Sirisha Siri

Drama Romance Classics

4  

Sirisha Siri

Drama Romance Classics

అనుకోని మజిలీ ❤️

అనుకోని మజిలీ ❤️

6 mins
491


అమ్మ అమ్మ చాలా ఇంపార్టెంట్ అని నన్ను ఇంత కంగారుగా ఇంటికి రప్పించింది పెళ్ళి చూపులకా నేను చెప్పా కదా అమ్మ నేను అప్పుడే పెళ్ళి చేసుకుని అని ఐన మీరు నాకు సంబంధాలు చూడడం మొదలు పెట్టారు అంటే నేను ఎం చేయాలి అని వాళ్ళ అమ్మ మీద అరుస్తుంది శశి...

(శశి వాళ్ళ అమ్మ గారు లక్ష్మి గారు, నాన్న గారు మురళి గారు.. మన శశి వాళ్ళ ఒక్కగానోక్క కూతురు..ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది )

లక్ష్మి గారు:అది కాదు బుజ్జి మంచి సంబంధం అని మీ నాన్నగారు ఈ పెళ్ళి చూపులు ఏర్పాటు చేసారు నీకు నచ్చకపోతే చెప్పేసేయ్ బలవంతం ఎం లేదు...

శశి: అమ్మ నీకు ఎన్ని సార్లు చెప్పాలి నన్ను బుజ్జి అని పిలవద్దు అని శశి అని పిలువు అమ్మ..

లక్ష్మి గారు : నువ్వు ఎన్ని సార్లు చెప్పిన నేను అలానే పిలుస్తా కానీ ఎం ఆలోచించకుండా వెళ్లి పడుకో అసలే రేపు త్వరగా లేవాలి..

శశి: నేను నాన్న తో చాలా మాట్లాడాలి నాన్న తో మాట్లాడి అప్పుడు పడుకుంటా

మురళి గారు: చెప్పు బంగారం

శశి: నాన్న వచ్చారా.. మీ కోసమే చూస్తున్నా..మీరు కూడా ఏంటి నాన్న నేను చెప్పాను కదా అప్పుడే పెళ్ళి చేసుకోను అని ఐన కూడా ఏంటి నాన్న ఈ పెళ్ళి చూపులు

మురళి గారు : రేపు అబ్బాయి ని చూసి నీకు నచ్చకపోతే అప్పుడు ఈ సంబంధం కాన్సల్ చేసేద్దాం అమ్మ.. మంచి వచ్చిన సంబంధం చూడకుండా, మాట్లాడకుండా నచ్చలేదు అని చెప్పడం పద్ధతి కాదు తల్లి.. ఇంకేం ఆలోచనలు పెట్టుకోకుండా నిద్రపో..

శశి : మీరు అంతలా చెప్తున్నారు కాబ్బట్టి సరే నాన్న...

మరుసటి రోజు ఉదయం

లక్ష్మి గారు : బుజ్జి వాళ్ళు వచ్చే టైం అయ్యింది అంత ఈ పట్టుచీర కట్టుకుని రెడీ అయ్యి ఈ నగలు పెట్టుకో.. ఆలస్యం చేయకు అర్ధం అయ్యిందా...

శశి: అమ్మ ఈ చీర ఐతే కట్టుకుంటా కానీ ఇన్ని నగలు ఐతే నా వాళ్ళ కాదు అమ్మ.. పెళ్ళి అయ్యాక రోజు ఇన్ని నగలు వేసుకుని తిరగను కదా వీటిలో కొన్నే వేసుకుంటా

లక్ష్మి గారు : సరే, నీ ఇష్టం కానీ అందం గా తయారయ్యి ఉండు.. నేను వచ్చి పిలిచే వరుకు బయటకి రాకు..

మురళి గారు : లక్ష్మి త్వరగా రా వాళ్ళు వచేస్తున్నారు...

శశి : ఆమ్మో వాళ్ళు వచ్చేసారు అంత ఎంత మంది వచ్చారో నన్ను ఎం చేయమంటారో అసలు ఆ అబ్బాయి ఎలా ఉంటాడో.. మంచోడో కాదో.. ఐన అబ్బాయి ఎవరు ఐతే మనకి ఎందుకులే ఎవరు వచ్చిన నో చెప్పేయాలి అని అనుకుంటుంది..

కాసేపటికి అబ్బాయి ఎదురుగ కూర్చోపెడతారు మన శశి ని.. అనుకోకుండా అబ్బాయిని చుసిన మన శశి ఏంటి ఇతనా నేను చచ్చిన చేసుకోను ఇతనని పెళ్ళి అని కళ్ళముందు ఏవో జ్ఞాపకాలు మెదులుతుంటే అలా గతంలోకి వెళ్తుంది..

