నీ ప్రేమ కై ❤️
నీ ప్రేమ కై ❤️
అది ఒక ఇంజనీరింగ్ కాలేజీ.......అబ్బాయిలు అమ్మాయిల ముచ్చట్లతో, ఆటపాటలతో కళకళలాడుతూ ఉంది ఆ కాలేజీ ప్రాంగణం.. కానీ వీటితో నాకు ఎ మాత్రం సంబంధం లేదు అన్నట్టు ఏదో ఆలోచిస్తూ చాలా దిగులుగా కూర్చుని ఉంది అర్చన...
అర్చన ని వెత్తుకుంటూ అర్చన కోసం వచ్చింది దీప్తి...
ఎంతసేపటి నుండి నిన్ను వెతుకుతున్నానో తెలుసా అసలు నీకు ఇక్కడ కూర్చుని ఎం చేస్తున్నావ్ నువ్వు అని అడిగింది దీప్తి
ఐనా పలకలేదు అర్చన.. పిలుస్తుంటే నిన్నే పలకవు ఏంటి అని అర్చన మొహం లో ఉన్న కన్నీటి చారలు చూసి కంగారు పడిపోయింది దీప్తి...
ఏంటి ఇది అర్చన ఎందుకు ఇలా ఉన్నావ్... ఈ మధ్య మాట్లాడితే డల్ అయిపోతున్నావ్.. నాకు చెప్పచు కదా నీకు నేను ఉన్న అని మర్చిపోయావా అని చాలా లాలనగా బాధా గా అడిగింది దీప్తి.
దీప్తి అలా అడిగేసరికి వెక్కి వెక్కి ఏడ్చింది అర్చన..
అలా ఏడుస్తూనే నేను తనకి దూరం గా ఉండలేకపోతున్న దీపు అని చెప్పింది అర్చన..
"తను ".. తను అంటే ఎవరు.. నాకు తెలియకుండా ఎం జరిగింది అసలు.. ఏంటి కధ అని ఆశ్చర్యంగా అడిగింది దీప్తి..
ఎందుకు అంటే దీప్తి అర్చన బెస్ట్ ఫ్రెండ్స్.. ఒకరికీ ఒకరు వాళ్ళ ఇంటర్ నుండి పరిచయం.. చిన్నప్పటి నుండి అర్చనది ఎవరితోను త్వరగా కలవని మనస్తత్వం... ఇంట్రవర్ట్ లా ఉండేది..చాలా తక్కువగా మాట్లాడేది.. ఎవరితోను ఏది చెప్పుకునేది కాదు.. ఏదయినా మనసులోనే దాచుకునేది..ఏదయినా అవసరం ఉంటే తప్ప ఎవరితోను ఎక్కువ మాట్లాడేది కాదు... అర్చన వాళ్ళ అమ్మ గారి దగ్గరే చనువుగా ఉండేది.. అలా అని మరి ఎక్కువ కాదు.. వాళ్ళ నాన్న గారు ఐతే అమ్మాయి అని సరిగా చూసే వారే కాదు.. అలా తనకి వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా చనువు ఉండేది కాదు..
ఇంటర్లో పరిచయం అయ్యింది దీప్తి అర్చన కి... అర్చన ని చాలా తక్కువ సమయంలోనే అర్ధం చేసుకుని ప్రతి విషయంలో లో తోడు గా ఉండి ఒక అక్క లా చూసుకునేది దీప్తి అర్చనని..అలాంటిది నాకు కూడా తెలియని విషయంలో ఏంటి అని ఆశ్చర్యపోయింది దీప్తి..
చెప్పు అర్చన తను అంటే ఎవరు అని మళ్ళీ అడిగింది దీప్తి
తను నా ప్రాణం దీపు..
తొలి చూపులోనే నా మనసులో చేరి
నా ప్రాణం అయిపోయాడు..
నా జీవితం అందరికి తెరవని పుస్తకం ఐతే నీకు మాత్రమే తెరిచిన పుస్తకం దీపు... కానీ నువ్వు కూడా చదవని నీకు కూడా తెలియని కొన్ని పేజెస్ ఉన్నాయ్.. అవి నువ్వు తెలుసుకునే టైం వచ్చింది.. ఇదిగో నా డైరీ తన గురించి ప్రతిదీ ఇందులో ఉంది ఇంటికి వెళ్ళాక చదువు.. ఇప్పుడు ఇంకా దీని గురించి ఎం మాట్లాడకు నేను ఇంటికి వెళ్తున్న బాయ్ అని ఇంటికి వెళ్ళిపోయింది అర్చన..
