హంతకులు!
హంతకులు!
ట్రైన్ బయలుదేరింది.హైదరాబాద్ వరకు ప్రయాణం.రణకేశవ్,అతని అనుచరులు ట్రైన్ ఎక్కేసి,పెట్టెలన్నీ సర్ధేసి సీట్లలో కూర్చున్నారు."నీలం రంగు పెట్టె జాగ్రత్తగా పెట్టారా!?"అని అడిగాడు రణకేశవ్.
"జాగ్రత్తగా ఉంది సార్!ఒకళ్ళం అక్కడే కూర్చున్నాం"అన్నాడు నలుగురిలో ఒక మనిషి.
నీలం రంగు పెట్టె గురించే టెన్షన్ అందర్లోనూ.అటూ ఇటూ తిరుగుతున్నా, ఒకళ్ళు పెట్టెకి కాపలా ఉంటున్నారు.
మధ్య మధ్యలో రణకేశవ్"ఒరేయ్,పెట్టె జాగ్రత్త"అని పదే పదే అంటున్నాడు.
పాసింజర్లు ఎక్కువగా ఉన్నారు.ట్రైన్ రద్దీతో కిటకిటలాడుతుంది.అప్పటికే చీకటి అలముకుంటుంది.
"ఒరేయ్,వకుళం నీలం రంగు పెట్టె జాగ్రత్తరా"అని గట్టిగా అరచి చెప్తున్నాడు రణకేశవ్.
"నాప్రాణం పోయినా దాన్ని వదలను,జాగ్రత్తగా చూస్తున్నా"వకుళం అన్నాడు.
ఆ రోలో ఉన్న వాళ్ళందరూ ఆ పెట్టె వైపు వింత గానూ, ఆశక్తి గానూ చూస్తున్నారు.
టికెట్ కలెక్టర్ వచ్చాడు,రిజెర్వేషన్ లేకపోయినా డబ్బులు ఎక్కువివ్వడంతో సీట్లలో కూర్చోనిచ్చాడు. ప్యాంట్రీ పక్క పెట్టె కావడంతో స్
నాక్స్ తీసుకెళ్లడం,తీసుకురావడం ఎక్కువగా ఉంది.
"చీకటి పడిపోతుంది.నీలం రంగు పెట్టె జాగ్రత్త,నిద్రొస్తే చెప్పు"రణకేశవ్ చెప్తున్నాడు.
"నేను కూడా చూస్తున్నా!"నిశాస్వామి అన్నాడు.
"చూస్తున్నా, చూస్తున్నా అంటూ,ఇద్దరూ దాన్ని దొబ్బెడతారు కాబోలు!"రణకేశవ్ అంటున్నాడు.
రాత్రి అందరూ పడుకున్నాక_
రణకేశవ్ గ్రూపుది నీలం రంగు పెట్టె మాయమైంది.ఎవరు తీసుకుని పట్టుకెళ్లారో రణకేశవ్ కి తెలుసు!ఎందుకంటే,అందర్నీ పడుకోమని చెప్పి,మెలకువగా పరిశీలిస్తున్నాడు.
తర్వాత వచ్చే స్టేషన్ లో అందరూ దిగిపోయారు.అందర్లోనూ టెన్షన్ మాయం అయి, నవ్వుతా చలాకీగా ఉన్నారు.రణకేశవ్ మహా మేధావి.ఎవర్నో ఖూనీ చేసి,ఆ బాడీని పెట్టెలో పెట్టి ట్రైన్ లో ఎక్కించేశారు.ఎక్కడైనా వదిలేద్దామని,ఈ లోపు చిన్న ప్రయత్నం కూడా చేశాడు రణకేశవ్.పెట్టె జాగ్రత్త అని పదే పదే చెప్తుంటే,దాన్ని దొంగతనం చేసుకుపోయారు.రిస్కు అంతా వాళ్ళ కూడా పోయింది.ఒకవేళ ఉండిపోయినా, డబ్బుతో కొన్న సీట్లు,ఎవరు ఎక్కారో తెలియదు.
వీళ్లంతా మరో ట్రైన్ లో వెనక్కి బయలుదేరారు.