gowthami chavala

Drama

2  

gowthami chavala

Drama

మాతృదేవోభవః

మాతృదేవోభవః

6 mins
282


ఈ కథ రాయడానికి గల కారణం ఎందరో తల్లుల కన్నీరు

చూడలేక ఆవేదనతో వచ్చిన కథ

ఎలాగ రాసానో తెలియదు కానీ రాయాలనిపించి రాసాను .

ఎందుకంటే రాయడంలో నాకు అంత ప్రావీణ్యత లేదు , కానీ ఈ

తల్లుల ఆవేదన అందరికి తెలియాలి అన్న ఉధ్యేశ్యంతోనే

మోదలుపెట్టాను. దయచేసి నాయీ ప్రయత్నాన్ని ఆధరిస్తారని

తప్పులుంటె మన్నిస్తారని ఆశిస్తూ....


మాతృదినోత్సవం సందర్భంగా అన్నీ టీవీ చానెల్స్ వాళ్ళు ఏదో ఒక

ప్రోగ్రాం చేయాలని తెగ ఆలోచిస్తుంటారు కొందరు సెలబ్రిటీ ల

తల్లులు ని, మరికొందరు బాగా పాపులర్ అయిన మన పాత తరం

నటీమణులని ఇలా ఎవరికి దొరికిన వాళ్ళని వాళ్ళు ఇంటర్వూస్

తీసుకుంటున్నారు . ఇందులో భాగం గా ఒక కొత్త టీవీ ఛానల్ వారు

మాత్రం ఇలా కాదు ఏదైనా కొత్తగా చేయాలి అని ఒక ఓల్డ్ ఏజ్

హోమ్ కి వెళ్లి అక్కడ తల్లులు అందరికి బట్టలు , పండ్లు పంచి

వాళ్ళతో కొంచెం సేపు ముచ్చటించి రావాలి అని అనుకోని

బయలుదేరుతారు , మదర్ తెరిసా ఓల్డ్ ఏజ్ హోమ్ కి చేరుతారు .

అక్కడి యాజమాన్యంతో మాట్లాడి ఒకరోజు అక్కడ గడిపేందుకు

అనుమతి తీసుకుంటారు.

తర్వాత అక్కడ ఉండే తల్లులు అందరినీ పరిచయం చేసుకొని అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పి

వాళ్ళు తెచ్చిన పళ్ళు మరియు బట్టలు అందరికీ అందజేసి వాళ్ళ 

క్షేమసమాచారాలు తెలుసుకుంటూ అక్కడ ఉండే వాళ్ల గురించి వాళ్ళు ఎలా ఉంటున్నారు , వాళ్ల ఆరోగ్య పరిస్థితి అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. ఇంతలో మధ్యాహ్నం భోజనాల సమయం అయింది. అందరూ భోజనాలు చేయడానికి భోజనాలగదికి వెళ్తారు .వాళ్లతోపాటు టీవీ చానెల్ వాళ్ళు కూడా భోజనానికివెళ్తారు . అక్కడకి వెళ్లి ఈరోజు మేము వడ్డిస్తాము అందరికి

అనిచెప్పి అందరికీ వారే దగ్గరుoడి అన్నం వడ్డించి వారితో పాటే కూర్చుని భోజనం చేస్తారు .భోజనాలు చేసిన తరువాత అందరినీ ఒకగదిలో కూర్చోబెట్టి ఒక్కొకరిని వారి గురించి అడగడం

ప్రారంభిస్తారు .

వారు కూడా ఒక్కొక్కరిగా ఇలా చెప్పుకుంటూవస్తున్నారు .అమ్మ చెప్పండి అమ్మా. మీరు ఇక్కడకి వచ్చి

ఎన్నిరోజులు అయింది? అసలు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు?

