Rajagopalan V.T

Abstract

3.5  

Rajagopalan V.T

Abstract

మరువకుమా

మరువకుమా

1 min
3.0K


రాముడూ

అయ్యా

ఈ కరోనా పురుగొచ్చి దేశాల్ని నాశనం చేస్తోంది కదరా..

అవునయ్యా

మన ప్రధానమంత్రేమో మంచి పని చేసేడాయే

ఇంటికాడనే వుండాలని బయటకు రావద్దని చెప్పాడాయే

అవునా అయ్యా

సరేలే రాముడు పుస్తాకాల బీరువాలో ఓ పుస్తకం తీసుకురారా...

అలాగే అయ్యా

ఏం పుస్తకం తెచ్చాడో ఏమో...

ఏమోయ్ కాసిన్ని నీళ్లు తేవే, అదిగో కంటద్దం ఆ టేబుల్ పైన వుంది అదికూడా తీసుకురావా

ఇదిగో నీళ్లు, అద్దాలు...

శెభాష్ రాముడు, మంచి పుస్తకమే తెచ్చావు

రాముడికి చిన్న సంతోషం.. ఏంటయ్యా మీరు మరీను..

ఒరేయ్ ఇది బాపట్ల బిడ్డ రాయప్రోలు సుబ్బారావు గారు

రాసిందిరా..

అట్లా ఏమి రాసారయ్యా అందులో...

చాలానే రాశారు గాని, ఈ సమయంలో ఏది చదివితే సరిగ్గా ఉంటుందో అదే చదువుతా సరేనా...

సరే అయ్యగారు

ఇదో ఇనుకో

ఏ దేశమేగినా ఎందు కాలిడినా

పొగడరా నీ తల్లి భూమి భారతిని

దేశాల చీకట్లు తొలగించు స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించు

ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు

వికసించే మన నేల విజ్ఞాన కిరణాలు

అరే ఇనేకి సాలా బాగుందయ్యా

రాముడూ ఇనేకే బాగుందంటే

మన ప్రధాని దాన్ని నిజం చేసాడురా...

అట్లాగయ్యా..

కరోనా పురుగుకి మందుల్లేక అందరూ బాధ పడుతుంటే

అందరికీ మందులు పంపించాడురా.. ఐకమత్యంతో అందరూ వుండాలని

అందరికీ మంచి చేయాలని

స్నేహం అంటే ఇలాగా వుండాలని తెలియ జేసాడురా...

ఓ చాలా మంచి చేశారయ్యా..

దేశం మీద అప్పటి వారి కున్న ప్రేమని మనం మరుస్తున్నామని

గుర్తు చేసేటట్లుగా ఒక మంచి పుస్తకం తెచ్చావురా...


సరేనయ్య ఆ పుస్తకం ఇవ్వండి బీరువాలో పెట్టేస్తాను.. ఆవుకు మేత పెట్టే టైం అయ్యిందయ్యా మరి వస్తానయ్య..


ఏమోయ్ రాముడు బయలుదేరుతున్నాడు

వానికంత పల్లీలు పెట్టవే


సరేలే రాముడు, జాగర్తరా..


Rate this content
Log in

Similar telugu story from Abstract