Rajagopalan V.T

Abstract Others

5  

Rajagopalan V.T

Abstract Others

కోట్లు

కోట్లు

1 min
35.1K


అంబ పలుకు జగదాంబ పలుకవే, 

ఆధిలక్ష్మి మా అమ్మ పలుకవే 

పలుకవే పలుకు, పలుకవే పలుకు... 


ఏంటి పలికేది 


నే పలికింది ఎట్టాగూ సెయ్యరు.. 

మీరు సేయనిదానికి ఎందుకు 

పలుకు పలుకని 

ఒక్కటే బుడబుడకల శబ్ధం వేరే.. 

ఆపవయ్యా బాబూ.. 


ఏంటమ్మా అలాగంటారు.


మరేంటి సెప్పు... 


ఈ సారి మీరు సెప్పింది 

చేస్తాం అమ్మా... 


సరేలేగాని ఇనుకో..


ఎట్టాగైనా కోట్లు సంపాదించాలి అన్న ధ్యాస మాత్రమే ఉంటుంది వారికి

చేతులు కాలాక ఆకులు ఎట్టా పట్టుకోలేమో 

అట్టాగే మన జీవితాలు కూడా..  సరేనా 


అట్టాగే అమ్మా...


రోజూ ఫ్యాక్టరీల గొట్టాలనుంచి 

పొగ బయటికొస్తుంటే 

చుట్టుపక్కల ఉన్న మీరు 

మేఘాల్లాగా ఉందని మీ 

చిన్న బిడ్డలకు చూపించారు కదా... 


అదే పొగ ఇప్పుడు ఏమయ్యింది సూడు.. 

ప్రభుత్వం ఎన్ని కోట్లు ఇచ్చినా 

ఫ్యాక్టరీ వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా

మీ కడుపు కోత తీర్చే వారు లేరు కదా 

ఓదార్పు మాటలు కాసేపటి వరకే... 

నా దగ్గరకు వచ్చిన వారినైతే 

మీ కివ్వలేను కదా...  


మీలో చాలావరకు భయం ఎక్కువే కదా.. నీ కోసరం పలుకుతాను ఓపిగ్గా విని అందరికి సరిగ్గా చెబుతావా.. 


సరేనమ్మా... 


ఇప్పటికైనా మిగిలినవారు సరైన జాగ్రత్తలు తీసుకుంటే వారికి తోడుగా వుంటాను సరేనా... 


సరేనమ్మా... 


ఇటువంటి ఫ్యాక్టరీలు ఉన్న గ్రామంలో,  

మీ గ్రామప్రతినిధితో పాటు 

అన్ని శాఖలవారి సమన్వయం తో వెళ్లి, 

ఫ్యాక్టరీ వారితో మాట్లాడి 

ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి, వారానికోసారి మా ఊళ్లకు వచ్చి అందరికీ అర్థం అయ్యేటట్లుగా ఎలా జాగ్రత్తగా ఉండాలో చేసి చూపమని అడగండి... 

దాన్ని ఆచరణకు తీసుకొనిరండి..


అంతేగాని అన్నీ అయినతరువాత, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అన్నీ నిజమే, కానీ దాన్ని అనుభవించేకి మన వాళ్ళల్లో కొందరు వుండరు కదా... 


ముఖ్యంగా మన ఇంటినుంచి చూడాలి జాగ్రత్త అంటే ఏంటో.. 

ఇంట్లో స్టవ్ ఆపామా అని చూస్తాం కానీ, సిలిండర్ ఆపామా అని చూసేవాళ్ళు ఎంతమంది.. 

స్టవ్ ఆపే ముందు, సిలిండర్ నాబ్ ఆపండి, చివరగా స్టవ్ నాబ్ ఆపండి.. మీ పిల్లలకు నేర్పించండి.. 


భయం వదలి, భాద్యత నెరిగి, సరైన మార్గంలో నడవండి, నడిపించండి...


రేపుదయం వెళ్లి అందరికీ 

అర్థమయ్యేటట్లు చెప్పి వారికి 

మంచి చేసి, వారిచ్చే సహాయాన్ని తీసుకో, సరేనా... 


అట్టాగే అమ్మా... 


అంబపలుకు జగదాంబ పలుకవే.....


Rate this content
Log in

Similar telugu story from Abstract