ఎందుకు ఇక్కడికి రావలసి వచ్చింది ? నా పేరు రత్తమ్మ అమ్మ ,నేను ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది అమ్మ , నాకొడుకు వచ్చి నన్ను ఇక్కడ చేర్పించాడు . అసలు మీకు ఎంతమంది

అమ్మ సంతానం ? నాకు ముగ్గురు కొడుకులమ్మ మా మూడో వాడు

వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్లాడు . ముగ్గురు మగ పిల్లలు ఉండి ఇక్కడికి ఎందుకు వచ్చారు అమ్మ , ఏం చెప్పమంటావు అమ్మ నాకర్మ , అని ఏడుస్తూ తన కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది, నీకు

ఎన్ని ఏళ్ళు ఉంటాయి అమ్మ ఇప్పుడు? 70 , 75 , దాకా ఉంటాయి

అమ్మ. ఎందుకమ్మా అసలు ఎందుకు ఇక్కడ చేర్పించాల్సి వచ్చింది నిన్ను , నువ్వేం చేసావ్ ? నేనేం చేయలేదు తల్లి , ఒంట్లో ఓపిక ఉన్నన్ని రోజులు అన్నీ నేనే అయ్యి పెంచి పెద్ద చేసాను నా

కొడుకులందర్నీ , ఇప్పుడు వయసు అయిపోయింది కదా అమ్మ

ఏమి చేయలేక పోతున్నాను , ఈమధ్య ఒంట్లో బాగా లేకుండా వచ్చి

మంచం మీద నుంచి దిగ లేకపోయాను నా కొడుకు, కోడలు ఇద్దరూఉద్యోగాలు కి వెళ్తారు , ఇంక నన్ను ఎవరు చూసుకుంటారు .

ఇక్కడైతే అన్ని వసతులు ఉంటాయని ఇక్కడ కొన్ని రోజులు ఉండు

తగ్గిన తర్వాత తీసుకెళ్తానని ఇక్కడ వదిలి పెట్టాడు .అలా చెప్పివెళ్లి రెండు సంవత్సరాలు అవుతుంది అమ్మ ఇప్పటివరకు నాకొడుకు రాలేదు , ఎదురుచూపులు తోనే గడిపేస్తున్నా అమ్మ అంటూ ఏడుస్తుంది. మరి మిగతా ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా

అమ్మ , వాళ్లకి తెలుసా మీ విషయం , ఎప్పుడైనా వచ్చారామిమ్మల్ని చూడటానికి? అందరికీ తెలుసు అమ్మ కానీ ఎవరూరాలేదు. వాళ్ల జీవితాల్లో వాళ్లు చాలా బిజీ అయిపోయారు అమ్మ ,

ఈ తల్లి గుర్తుకు రానంతగా ... అని వెక్కివెక్కి ఏడుస్తుంది ఆతల్లి.

వాళ్లని చూడాలనిపించడం లేదా అమ్మ ? ఎందుకు లేదు తల్లి ఎప్పటికైనా వస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను , ఈ కట్టె కాలేలోపు రాకపోతారా ? చూడక పోతానా అని ఎదురు చూస్తున్నాను.

వాళ్ల మీద నీకు కోపంగా లేదా అమ్మ? కోపం వస్తే మాత్రం ఏం

చేయగలం తల్లి , తల్లిని కదా . ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నా పిల్లల్ని , అంటూ వాళ్ల పిల్లల్ని గుర్తుతెచ్చుకొని ఏడుస్తుంది....మీ పిల్లలకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా

అమ్మ ? ఒక్కసారి చూడాలి అనిపిస్తుంది రా , పోయే లోపు ఒకసారి

కనిపించండి తనివితీరా చూసుకుని వెళ్ళిపోతాను... అంటూ ఏడుస్తుంది తల్లి , ఇంతలో ఆమెను ఓదారుస్తూ ఒక చెయ్యి

ఆమె భుజం మీద వేసి ఆమె పక్కన కూర్చుంది.

ఆ టీవీ ఛానల్ లో పనిచేసే ఒక అమ్మాయి. పేరు స్పూర్తి ,

ఊరుకోమ్మా బాధపడకు అని ఆ తల్లి కన్నీళ్లు తుడుస్తుంది స్ఫూర్తి. తర్వాత ఇంకో తల్లి దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతారు ,చెప్పండి అమ్మా మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది . మీ

పేరు ఏంటమ్మా? నా పేరు మహాలక్ష్మి నేను వచ్చి ఆరుసంవత్సరాలు అవుతుంది అమ్మ , ఇక్కడ ఎలా ఉంది అమ్మ మీకు ?

