ఇంటి పేరు
ఇంటి పేరు
సంగ్రహం :ఒక ఇంటి పేరు రెండు జీవితాలను ఎలాంటి మలుపు తిప్పింది.....
------------------------×-------------------------------------
ఇంటిపేరు
ఈ రోజుతో నా డిగ్రీ అయ్యిపోయింది ఇంక నా డ్రీం ఐన బ్యాంకు జాబ్ మీద నా దృష్టి పెట్టాలి అని ఆలోచనలులో ఉన్న నేను "అమ్మా రక్ష ఒక సారి ఇలా రా బంగారం "అని పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి హా వస్తున్న నాన్న అని నాన్న దగ్గరకు వెళ్ళాను..
మీ అమ్మ నీ చదువు అయ్యిపోయింది కదా అని నీకు పెళ్ళి సంబంధాలు చూడమని అంటుంది.నేను ఏమో నీ మనసులో ఎం ఉందో తెలియదు కదా నువ్వు చెప్పిన దాని బట్టి చూద్దాం అన్నారు నువ్వేమంటావ్ తల్లి అని అడిగారు నాన్న. నాన్న నాకు బ్యాంకు లో ఉద్యోగం చేయడం చాలా ఇష్టం అలా చెయ్యాలి అనేది నా కల కూడా. నేను దాని కోసం కోచింగ్ తీసుకుంటా నాన్న.. నాకు అప్పుడే పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదు అని చెప్పా నేను..
సరే రక్ష నీ ఇష్టం.. మనకి దగ్గరలో మంచి కోచింగ్ సెంటర్ ఏముందో నేను కనుక్కుని నిన్ను అక్కడ జాయిన్ చేయిస్తాను అని చెప్పారు నాన్న..
అనుకున్నట్టుగానే కొన్ని రోజులకు నన్ను మంచి పేరు ఉన్న ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసారు నాన్న.. నాకు చాలా సంతోషంగా అనిపించింది....1st రోజు కొంచెం భయంగానే క్లాసులోకి వెళ్ళాను నేను... మొదటి రోజు వలన పెద్దగా ఎవరు రాలేదు..క్లాస్సేస్ కూడా అంతగా ఎం చెప్పలేదు... మా ఇంటికి ఆ కోచింగ్ సెంటర్ దగ్గరే అవ్వడంతో నడిచి వెళ్లి వచ్చేదానిని.. కానీ ఆ కోచింగ్ సెంటర్ కి మంచి పేరు ఉండడంతో కొంతమంది హాస్టల్ లో ఉండి చదువుకునేవారు... అలా ఒక వారం రోజులలో స్టూడెంట్స్ అందరు వచ్చేసి సీట్స్ అన్ని నిండుకున్నాయి.నాకు సింధు, వల్లి అనే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అయ్యారు. సింధు ఇంటి నుంచి వస్తే వల్లి మాత్రం హాస్టల్ నుంచి వచ్చేది...ఒక రోజు సార్ ఇంగ్లీష్ క్లాస్ చెపుతున్నపుడు" మే ఐ కమింగ్ సార్ " అనే పిలుపుతో ఎవరా అని డోర్ వైపు చూసాం అందరం.. బ్లాక్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకుని ఒక అబ్బాయి నుంచుని ఉన్నాడు. నీ పేరు ఏంటి?? ఇదే నీ మొదటి క్లాస్ ఆ??
ఎందుకు ఇన్ని రోజులు రాలేదు?? అని ప్రశ్నల వర్షం కురిపించారు మా సార్..
దానికి ఆ అబ్బాయి తన పేరు జై అని.. ఇదే తన మొదటి క్లాస్ అని..తనకి ఆరోగ్యం బాగోకపోవడంతో లేట్ గా జాయిన్ అవ్వాల్సివచ్చింది అని చెప్పి నా పక్క బెంచీలో కాళీ ఉంటే అక్కడ కూర్చున్నాడు తను...నాకు చదువు అంటే చాలా ఇష్టం పైగా నాకు ఇష్టపడి చదువుతున్న కాబట్టి ఇంకా బాగా చదివేదానిని.. ఒక రోజు క్లాస్ అయ్యిపోయాక వల్లి, సింధు తో కలిసి బయటకు వెళ్లిపోతున్న నాకు "రక్ష గారు" అనే పిలుపుతో వెనకకు తిరిగా.. నా ఎదురుగా జై..
