Dinakar Reddy

Classics

4  

Dinakar Reddy

Classics

కృష్ణవేణమ్మ

కృష్ణవేణమ్మ

1 min
441


ఏంటీ తొమ్మిది రోజులు ఉపవాసాలా.ఎలా ఉండగలరు అని అనుకునేవాణ్ణి ఇంతకు ముందు.

ఈసారెందుకో నాక్కూడా దేవీ నవరాత్రుల ఉపవాసం చేయాలనిపించింది.అమ్మవారి ఒక్కో అలంకారం చూస్తూ రోజులు ఇట్టే గడిచిపోయాయి.


ఓ ప్రక్కనేమో కృష్ణవేణిలో భవానీ దీక్ష తీసుకున్న భక్తుల స్నానాలు.

శోభాయమానంగా అలంకరించిన విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయం.

అమ్మవారి విగ్రహానికి దగ్గరవుతున్న కొద్దీ ఏదో ప్రశాంతత.కళ్ళలో కాస్త తడి.దర్శనం బాగా జరిగింది.

అయ్యవారి దర్శనం కూడా చేసుకొని బయటకు వచ్చాను.


ఈ దసరా పండుగ జ్ఞాపకాలు మర్చిపోలేను.కృష్ణవేణమ్మకు దుర్గమ్మకు మరోసారి నమస్కరించుకొని ఇంటికి బయలుదేరాను.


Rate this content
Log in

Similar telugu story from Classics