ఇక్కడ అంతా బాగానే ఉందమ్మా కానీ నాకే బాలేదు , కాళ్లు రెండు

చచ్చుబడిపోయాయి అమ్మ లేచి నిలబడలేను, నడవలేను ,కడుపులో మంట , ఏమీ తిన లేకుండా ఉన్నాను నోరంతా పుండ్లు

వచ్చేసింది అని నోరు తెరిచి చూపిస్తుంది అయ్యోపాపంఅనుకుంటారు అందరు. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను

తల్లి , చెప్పద్దు అంటే చెప్పను , నిన్ను చూసి నా బిడ్డలా అనిపించి చెప్పాలనిపించింది అంటూ వణుకుతున్న తన చేతులతో స్ఫూర్తి 

బుగ్గలు నిమురుతూ ఇలా అంటుంది. తడబడుతున్న గొంతు ,వణుకుతున్న చేతులు , బక్కచిక్కిన శరీరం , కనీసం చీర కూడా కట్టుకోలేని విధంగా చుట్టుకున్న ఆ చీర ఆ తల్లి దీన స్థితిని చూసి

స్ఫూర్తి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఏం పర్లేదు నీకు ఏమైనా చెప్పాలనిపిస్తే చెప్పు అంటుంది స్ఫూర్తి. ఏం చెప్పమంటావు తల్లి నాపరిస్థితి రాత్రులు నిద్ర పట్టదు , ఎవరితో అయినా నా బాధ

చెప్పుకోవాలి అనిపిస్తుంది కానీ ఇక్కడ అంతా నాలాంటి వాళ్ళేవాళ్లతో చెప్తే తీరేది కాదు కదా తల్లి నా బాధ. ఆ దేవుడి పిలుపుకోసం ఎదురు చూస్తున్నాను అంతకన్నా ఏం చెప్పలేను తల్లి అని

ఏడుస్తుంది. మీకు ఎంతమంది బిడ్డలు తల్లి , ఈ ఆరు

సంవత్సరాల్లో ఎవరూ రాలేదా మిమ్మల్ని చూడటానికి , వాళ్లకు

తెలుసా మీరు ఇలా ఉన్నారని అని అడుగుతుంది స్ఫూర్తి.


నాకు ఒక్కగానొక్క కొడుకు తల్లి పేరు నరసింహారావు , బాగాసంపాదించాడు , ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు ఇక్కడేఉంటారు తల్లి ఊర్లోనే ఉన్నారు కానీ ఇంతవరకు రాలేదు . ఆరు

సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లాలని ఇక్కడ వదిలి పెట్టి వెళ్లారు నన్ను , అప్పటినుంచి ఇప్పటివరకు రాలేదు తల్లి అంటుండగాస్ఫూర్తి ఒక్కసారిగా లేచి నిలబడుతుంది ఆ తల్లి వైపు చూసి తన

దుఃఖం ఆపుకోలేక కన్నీరు కారుస్తోంది. తేరుకొని కన్నీళ్లు

తుడుచుకొని ఆ తల్లి వైపు చూస్తుంది. ఇంక ఈ తల్లితో అవసరం లేదు కదా అందుకే వదిలేసుకునిఉంటాడు, అంది ఆ ముసలావిడ. మీ కొడుక్కి ఏమన్నా చెప్పాలి

అనుకుంటున్నావా ? అమ్మకి ఏడుపుతో మాటలు రావట్లేదు,మాట్లాడే ఓపిక కూడా లేదు, ఉన్న శక్తినంతా కూడగట్టుకొని నేనేంచెప్పాలి అనుకోవట్లేదు , ఆరు సంవత్సరాల నుంచి చూడడానికి రాని వాడు నేను చెప్తే మాత్రం వస్తాడా , ఆ ఆశ ఎప్పుడో

చచ్చిపోయింది. ఇంతలో ఇంకొక అమ్మ అందుకొని ఏం చెప్తాముతల్లి ఆ నాకొడుకులకి , మీసాలు, గడ్డాలు వచ్చేసరికి తల్లి అడ్డు

అయిపోయింది , పెళ్ళాల మత్తులో పడి తల్లిని పట్టించుకోవడం మానేశారు. నా కోడలు అయితే నామీద దొంగతనం మోపి

