మార్పు
మార్పు
ఆ రోజు ఎప్పటి లాగానే తాగడానికి వెళ్తున్న నాకు
అన్నయ్య అన్నయ్య అంటూ ఒక చిన్న పాప పిలుపు .
ఆ చెప్పు తల్లి అనగానే నన్ను ఎతుకొండి అనగానే
కళ్ళలో చెమ్మగిల్లుతు ఎదో వెలుగు 27 ఏళ్లు నిండిన నాకు అల ఒకరి పిలవడం కొత్త గా అనిపించింది..
ఆ చిన్నారి అమ్మాయి తో ఆరోజు మధ్యాహ్నం వరకు సరదాగా గడుచి పోయింది.
ఆ చిన్న తల్లి ఎవరు అనేది మాత్రం నాకు అర్థం కానీ అయోమయంలో పడిన నాకు ఆ పాప మాట్లాడిన మాటలు మాత్రం నా మనసులో గుచ్చుకునే విధంగా మారిపోయాయి..
"అన్నయ్య మీరు తాగడానికి పోతున్న అన్నారు ,తప్పు కదా అన్నయ్య అనడం,
ఆరోగ్యం పాడైతే ఎలా అన్న,
మీ అమ్మ,నాన నీ నువ్వే కదా చుస్కోవాల్సింది అంటూ చిట్టి పొట్టి మాటలతో నాతో అల్లారు ముద్దుగా ఆడుకుంది.
కానీ నాకు మార్పు మొదలైన క్షణo కూడా అదే..
అలా నాలో మార్పు మొదలైన క్షణాలు ,నన్ను నేను మార్చుకొని హాయి గా నా జీవితాన్ని మార్చుకుని బ్రతుకుతున్నా
ఓ మిత్రమా!!
ఇది నా జీవితం లో జరిగిన ఒక చిన్ని సంఘటన..