హాయ్ అండి నా పేరు జై.. నేను లేట్ గా రావడం వల్ల నేను చాలా క్లాస్సేస్ మిస్ అయ్య అండి.. నా పక్కన ఉన్న అబ్బాయిని అడిగితె తను నోట్స్ సరిగా రాసుకోలేదు అని మీరు చాలా బాగా చదువుతారు అని మిమ్మల్ని అడగమని చెప్పాడు.. కొంచెం మీరు ఎం అనుకోకపోతే మీ నోట్స్ ఇవ్వండి మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పాడు జై..
సరే అని నా నోట్స్ ఇచ్చా.. అలా మా పరిచయం మొదలైంది.. జై ఇంట్రవర్ట్... కాబట్టి ఎవరితోను అంతగా కలిసే వాడు కాదు.. మా బ్యాచ్ తోనే ఎక్కువ గా ఉండేవాడు....తను కూడా బాగా చదివేవాడు.. మొదట్లో క్లాస్సేస్ వినకపోవడం వల్ల జై కొంచెం ఇబ్బంది పడిన చెప్పిన వెంటనే అర్ధం చేసుకునేవాడు.
మాకు వీక్ కి ఒక సారి ఎక్సమ్ పెట్టేవారు.. నేను మాథ్స్, ఇంగ్లీష్ బానే చేసేసిన జనరల్ కనౌలెడ్జి(జి. కే )లో మాత్రం చాలా తక్కువ మర్క్స్ వచ్చేవి...సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలో షార్టకట్స్ చెప్పిన ఏంటో నాకు అసలు గుర్తుండేదే కాదు. జై మాత్రం జి. కే లో చాలా మంచి మార్కులు తెచ్చుకునే వాడు కానీ తనకి మాథ్స్ వచ్చేది కాదు.. అలా రోజు ఈవెనింగ్ క్లాసెస్ అయ్యిపోయాక మేము ఇద్దరం కలిపి చదువుకునే వాళ్ళము.. ఏమైనా డౌట్స్ ఉంటే తనకి నేను నాకు తను ఎక్సప్లయిన్ చేసుకునే వాళ్ళము.. అలా మా స్నేహం ఇంకొక అడుగు ముందుకు వెళ్లి బెస్ట్ ఫ్రెండ్స్ గా మారింది..తను కూడా హాస్టల్ లోనే ఉండేవాడు. ప్రతి ఆదివారం జై ని ఇంకా వల్లి ని మా ఇంటికి పిలిచేదానిని. సింధు వేరే ఊరులో ఉండడం వల్ల రావడానికి కుదిరేది కాదు... అలా జై అమ్మ నాన్నలకు కూడా పరిచయం అయ్యాడు.
ఏంటే ఈ మధ్య జైతో ఎక్కువ ఉంటున్నట్టు ఉన్నావ్ ఏంటి విషయం అని అడిగారు సింధు, వల్లి... మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని అలాంటిది మా మధ్య ఎం లేదు అని చెప్పా..