అసలు ఎం జరిగిందో అర్ధం కాక..అర్చన ఎందుకు అంత బాధ పడుతుందో తెలియక అర్చన వెళ్లిన వైపు అలా చూస్తూ ఉండిపోయింది దీప్తి..
ఆ రోజు సాయంత్రం అర్చన ఇచ్చిన డైరీ ని చదవడం మొదలు పెట్టింది దీప్తి...
అర్చన డైరీ:
అప్పుడే బస్సు దిగి ఇంటికి నడుస్తున్న నాకు కనిపించాడు నాకు... అప్పటి వరుకు అబ్బాయిల మీద ధ్యాసే లేని నాకు ఎందుకో తనని చూడగానే ఒక రకమైన అలజడి కలిగింది.. ఆ క్షణం నాకే తెలియకుండా నా మనసులో నిలిచిపోయాడు.. ఎవరు ఈ అబ్బాయి ఎప్పుడు చూడలేడే ఎక్కడ ఉంటాడు.. ఇవే ఆలోచనలు ఆ రోజు మొత్తం నాకు...
ఆ తరువాతి రోజు ఆదివారం.. అమ్మ మన ఇంటి పక్కన కొత్తగా వచ్చారు వాళ్ళకి కర్రీ ఇచ్చిరమ్మని పంపించింది..
మాములుగానే నాకు కొత్త పరిచయలు నచ్చవు.. అందుకే వెళ్ళాలి అనిపించలేదు ఇదే మాట అమ్మ తో చేప్తే నా మాట వినలేదు.. పక్క పక్కనా ఉంటున్నాం ఎప్పుడు ఎం అవసరం వస్తుందో తెలియదు నువ్వు వెళ్ళాలి తప్పదు అని గట్టిగ చెప్పేసరికి వెళ్ళాక తప్పలేదు నాకు..
అవసరమా నాకు ఇది ఎవరో ఏంటో అని అనుకుంటూ వాళ్ళ ఇంటి డోర్ బెల్ కొట్టి ఎం మాట్లాడాలో ఏంటో అని ఆలోచనలో ఉండిపోయే సరికి ఎవరు కావాలి అని వినిపించింది ఒక స్వరం... ఆలోచనల నుండి తేరుకుని ఆన్సర్ ఇద్దాం అనుకునే లోపు నా ఎదురుగా తను సిల్కీ హెయిర్ షార్ప్ లుక్స్ తో కనిపించాడు తను.
నా ఎదురుగా ఉన్నది నిజమేనా లేక నేను ఏమైనా కల కంటున్నానా అనిపించింది.. అసలు తన వాయిస్ ఆ వాయిస్ కే ఎంత మంది ఫాన్స్ ఉంటారో అనిపించింది...
ఈ లోపు ఎవరు అమ్మ నువ్వు అని వాళ్ళ అమ్మగారు అడిగేసరికి నన్ను నేను పరిచయం చేసుకుని అమ్మ పంపించింది అని వెళ్పోబోతుంటే ఆంటీ బలవంతం మీద కొంత సేపు వాళ్ళ ఇంట్లో ఉండాల్సివచ్చింది...
ఆంటీ మాత్రం చాలా బాగా కలిసిపోయారు.. చాలా బాగా మాట్లాడారు.. ఆ విషయంలో లో నాకు ఎందుకో చాలా సంతోషంగా అనిపించింది.మా మాటల మధ్యలో తెలిసింది తను జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు అని తన పేరు రాఘవ్
అని... రాఘవ్... ఎంత అందమైన పేరు అనిపించింది...ఆ పేరు ని నాకే తీలియకుండా ఎన్ని సార్లు తలుచుకున్నానో నాకే తెలియదు..ఆ రోజు అంతా తన రూపమే కళ్ళ ముందు ఉంది చాలా డిస్టర్బ్ చేసింది..
కొన్ని రోజులకు ఆంటీ కి నాకు బాండింగ్ బాగా పెరిగింది..