రెండు సంవత్సరాల క్రితం..

అది శశి తన చివరి సంవత్సరం చదువుతున్న రోజులు..

రమ్య, శశి ప్రాణ స్నేహితులు..

రమ్య : ఏంటి శశి ఈ 4th ఇయర్... ఒక పక్క ఈ ఇంటర్వూస్, ఇంకో పక్క ఈ ప్రాజెక్ట్ వర్క్ అసలు మనకి ఎంజాయ్ చేయడానికి టైం ఏ ఉండట్లేదు... ఇన్ని వర్క్స్ ఒకేసారి చేయలేక చస్తున్నాం అనుకో..

శశి : ఈ ఒక్క సంవత్సరం ఏ కదా రమ్య తప్పదు మనకి... ఎలాగైనా మనం జాబ్స్ టీచసుకున్నాం అనుకో తర్వాత లైఫ్ అంత ఎంజాయ్ చేయచ్చు

రమ్య : నువ్వు చెప్పింది నిజమేలే సరే పద ప్రాజెక్ట్ వర్క్ చేద్దాం అని వెళ్తారు..

సరిగ్గా అదే టైంలో తన ఫ్రెండ్ని కలవడానికి అని కాలేజీ కి వస్తాడు చరణ్.. అలా తన ఫ్రెండ్ని కలిసే కంగారులో శశి ని చూసుకోకుండా గుద్దేస్తాడు..

శశి : ఓయ్ కళ్ళు కనిపించట్లేదా చూసుకుని నడవాలి అని తెలియదా.. అమ్మాయి కనిపిస్తే చాలు ఎలా డాష్ ఇవ్వాలా అని చూస్తారు ఛ..

చరణ్: ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావ్.. నేను ఎదో కావాలని డాష్ ఇచ్చినట్టు.. నా కంగారులో నేను ఉండి చూసుకోలేదు సారీ చేప్పే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అలా అరుస్తున్నావ్.. బుద్ది ఉందా కొంచం ఐన బొత్తిగా తింగరి దానిలా ఉన్నవే

శశి: నన్నే తింగరిదనా అంటావా నీ పని చెపుతా ఉండు అని పక్కన పెయింట్ బకెట్ ఉంటే ఆ పెయింట్ బకెట్ తో చరణ్ షర్ట్ ని పాడుచేసేస్తుంది..

చరణ్ : చెంప చెల్లుమనిపించి నేను అసలు ఎంత ఇంపార్టెంట్ పని మీద ఉన్నానో నీకు తెలుసా ఛ అని చెప్పి వెళ్ళిపోతాడు..

లక్ష్మి గారు : శశి అబ్బాయిని చూడు అని అన్ని సార్లు పిలుస్తుంటే ఎం ఆలోచిస్తున్నావ్

శశి : అమ్మ అది అని శశి మాట్లాడే అంతలో

నేను అమ్మాయితో మాట్లాడాలి అనుకుంటున్న అని అడుగుతాడు చరణ్

(అవును అండి ఆ అబ్బాయి ఏ మన శశి ని చూసుకోవడానికి వచ్చిన అబ్బాయి )

మురళి గారు : అమ్మ శశి అబ్బాయి నువ్వు మాట్లాడుకుని మీ నిర్ణయం మాకు చెప్పండి అని వాళ్ళని వేరే గదికి పంపుతారు.

శశి: మీరా.. కాదు కాదు నువ్వా నువ్వు ఏంటి ఇక్కడ అసలు వచ్చేది నువ్వు అని నాకు తెలిస్తే కనీసం రెడీ అయ్యే దానినే కాదు.

చరణ్ : అది కాదు శశి నేను చెప్పేది విను

శశి: ఎం చేప్తావ్ నిన్ను కొట్టిన దెబ్బ సరిపోలేదు ఇంకొకటి కొడతా అని చేప్తావా లేదా నిన్ను పెళ్ళి చేసుకుని జీవితాంతం నిన్ను కొడతానే ఉంటా అని చేప్తావా అని కళ్ళనీళ్లతో అడుగుతుంది.

శశిని అలా చూసి బాధగా అనిపిస్తుంది చరణ్ కి

చరణ్:శశి చేతులు పట్టుకుని.. ప్లీజ్ శశి అప్పుడు కూడా నాకు ఇలా మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు ఒకేఒకసారి నేను చెప్పేది విను అప్పుడు కూడా నా మీద కోపం ఉంటే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్న నేను ఎం మాట్లాడాను అని చెప్పడం మొదలపెడతాడు..

