినా మిగిలినవారు అప్రమత్తమై ఆ తాడు సాయంతో పడిపోయినవారిని పైకి లేపు తారు. వాతావరణం 


అనుకూలించినపుడు యోగా కూడా చేస్తుంటారు. మనసుని చిక్కబట్టుకుని... శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోదు, మనసునీ కుంగిపోకుండా కాపాడు కోవాలి. నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండటంతో ఒంటరితనం 


వేధిస్తుంది. పక్కన ఉన్న ఐదారుగురు సైనికులతో ఏం మాట్లాడతారు. ఎంత సేపని మాట్లాడతారు. అయినా తప్పదు కాబట్టి మనసు మళ్లించుకోడానికి రకరకాల పనులు చేస్తుంటారు. కొంతమంది పుస్తకాలు చదువు తారు. కొందరు పేకాట 


ఆడతారు. సినిమా పాటలు పాడుకుంటారు. ఇంటి నుంచి వచ్చే ఉత్తరాలను పదే పదే చదువుకుంటారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చాక ఎవరూ సరిగ్గా


ఉత్తరమే రాయడం లేదని వాపోతుంటారు కొందరు. ఆర్మీవైవ్స్ అసోసియేషన్ నుంచి వచ్చే గ్రీటింగ్ కార్డులు చాకొలెట్లూ చూసు కుని మురిసిపోతుంటారు. అత్యవసరమైతేనే శాటిలైట్ ఫోనుతో రెండు నిమిషాలు మాట్లా డుకునే అవకాశం ఇస్తారు. 


అధికార్లకూ పరీక్షే! సియాచిన్ బేస్ క్యాంప్లో ఉండే అధికార్లకు విధి నిర్వహణ రోజూ కత్తి మీద సామే. ఒక్కో క్యాంప్ నుంచీ ఒక్కో సమస్యతో ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఒకచోట ఆరోగ్యం బాగా లేదనీ మరోచోట గస్తీకి వెళ్లినవాళ్లు కన్పించ కుండా 


పోయారనీ... ఇలా ఏదో ఒక ఫిర్యాదు అందుతూనే ఉంటుంది. వెంటనే


హెలికాప్టర్ని పంపించి ఆరోగ్యం బాగాలేని వారిని కిందికి తీసుకొస్తారు. హెలికాప్టర్ని కూడా ఎప్పుడు పడితే అప్పుడు పంపడానికి వాతావరణం అనుకూలించదు. మధ్యాహ్నం దాటితే గాలుల వేగం పెరుగుతుంది. అత్యవసరమైతే తప్ప రిస్క్ 


తీసుకోలేరు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుం టుంది అధికారి పరిస్థితి. అక్కడి వారిని రక్షించడానికి హెలికాప్టర్ పైలట్ ప్రమాదం లోకి నెట్టడం అవుతుంది. ఆ అధికారి ఎటూ నిర్ణయించుకునే లోపే అంతకు ముందు రోజు కింద ఆస్పత్రికి 


పంపించిన సైనికుడు ప్రాణాలు విడిచాడన్న వార్త వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పనిచేయడానికి ఎంతో మానసిక స్టెర్యం కావాలి. సియాచిన్లో ఉన్న సైనికు లకీ బయటి ప్రపంచానికి


లింకు సరుకులు చేరవేసే హెలికాప్టరే, అది వచ్చిందంటే వారికి పండగే. అది తెచ్చిన సరుకుల్లో వారు ఆత్రుతగా వెతుక్కునేది ఇంటినుంచి వచ్చిన ఉత్తరాలకోసమే. సియాచిన్ వాతావరణంలోనికి వెళ్లడానికి మామూలు హెలికాప్టర్లు పనికిరావు. 


ప్రత్యేకంగా తయారుచేసిన హెలికాప్టర్లను కూడా బలవంతాన తోసుకెళ్లినట్లు నడపాల్సి వస్తుంది. సైనిక స్థావరాల్లో ఉన్న వారికి వేళకి ఆహారం అందడమూ, సమయానికి వైద్యం అందడమూ లాంటివన్నీ సవ్యంగా జరిగాయంటే కేవలం అదృష్టం 


వారి పక్షాన ఉందన్నమాటే. దానికి మన దీవెనలూ తోడైతే... ఎప్పటికప్పుడు వారంతా క్షేమంగా విధులు ముగించుకుని తిరిగొస్తారు.


మిత్రమా, మేమెవరమో మీకు తెలియదు. మీకూ మాకూ ఏ రక్తసంబంధమూ లేదు. కానీ మాకోసం మా భద్రత కోసం ప్రాణాల్నే పణంగా పెట్టి మంచుకొండల్లో మగ్గిపోతున్నారు. ప్రతి నిమిషం మీకో గండమే, ప్రతిపూటా మీకో పుట్టుకే. 


అయినవాళ్లకు దూరంగా తిండీ తిప్పలూ లేకుండా కంటికి కునుకే రాకుండా మీరు పడుతున్న కష్టానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం... జై జవాన్ అని నిత్యం స్మరించుకోవడం తప్ప..!


Rate this content
Log in

Similar telugu story from Inspirational