నేను ఎలాంటి మొహమాటం లేకుండా చాలా ఫ్రీ గా ఉండేదానిని.. తను మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు... అంత టెక్కు ఏంటో ఈ అబ్బాయి కి మాట్లాడితే ముత్యాలు ఏమైనా రాలిపోతాయా అని అనిపించేది..అందం గా ఉంటాడు కదా అందుకే పొగరు అనుకునే దానిని...పోనీ నేను మాట్లాడదామా అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఎ అబ్బాయితోను మాట్లాడలేదు నేను.. కాబ్బటి మాట్లాడలేకపోయాను.. కానీ అప్పుడు చాలా బాధ గా అనిపించేది ఎందుకు ఇలా చేస్తాడు ఈ అబ్బాయి కనీసం తనతో మాట్లాడే అర్హత కూడా లేదా నాకు అని..
కొన్ని సార్లు నవ్వేవాడు... ఆ నవ్వు ని చూసిన ప్రతిసారి బాబోయ్ ఎం నవ్వుతున్నావ్ రా బాబు ఆ నవ్వు ని చూస్తూ బ్రతికేయచ్చు అనిపించేది..
ఐతే కాలేజీ లేదా తన ఊహలు.. ఎప్పుడు నా ప్రపంచంలోనే బ్రతికే నేను ఎప్పటి నుండి తన ప్రపంచంని నా ప్రపంచం చేసుకున్నానో తెలియలేదు నాకు..
ఉదయాన్నే కలిగే నే ముఖ దర్శనం
చేస్తుంది ఆ రోజు అంత ప్రశాంతం
నీ అందమైన నవ్వు చూసిన ఆ క్షణం
అవుతుంది మనసు ఉల్లాసం
ఎల్లపుడు నీ ఉనికిని గుర్తించే నా హృదయం
అవుతుంది ఆ రోజు ఆనందమయం..
ఆంటీ దగ్గరకి వెళ్ళినపుడు తన గురించి బోల్డు కబుర్లు చేప్పేవారు..వింటున్న ప్రతి సరి ఎదో తెలియని ఆనందం తో మనసు నిండిపోయేది ... రూపం లోనే అంటే గుణం లో కూడా చాలా గొప్పగా, హుందాగా ఉండేవాడు తను..
అవి అన్ని విన్న ప్రతి సరి అసలు తను ఎక్కడ నేను ఎక్కడ..అందం, చదువు, గుణం ఇలా ఎ విషయంలోనూ తనకి సరితూగను కదా
మన ఇద్దరి మధ్య శారీరకంగా
ఉన్న దూరం కొన్ని అడుగులే ఐనా
మానసికంగా భూమికి ఆకాశానికి
మధ్య ఉన్న దూరం మన సొంతం
అవి ఎప్పటికి కలవవు అని తెలిసిన
నీకై నా ప్రేమ చిరస్మరణీయం..
అని అనిపించేది...
కానీ తన ప్రవర్తన ఎందుకు అలా ఉండేదో అర్ధం అయ్యేది కాదు నాకు.. నాకు ఎప్పుడు దూరం గా ఉండేవాడు.. కనీసం మాట్లాడేవాడు కాదు.. బహుశా నా రూపం తనకి నచ్చలేదు ఏమో ఎంతైనా నేను తను ఉన్నంత అందం గా నేనూ ఉండను కదా..చివరికి నాకు ఒకటి అర్ధం అయ్యింది.. అందని వాటి కోసం తపించడం వృధా ప్రయాస అని.. కానీ ఆంటీ ద్వారా తెల్సుకున్న తన అల్లరి పనులు తన మంచితం అవి అన్ని నా మనసులో ఉండిపోయాయి..
ఇంకా తన గురించి నా ఆలోచనలు ఉండకూడదు అని నిర్నయించుకున్నను..
డైరీ చదవడం ముగిసాకా దీప్తి మనసు బరువు ఎక్కిపోయింది... తన ప్రాణ స్నేహితురాలు ఎంత బాధ అని మోసింది అని తల్చుకుంటేనే ఎంతో బాధగా అనిపించింది. రేపు ఈ విషయంలో గురించి అర్చనతో మాట్లాడాలి అని అనుకుని పడుకుంది..
మరుసటి రోజు అర్చనాని కాలేజీ లో చూడగానే ఎంతో బాధతో కౌగిలియించుకుంది దీప్తి...
నీ మనసులో ఎం ఉందో ఆ అబ్బాయికి చెప్పకుండా నీకు నువ్వే ఎదో అనేసుకుని నిన్ను నువ్వు బాధపెట్టుకోవడం కరెక్ట్ కాదు అర్చన నా మాట విని ఒక సరి తనకి నీ మనసులో మాట చెప్పు అని సలహా ఇచ్చింది దీప్తి.