ఆ రోజు నేను చాలా టెన్షన్ గా ఉన్న శశి నేను ఆ రోజు నా ఫ్రెండ్ ని కలవడానికి మీ కాలేజీకి వచ్చా.. అదే మొదటి సారి ఈ ఊరు రావడం. నాకు ఈ ఊరిలో తెలిసిన వాళ్ళు కూడా వాడు ఒక్కడే.. ఆ రోజు నాకు ఇక్కడ ఇంటర్వ్యూ ఉండి నాకు ఏమో ఈ ఊరు గురించి ఏమి తెలియదు. నా ఫ్రండ్ మీ కాలేజీ దగ్గరకు వచ్చేస్తే వాడు తీసుకుని వెళ్తా అన్నాడు.. నాకు ఆ జాబ్ చాలా ఇంపార్టెంట్ అందులోను నా మొదటి ఇంటర్వ్యూ. నువ్వే చెప్పు శశి ఆ టైములో ఎంత టెన్షన్ గా ఉంటుంది. ఆ కంగారులోనే నిన్ను చూసుకోకుండా గుద్దేశా. తప్పు చేశా అని సారీ చెప్పే లోపే నువ్వు తిట్టడం మొదలుపెట్టావ్. నాకు అసలు చెప్పే అవకాశం ఇచ్చావా నువ్వు. అందుకే నిన్ను అలా తిట్టడం జరిగింది.నువ్వు నన్ను ఏమైనా తిరిగి అనచ్చు కదా.. అలా కాకుండా  పెయింట్ ని నా మీద పొసేసావ్.అలా ఇంటర్వ్యూ కి ఎలా వెళ్తాను చెప్పు అందుకే ఒక్కసారిగా బాధ, కోపం వచ్చేసాయి.. ఆ కోపం తోనే నీ మీద చెయ్యి చేసుకుని వెళ్ళిపోయా.. ఒక అమ్మాయి మీద చెయ్యి చేసుకోవడం అదే మొదటి సారి అండ్ చివరిసారి శశి. ఆ రోజు ఎదో కోపం లో వెళ్ళిపోయా కానీ తరువాత ఒక అమ్మాయి మీద చెయ్యి చేసుకోవడం ఏంటి అని చాలా బాధ కలిగింది శశి..రోజు నా మనసులో నీకు సారీ చెప్పుకునేవాడిని.. నిన్ను ఎప్పటికి ఐన కలిసి సారీ చెప్పాలి అని చాలా సార్లు అనుకున్న కానీ నాకు ఉన్న నా జాబ్ టెన్షన్ వల్ల కుదరలేదు.. అలాంటి సమయంలోనే నాన్న నీ ఫోటో చూపించి నిన్ను చూసుకోవడానికి మీ ఊరు వెళ్తున్నాం అన్నారు.. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది శశి.. వెంటనే సరే అనేసా ఇదిగో ఇప్పుడు నీ ముందు ఉన్న.. నన్ను చూడగానే నీకు ఎంత కోపం వచ్చిందో నాకు తెల్సు నేను నచ్చలేదు అని చెప్పేస్తావ్ ఏమో అని భయం వేసింది అందుకే నీతో మాట్లాడాలి అని ఇలా చేశాను.. ఆ రోజు నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు శశి.. దానిని మనసులో పెట్టుకుని నో చేప్తావ్ ఏమో... నన్ను ఒప్పుకుని నాతో కలిసి జీవితాంతం ఉంటా అని అంటే నిన్ను మాత్రం ఎప్పటికి కష్టపెట్టను.. నా మాటలో నీకు నమ్మకం కలగకపోతే నా కళ్ళు చూడు.. నా కళ్ళలో నిజాయితీ ఉంది అంటేనే నన్ను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకో.. నీ నిర్ణయం ఏదయినా నాకు అంగీకారమె.

శశి:మీరు చెప్పింది అంత విన్నాక నాకు ఎం మాట్లాడాలో కూడా అర్ధం కావట్లేదు... మిమ్మల్ని నేను నమ్ముతున్న కానీ నాకు కొంత సమయం కావాలి

చరణ్: అలాగే శశి.. నీకు కావాల్సినంత సమయం తీసుకో... కానీ నన్ను అర్ధం చేసుకుంటావ్ అని నమ్ముతున్నాను.. ఇప్పటికే చాలా మనం వచ్చి చాలా టైం అయ్యింది ఇంక బయటకి వెళ్దాం పద అని ఇద్దరు బయటకి వెళ్తారు..

కొద్దీ రోజులలో ఏ విషయం అన్నది చెప్పమని వాళ్ళు బయలుదేరాతారు.

