STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Abstract

4  

Dr.R.N.SHEELA KUMAR

Abstract

కళాశాల

కళాశాల

1 min
299

అవి కాలేజీ రోజులు, రోజు 3కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం, కానీ ఏ రోజు అలసట అనేది తెలిసేది కాదు.7.15 కి బయలుదేరి 7.40 లోపు చక చక నడిచేసి వెళ్లిపోయే వాళ్ళం. అన్నయ్య, నేను రోజు విడిచి రోజు ఉదయం వండే వాళ్ళం, ఏదో ఒకటి వండేసి కాలేజీ కి వెళ్లిపోయే వాళ్ళం పాపం పిన్ని కూడా అలానే గబగబా రిక్షా ఎక్కి స్కూల్ కి వెళ్ళేది. కాలేజీ నుండి అన్నయ్య, నేను వేరు వేరుగానే వచ్చే వాళ్ళం చుట్టూ ఉన్న వాళ్ళు ఇద్దరు oke కాలేజీ ఏ కదా ఇద్దరు కలిసే రావొచ్చు కదా అని అడిగే వారు. ఎవరి గోల వాళ్లదే. కాలేజీ నుండి వచ్చి తినేసి అన్నీ చెక్క బెట్టుకునే వాళ్ళం రోజు రాత్రి పిన్ని వండేది, ఆహా వెజిటేబుల్ బిరియాని చేసేది అది ఇప్పటికి మమ్మల్ని నోరురిస్తూనే వుంటాది.మొదటి సంవత్సరం చదివినప్పుడే సుందరకాండ సినిమా వచ్చింది అది చూసి నేను కూడా కాలేజీ కి బ్లేడు పట్టుకోనీ అపర్ణ లాగ శబ్దం చేసేదాన్ని. అ రోజులే వేరు ఏ అరరికలు లేకపోతే హాయిగా కాలేజీ ఇల్లు ట్యూషన్ అని బంపరం లా పనిచేసే దాన్ని. మిత్రులందరూ నన్ను చూస్తేనే సుందరకాండకు అని పాడే వారు. నేను పొట్టి నా ఫ్రెండ్ పొడుగు చూసిన వాళ్ళు చూడరా అమితాబచ్చను జయభాధురి వెళుతున్నారు అనేవాళ్ళు. కేంటిన్లు, కేరింతాలు ఆహ ఆరోజులు మళ్ళీ రావు 


Rate this content
Log in

Similar telugu story from Abstract