నాకొడుకు చేత నన్ను తిట్టించి అవమానపరిచింది .అయినా

కొడుకు మీద ఉన్న ప్రేమ చంపుకోలేక ఎన్ని అవమానించినా భరిస్తూ వచ్చాను. కానీ చివరికి తన తండ్రి మీద చేయి చేసుకునే

పరిస్థితికి తీసుకువచ్చింది నా కొడుకుని , అయినా నా కొడుకు అయినా అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు ఎవరో కాదు నా కన్న తల్లి,తండ్రులు వాళ్ళని అనుమానించడం , అవమానించడం తప్పుకదా అని , ఇంక అక్కడ ఉండటం ఇష్టం లేక నేను, నా భర్త వేరే

ఇల్లు తీసుకొని దూరంగా ఉంటూ వచ్చాము. నాకు ముగ్గురు

కూతుళ్లు , 1 కొడుకు  , మాకు చాలా ఇల్లు ఉన్నాయమ్మా అవన్నీఅమ్మేసి వచ్చిన డబ్బులు బ్యాంకులో వేసుకొని వచ్చిన వడ్డీతోకాలం గడుపుతూ ఉందామనుకున్నాము. కానీ అలా కూడా

మమ్మల్ని బ్రతకనివ్వలేదు తల్లి నా కోడలు , ఇల్లు లు అమ్మాలంటే కొడుకు , కూతుళ్లు అందరూ సంతకాలు కావాలన్నారు . నా

ముగ్గురు కూతుర్లు బంగారు తల్లులు అడిగిన వెంటనే సంతకం పెట్టేశారు. కానీ నా కొడుకు ఆ డబ్బులు ఎంతోకొంత ఇస్తే కానీ సంతకం పెట్టను అన్నాడు .ఆ ఇల్లు లు అమ్మగా 55 లక్షలు వచ్చింది. 50 లక్షలు అడిగాడు, మీరు ముసలి వాళ్ళ మీకు 5లక్షలు చాలా ఎక్కువ అన్నాడు. మేము ఇవ్వడానికి ఒప్పుకోలేదన్న

కోపంతో మామీదకి రౌడీలని పంపి భెదిరించి, కొట్టించి మొత్తం ఆస్తి

తనపేరు మీద రాయించుకున్నాడు నా కొడుకు . తనకాళ్లుకందకూడదని తన చేతులలో నడిపించాడు నా భర్త. ఆ చేతులని కట్టేసి మరి కొట్టాడు .వాడికి చిన్న ముల్లు గుచ్చుకున్నా కూడా

విలవిల లాడాడు ,అలాంటిది ఆయన రక్తం కళ్లచూసాడు .అయినా అది మా ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తి

మా ఇష్ష్టమొచ్చిన వాళ్ళకి ఇస్తాము అన్నందుకు కన్నతల్లిఅనికూడా చూడకుండా నా గొంతు నులిమాడు , అడ్డువచ్చిన మాఅల్లుడిని కూడా కొట్టబోయాడు . అలాంటప్పుడు మీకూతుర్ల దగ్గరే వుండొచ్చు కదా అమ్మ? ఉండొచ్చు , మాకూతుర్లు , అళ్ళుల్లు

మమ్మల్ని రమ్మని పిలిచారు కానీ వాళ్లకి కూడా తల్లిదండ్రులు ఉన్నారుగా వాళ్ళని కూడా వీళ్ళే చూసుకోవాలి కదా ,ఇంతమందిని చూసుకునే స్తోమత వాళ్లకి లేదు , అయినా మమ్మల్ని రమ్మని

పిలిచారు అదే వాళ్ల గొప్ప మనసు మేము అందుకు నిరాకరించడంతో ఏమి చేయలేక ఊరుకున్నారు. అయినా అప్పుడప్పుడు వస్తూ మమ్మల్ని పరామర్శించి వెళుతూ ఉంటారు నా అల్లుళ్ళు కూతుర్లు. నా కొడుకు ఇలా ఎన్నో రకాలుగా మమ్మల్ని

ఇబ్బంది పెట్టాడు, ఇదంతా చూసి తట్టుకోలేక మా ఆయన

దిగులుతో మంచం పట్టారు , అప్పుడు కూడా చూడడానికి రాలేదు నా కొడుకు ,కాని మా అయన మాత్రం చాలాసార్లు కొడుకుతోమాట్లాడాలని ఉంది అని అడిగేవారు ,కొడుకు ఎన్ని చేసినా కూడా