శశి:హలో రమ్య, అర్జెంటు గా నీకు ఒక విషయం చెప్పాలి అని జరిగింది మొత్తం రమ్య కి చేప్తుంది శశి

రమ్య: నాకు ఐతే అతని మాటలబట్టి అతను మంచి వాడే అనిపిస్తుంది శశి పైగా అంకుల్ కూడా మంచి సంబంధం అంటున్నారు కాబట్టి ఒప్పేసుకో..

శశి: నేను అదే అనుకుంటున్న రమ్య సరే నీకు నేను మళ్ళీ ఫోన్ చేస్తా

మురళి గారు: రామ్మా శశి ఏమైనా మాట్లాడాలా నాతో..

శశి: హా అవును నాన్న,,, నాకు నీ సంబంధం ఇష్టమే

మురళి గారు: నిజంగానా బంగారం నీకు మనస్ఫూర్తిగా ఇష్టం ఏ నా

శశి: హా నాన్న నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను..మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి.

పెళ్ళి కి దగ్గర్లో ముహుర్తాలు లేకపోవడం వల్ల వారం రోజులోనే పెళ్ళి పెట్టేసుకుంటారు..

అలా వారం రోజుల్లోనే పెద్దలు, బంధుమిత్రుల ఆశీర్వాదాలతో వీళ్ళ పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది.

ఆ రోజు వాళ్ళ తొలి రాత్రి..ఒంటికి సరిపడా నగలతో తెల్లని చీరలో చేతిలో పాల గ్లాసుతో వస్తున్న శశిని చూసి మైమరచిపోతాడు చరణ్.

చరణ్: రా శశి అక్కడే ఉండిపోయావే అని తీసుకుని వెళ్లి బెడ్ మీద కూర్చోపెడతాడు

శశి: మీతో కొంచం మాట్లాడాలి చరణ్ గారు

చరణ్: నువ్వు ఎం మాట్లాడాలి అనుకుంటున్నావో నేను అర్ధం చేసుకోగలను శశి.. నీకు ఎంత టైం కావాలి అంటే అంత టైం తీసుకో అప్పటి వరుకు మనం ఫ్రెండ్స్ లాగా ఉందాం సరేనా

శశి:థాంక్యూ చరణ్ గారు మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అని చాలా కంగారు పడ్డాను..

చరణ్ : సరే శశి.. అనవసరం ఐన ఆలోచనలు ఎం పెట్టుకోకుండా ప్రశాంతం గా పడుకో అని నుడిటి మీద ముద్దు పెట్టుకుంటాడు.

ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడం,ఒకరి పనుల్లో ఒకరు సహాయం చేసుకోవడం..వీకెండ్స్ లో బయటకి వెళ్లడం, ప్రతి విషయం లోనుఒకరికొకరు తోడు గా ఉండడం తో చాలా కొద్దీ రోజులలోనే ఒకరి మనసుకి ఒకరు బాగా దగ్గర అయ్యిపోతారు శశి చరణ్ లు..

కొన్ని రోజుల తరువాత.. ఆ రోజు చరణ్ పుట్టినరోజు..

శశి: చరణ్ గారు, చరణ్ గారు ఒక సారి లేవండి

చరణ్ : ఎం అయ్యింది శశి నువ్వు బానే ఉన్నావా

Sasi: నాకేం కాలేదు మీరు ఒక నిమిషం సైలెంట్ గా ఉండండి అని హ్యాపీ బర్త్డే చరణ్ గారు.. పెళ్ళి అయ్యాక వచ్చిన మీ మొదటి పుట్టినరోజు అని ఒక డ్రెస్ ఇచ్చి విష్ చేస్తుంది..

ఆ రోజు మొదటిగా గుడికి వెళ్లి తరువాత ఫుల్గా ఎంజాయ్ చేసి రాత్రికి ఇంటికి చేరుకుంటారు..

శశి : నా ఇష్టాలకు విలువ ఇచ్చి నన్ను పూర్తిగా అర్థంచేసుకున్నందుకు థాంక్స్ శ్రీవారు.. అని ప్రేమగా నుదిటి మీద ముద్దు పెట్టి.. చరణ్ కళ్ళల్లోకి చూస్తూ శారీరకంగా కలిసిపోవడానికి తన అంగీకారం తెలుపుతుంది శశి..

అలా గొడవతో మొదలైన వాళ్ళ ప్రయాణం పెళ్ళి అనే బంధంతో ప్రేమగా మారి లెక్కపెట్టలేనన్ని సంతోషాలని ఇచ్చింది.



Rate this content
Log in

Similar telugu story from Drama