కొన్ని రోజుల తరువాత సంక్రంతి సెలవలు ఇచ్చారు.. జై వల్ల ఊరు వెళ్ళిపోయాడు.. ఒక రెండు రోజులు నాకు ఏమి అనిపించలేదు కానీ తరువాత జై ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చేది.. బెస్ట్ ఫ్రెండ్ కదా అందుకే ఏమో అనుకున్న... సింధు, వల్లి లను కూడా మిస్ అయ్యేదానిని కానీ ఇంతలా అనిపించేది కాదు.. కొన్ని రోజుల తరువాత మళ్ళీ మాకు క్లాస్సేస్ స్టార్ట్ చేసారు..ఆ రోజు క్లాసుకి వెళ్తున్న అన్న సంతోషం కంటే జై ని చూడబోతున్న అన్న సంతోషం ఏ ఎక్కువ గా అనిపించింది నాకు.. అదేంటో అని ఆలోచన కూడా అప్పుడు చేయలేదు.. ఆ రోజు మళ్ళీ అందరం కలిసి పండుగ విశేషాలు చెప్పుకుని చాలా సంతోషం గా గడిపేసాం... రోజులు గడిచేకొద్ది ట్రైనింగ్ కూడా అయ్యిపోతుంది..కొన్ని రోజుల తరువాత ఒక ఆదివారం జై కాల్ చేసాడు... తనకు ఆ రోజు ఇంటికి రావడం కుదరదు అని నన్ను ఒక చోటుకి రమ్మని లొకేషన్ షేర్ చేస్తా అని చెప్పాడు..అప్పుడే టీవీలో "హ్యాపీ వాలెంటెన్స్ డే " అని చూసి ఏంటి ఈ రోజు ప్రేమికుల రోజా మరి ఈ రోజు ఎందుకు జై నన్ను రమ్మన్నాడు అని అనుకుంటూ ప్రొపోజ్ చేస్తాడా అని అనుకోగానే నా బుగ్గలు సిగ్గుతో ఎరుపేక్కాయ్. తన కోసం అని వైట్ కలర్ అనర్కాలి వేసుకుని అందంగా రెడీ అయ్యి బయటకు వెళుతున్న అమ్మ అని అమ్మ కి చెప్పి జై పంపిన లొకేషన్ కి వెళ్ళాను..
అది ఒక రెస్టారెంట్.. భోజనానికి వేరు గా ఏమైనా ఈవెంట్స్ జరగడానికి వేరు గా ఉంటుంది ఆ రెస్టారెంట్... జై కి కాల్ చేసి తను చెప్పిన చోటు కి వెళ్లి అక్కడ ఉన్న ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను...మొత్తం పింక్ కలర్ బాలన్స్ తో డెకొరేట్ చేసి గులాబీ రేఖలతో చేసిన లవ్ సింబల్ మధ్యలో మోకాల మీద కూర్చుని...
" రక్ష.. నువ్వు అంటే నాకు ప్రాణం.. నేను నీ దగ్గర మాత్రమే నాకు నాలా మా అమ్మతో ఉన్నంత ఫ్రీగా ఉండగాలును.. నాకు అవకాశం ఇస్తే నా జీవితం మొత్తాన్ని నీతో పంచుకునే ఎందుకు సిద్ధంగా ఉన్నాను..పెద్ద పెద్ద కవితలు రాసి నా ప్రేమను చెప్పలేను కానీ నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువ గా నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను .. విల్ యు మ్యారీ మీ " అని తను తీసుకొచ్చిన రింగ్ నా ఎదురుగా పెట్టి నాకు ప్రొపోజ్ చేసాడు.. ఆ క్షణం ఎలా స్పందించాలో అర్ధం కాలేదు నాకు.. జై చాలా మంచి వాడు.. నిజం గానే నాతో ఉన్నంత చనువుగా ఎవరితోను ఉండదు.. పైగా మా నాన్న తరువాత నా మనసులో ఎం ఉందో నేను చెప్పకుండానే అర్ధం చేసుకుంటాడు.. నాకు కూడా తను అంటే చాలా ఇష్టం.. అందుకే చాలా సంతోషంతో నా జవాబు తెలుపుతూ నా చేతిని ముందుకు చాచి నా వెలికి రింగ్ పెట్టించుకున్నాను... తను చాలా సంతోషంగా ఏంతో ప్రేమతో నా నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు...