వాడి మీద ప్రేమ తగ్గలేదు మా ఆయనకి . కానీ నా కొడుకు రాలేదు.చిన్నప్పటి నుండి కూతుర్ల మీద కన్నా కొడుకు మీదే ఎక్కువ ప్రేమమా ఆయనకి . ఒక్క మాట కూడా అననిచ్చే వాడు కాదు వాడిని ,

కానీ వాడు మాత్రం నాకు ఎవరూ లేరు ఎప్పుడో చనిపోయారు అనేవాడు . అలా కొన్నేళ్లకు ఆయన స్వర్గస్తులయ్యారు. తర్వాత ఒక్కదాన్నే ఉండడంతో నా కూతురు తీసుకువచ్చి ఇక్కడ వదిలి

పెట్టింది , నా కూతుళ్లు అల్లుళ్లు మనవళ్లు , మనవరాళ్లు అందరూ వస్తారు చూడటానికి, కొడుకు తప్ప. కూతుర్లు పుట్టారని ఏడిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ కూతురు ఇంటికి

మహాలక్ష్మి అని వాళ్లకు తెలీదు. స్వార్ధం లేని ప్రేమ కూతురిది ,

అలా అని కొడుకులు తప్పు చేస్తారని కాదు. కూతురంటే అసహ్యించుకునే వాళ్ళకి అలా చేయొద్దు అని చెప్తున్నా. మీ

కొడుకుకి ఏమన్న చెప్పాలనుకుంటున్నారా మా ద్వారా ? ఏంచెప్పలేం తల్లి , నా దృష్టిలో నా తల్లి ఎప్పుడో చచ్చిపోయింది

అన్నాడు నా కొడుకు. అలాంటి కొడుకు కి ఏం చెప్పమంటావు , ఈ

కాలం పిల్లలు అందరికీ నేను చెప్పదలచుకుంది ఒక్కటే. మీకు

పిల్లలు ఉన్నారు కదా వాళ్లని పెంచే ప్రతి క్షణం నా చిన్నప్పుడు నా

తల్లి తండ్రి కూడా నన్ను ఇలాగే కదా పెంచారు, నేను ఎన్నిసార్లు

పక్క తడిపినా నాకు ఎక్కడ నిద్రకి ఇబ్బంది కలుగుతుందో అని

ఎంత రాత్రైనా లేచి ఆనందంగా నాబట్టలు మార్చారు , నాకు

కొంచెం బాగాలేక పోయినా రాత్రి పగలు మేలుకొని కంటి రెప్పలాగా

చూసుకున్నారు, ఎంతకష్టంలో ఉన్నా కూడా ఆకష్టాన్ని మాకు

తెలియకుండా మేము అడిగిన వన్నీ ఇచ్చారు. ఇంత ప్రేమనే కదా

నాకు పంచారు , ఇంత కష్టపడి పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకోకుండా ఇలా వదిలేస్తే రేపు వాళ్ళ పరిస్థితి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి చాలు అంటుంది. ఇలా అందరూ వాళ్ళ వాళ్ళ గురించి చెప్పుకొని బాధపడుతూ ఉంటారు.ఇవన్నీ మౌనంగా వింటున్న స్ఫూర్తికి ఏమీ అర్థం కావట్లేదు. తన బాధనంతా దిగమింగుకుని వాళ్లు చెప్పేది అంతా వింటూ ఉంటుంది. కొందరు తల్లులు అనాధగా దిక్కు లేకుండా రోడ్డుమీదతిరుగుతుంటే తీసుకొచ్చారు, మరికొందరు ఇంట్లో నుంచి గెంటి

వేయబడ్డారు. మరి కొందరు తల్లులు ని ఇంట్లో పని చేయడం లేదని

ఇక్కడ చేర్పించి వెళ్లారు. ఇలా రకరకాల తల్లులను చూసిందిస్ఫూర్తి . తన మనసు ఒక్కసారిగా చలించిపోయింది. అలాగే

మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

                     

       ....................అయిపోయింది , ..,..........



Rate this content
Log in