లేదు దీప్తి తనకి నాతో కనీసం మాట్లాడం కూడా ఇష్టం లేదు.
నేను ఎక్కడ ఉంటే తను అక్కడ నుండి వెళ్లిపోయేవాడు.
ఒక మనిషికి ఎదుటి వారి మీద ఏ ఫీలింగ్ ఉందో నోటితో చేప్తేనే తెలియాలి అని లేదు కాదా దీప్తి వాళ్ళు చేసే పనుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు.. నాతో మాట్లాడడం, నా దగ్గరలో ఉండడం కూడా ఇష్టం ఉండదు తనకి అలాంటిది ఏమని చెప్పాలి చెప్పాలి తనకి తను నా ప్రాణం అని తానే నా ప్రపంచం అని...
ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు నాన్నగారు.. మా ఇంట్లో ఆయన ఎం చెప్తే అదే చేస్తాం అని నీకు తెలుసు కదా.. ఎంతో మంది వన్ సైడ్ లవర్స్ గా మిగిలిపోయారు.. వాళ్లలో ఇప్పుడు నేను ఒక్కదానిని.. కానీ మనసులో తినని పెట్టుకుని వేరే వాళ్ళని ప్రేమించడం చాలా కష్టం... అందుకే ఈ ప్రేమని మర్చిపోవడానికి ట్రై చేస్తా..
కానీ అంత ప్రాణంగా ప్రేమించి మర్చిపోగలవా అని అడిగింది దీప్తి.
తప్పదు అని చేప్తుంది అర్చన..
కొన్ని రోజులకు పెళ్ళి చూపులు అని తెలిసి చాలా బాధ పడుతుంది అర్చన...
తన ప్రేమ ఓడిపోయింది అని తన రూపం వల్లే ఇలా అయింది ఏమో అనుకుని అద్దం ముందు కూర్చుని బాధపడుతూ ఉంటుంది...
తనకి ఈ పెళ్ళి వద్దు అని గట్టిగ చెప్పాలి అనిపిస్తుంది కానీ ఇంట్లో తన మాట కి ఇచ్చే విలువ తెలుసు కాబ్బటి మౌనంగా ఉండిపోతుంది వచ్చే కన్నీళ్లని ఆపుకుని..
కొద్దీ సేపటికి అర్చన ని పెద్దవారి ముందు కూర్చోపెడతారు వాళ్ళ అమ్మ గారు..
అర్చనకి ఇది అంత చాలా కష్టం గా ముళ్ల మీద కూర్చునట్టు ఉంటుంది కానీ ఏమి చేయలేని పరిస్థితి... కనీసం అబ్బాయి ని కూడా చూడాలి అనుకోదు.. నేను అమ్మాయితో మాట్లాడాలి అన్న అబ్బాయి మాటతో మౌనంగా అతని వెంట వెళ్తుంది.. కానీ అతని వంక మాత్రం చూడడు..
ఓయ్...ఎంత సేపు అలా కిందకి చూస్తూ సైలెంట్గా నీ కోసం ఇంత అందంగా రెడీ అయ్యి వస్తే నా వైపు కనీసం చూడట్లేదు అన్న మాటతో పైకి చూసిన అర్చన మెదడు మొత్తం ఒక రకమైన షాక్ కి గురివుతుంది...
తన ముందు ఉన్నది నిజం అని మనసు చెపుతున్న దానిని అంగీకరించడానికి మెదడు సిద్ధంగా లేదు... ఎందుకు అంటే తను ప్రాణంగా ప్రేమించిన తన ప్రియుడు తనకి దొరకదు అనుకున్న తన ప్రేమ తన కళ్ళ ముందు చిరునవ్వుతో నిలబడి ఉంది...
రాఘవ్.....నువ్వు.. ఇక్కడా... అని ఒక్కో పదం ఒట్టి పలుకుతూ మాట్లాడుతుంది అర్చన... అర్చన నుంచుని ఉన్న చోటు నుండి అంగుళం కూడా కదలదు.. తను ఇప్పటికి నమ్మలేకపోతుంది ఇంత అదృష్టం తన సొంతం అవుతుంది అంతే.. కానీ తన ప్రమేయం లేకుండానే తన కళ్ళ వెంట ఆనందాబాష్పాలు రాళుతున్నాయి..