ఇద్దరం సాయంత్రం వరుకు ఆ రోజు చాలా సంతోషం గా గడిపి తరువాత ఇంటికి చేరుకున్నాం... ఎంత ప్రేమించుకుంటున్న ఏప్పడూ మా చదువులను అశ్రద్ధ చేయలేదు మేము.. కానీ జై మాత్రం బెస్ట్ ఫ్రెండ్సగా ఉన్నపుడు కంటే చాలా బాగా చూసుకునేవాడు... నాకు తనతో ఉంటే చాలా దైర్యంగా చాలా సంతోషంగా ఉండేది... అలా మా ట్రైనింగ్ పూర్తి అయ్యి మెయిన్ ఎక్సమ్ రానే వచ్చింది...జై నేను చాలా బాగా రాసి ఫలితాల కోసం ఎదురుచూసం.. ఫలితాలు వచ్చాక ఇంట్లో చెప్పాలి అని అనుకున్నాం.. మేము అనుకునట్టే మేము చాలా మంచి మర్క్స్ తో పాస్ అయ్యాం.. జై ఐతే బ్యాంకు మేనేజర్ కూడా అయ్యాడు.. ఇంకా మా ఇద్దరి సంతోషాలకు అవధులు లేవు.. మా మర్క్స్ చూసి నాన్న చాలా సంతోశించారు... ఆ సమయంలోనే చెప్పేయడం మంచిది అని మా ఇంట్లో చెప్పేసాం... అమ్మ, నాన్న దానికి వారికీ కులం పట్టింపులు లేవు అని నా నిర్ణయం మీద వాళ్లకు నమ్మకం ఉంది అని జై వల్ల పేరెంట్స్ కి ఇష్టం ఐతే మాకు ఇష్టమే అని చెప్పారు... నాకు సంతోషంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి.. ఆనందంగా వాళ్ళని హత్తుకున్న... జై వల్ల ఇంట్లో కూడా ముందే చెప్పాడు అని వాళ్ళు ఒప్పుకున్నాకనే నాకు ప్రొపోజ్ చేసాడు అని వాళ్లకు కూడా ఇష్టమే అని రేపు మా ఇంటికి వస్తారు అని వాళ్లకు కూడా కులం పట్టింపులు ఉండవు అని చెప్పాడు.. ఆ మాటకు అమ్మ వాళ్ళు చాలా సంతోషం గా ఫీల్ అయ్యారు..
మరుసటి రోజు జై అన్నట్లు గా వల్ల తల్లితండ్రులతో పాటు మా ఇంటికి వచ్చాడు... వాళ్ళు చాలా ఫ్రీ గా ఉన్నారు.. వల్ల మాటలో మధ్యలో ఇంటిపేరు ప్రస్తావన వచ్చింది... అంటే ఒక్క సరిగా సంతోషం గా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా గా సీరియస్ అయ్యింది... మా అమ్మ నాన్న జై వల్ల తల్లితండ్రులు కలిసి ఈ పెళ్ళికి ఒప్పుకోము అన్నారు... మా ఇద్దరికీ ఏమి అర్ధం కాలేదు.. నాకు అప్పటికే కళ్ళలోంచి నీళ్లు వచేస్తున్నాయి... నాన్న నా దగ్గరకు వచ్చి వల్ల ఇంటి పేరు బట్టి చూసుకుంటే వాళ్ళు మనకు దూరపు బంధువులు అవుతారు అమ్మ.. అలా చూసుకుంటే జై నీకు అన్నయ్య అవుతాడు మీ ఇద్దరికీ పెళ్ళి చేయడం కుదరదు అని చెప్పారు... ఒక్క సరిగా మా ఇద్దరి గుండె పగిలిపోయింది... అంతా శున్యం లా అనిపించింది... అసలు మా కలలోకి కూడా రాని ఆలోచన అది.... ఎలా జీర్ణించుకోవాలో.. ఒకరికొకరం వేరు వేరు గా ఎలా బ్రతకాలో అర్ధం కాలేదు మాకు... మా రెండు కుటుంబాలకు చాలా చెప్పి చూసాం మేము.. అలా పెళ్ళి చేయకూడదు.. వరసలు మారిపోతాయి అని అసలు మా ఇద్దరికీ పెళ్ళి చేయడం చాలా పెద్ద తప్పు అని, మా ఇద్దరికీ పెళ్ళి చేసే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేసారు....
ఒకరిని విడిచి ఒకరం బ్రతకలేం అని ఒకరి స్థానంలో ఇంకొకరిని ఊహించలేం అని ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మా ఇద్దర్నిని క్షమించమని ఇంట్లో ఒక లెటర్ రాసి వచ్చే జన్మ లో ఐన మా ఇద్దరినీ కలపమని ఆ దేవుడిని ప్రాదించి ఆ గోదావరిఅమ్మ వడిలో చేరిపోయాము...

