STORYMIRROR

గ్యాసు లైటు

గ్యాసు లైటు

1 min
341


రేపు పరీక్షలు.ఆ గ్యాసు లైటు వెలిగించు.కరెంటు ఎప్పుడు వస్తాదో ఏమో.

రాధమ్మ మొగుణ్ణి కేకేసి పిలిచింది.


వెంకటేశు గబగబా గ్యాసు లైటు వెలిగించాడు.అదంతా ఓ పెద్ద చిత్రంలా చూస్తోంది వీరూ చెల్లెలు పద్మ.

వీరూ పుస్తకాలు ముందర వేసుకొని ఊగుతూ చదువుతున్నాడు.


అశోకుడు రోడ్డుకు ఇరు వైపులా చెట్లు నాటించెను.

వీరూ చదువుతూనే ఉన్నాడు.


గ్యాసు లైటు చూసినప్పుడల్లా వీరూకి తన బాల్యం గుర్తుకు వస్తుంది.చదువంటే చదువుకోని తన తల్లిదండ్రులకు ఎంత ఇష్టమో కదా అనిపిస్తుంది.


Rate this content
Log in