రాఘవ నే అర్చన దగ్గరకి వచ్చి ప్రేమగా హత్తుకుని నుదిటి పై ముద్దు పెట్టుకుని ఇది నిజంగా నిజం బంగారం... నీ ముందు ఉన్నది నీ రాఘవే..
నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీవాడినే అని చేప్తే నీకు ఎలా తెలుసు అన్నట్టు చూస్తుంది అర్చన.
ఆ రోజు మొదటి సరిగా నువ్వు మా ఇంటికి వచ్చినపుడే చాలా నచ్చేసావ్ నాకు... ఆ రోజు నీ కళ్ళు పలికించిన భావాలు నేను అసలు ఎప్పటికి మర్చిపోలేను నేను..
నన్ను నువు ఆ రోజు చూసినపుడు నీ కళ్ళలో కనిపించిన ఆశ్చర్యం, అమ్మ తో మొదటగా మాట్లాడినపుడు నీ కళ్ళలో బేరుకు, అమాయకత్వం.. ఆ కళ్ళలోనే బందీ గా అయిపోతా ఏమో అనిపించింది... ఎందుకో చూడగానే నువ్వే నా సొల్మేట్ అనిపించింది... నన్ను చూసిన ప్రతిసారి
నీ కళ్ళలో కనిపించే ఆరాధన అంతకు మించిన ప్రేమ, నేను నవ్వినప్పుడు నీ చెక్కిల్లో దాగిన సిగ్గు అవి అన్ని తెలుసు నాకు.. నీ ప్రతి పని నీ ప్రతి భావం అపురూపమే నాకు... కానీ అవి అన్ని తెలిసి కూడా దూరంగా ఉన్న నీకు కావాలనే అని చేప్తు ఉన్న రాఘవ్ కళ్ళలోకి ఎందుకు అన్నట్టు చూస్తుంది అర్చన.. రాఘవ్ ఆ కళ్ళపై ముద్దుపెట్టుకుని చెప్పడం కొనసాగిస్తాడు... నాకు జాబ్ వచ్చి వన్ మంత్ అయింది అంతే...అప్పటికి నాకు ఇంకా జాబ్ లేదు.. నువ్వు ఇంటికి వచ్చిన ప్రతిసారి నీతో కబుర్లు చెప్పాలి అని నీ మాట వినాలి అని నీ నవ్వు చూడాలి అని నీ రూపాన్ని తనివితీరా చూసుకుని నాలో నింపుకోవాలి అని పదే పదే అనిపించేది కానీ అవి అన్ని చేసి నువ్వు ఇంకా ప్రేమ పెంచుకుంటే నువ్వు తర్వాత చాలా బాధపడాలి.. అందుకే ఎంత కష్టం గా ఉన్న కావాలని నీకు దూరంగా ఉండేవాడిని..
అలా ఉంటునందుకు నా మీద నాకే కోపం వచ్చేది.. నీ కోసం ఐనా ఉద్యోగం తెచ్చుకోవాలి అని ఇంకా ఇంకా కష్టపడ్డాను... అమ్మకి నా ప్రేమ గురించి మొత్తం తెలుసు... నీ విశేషాలు అన్ని అమ్మ నే నాకు చెప్పేది.. ఒక రోజు నీ ఫ్రండ్ దీప్తి నాకు నీ డైరీ ఇచ్చింది.. అది చదివిన నాకు ఆ రోజు అంత నిద్ర లేదు... నా మీద నీకు ఉన్న ప్రేమ.. ప్రేమించావు అని తెలుసు కానీ నా ప్రపంచంలోకి వచ్చే అంతలా ప్రేమించావా నన్ను.. నా కోసం నువ్వు పడిన బాధ.. అవి అన్ని చదివినపుడు నా ప్రాణం విలవిలాలడిపోయింది... అంతకు ముందే నాకు జాబ్ వచ్చింది.... వెంటనే అమ్మ తో మాట్లాడి మీ నాన్నగారిని ఒప్పించి పెళ్ళి చూపులు ఆరెంజ్ చేయించా మళ్ళీ నా బంగారు బొమ్మని ఎవరైనా ఎత్తుకుపోతారు అని
మరి ఈ బంగారు బొమ్మకి నన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టం ఏనా అని అడుగుతాడు.. దానికి అర్చన ప్రేమగా నుదిటి మీద ముద్దు పెట్టి అంత అంగీకారం తెలుపుతుంది...

