STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

4  

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

గురు వందనం

గురు వందనం

1 min
238

అవి కాలేజీ రోజులు, సుశాంత్ అతని స్నేహితులు చాలా బాగా చదువుతున్నారు. కొత్తగా ఓ ఎకనామిక్స్ ప్రొఫసెర్ వచ్చారు. అతను విధార్థులను చూసి చాలా ఆశ్చర్య పడ్డారు. మీకు క్రొత్త క్రొత్త విషయాలు చెప్పాలని నేను చాలా ఆరాటంతో వచ్చాను అన్నారు. వెంటనే అందరు మీరు చెప్పండి మేము నేర్చుకుంటాం అని చాలా విధేయతతో చెప్పారు. ఆ ప్రొఫసెర్ చాలా సంతోషంగా పాఠాలు చెప్పడమే కాక చాలా విషయాలు నేర్పారు. అది కాలేజీ ఆఖరు సంవత్సరం అవ్వటంతో బయటకు వెళ్లి ఉద్యోగాలు చేసే టప్పుడు ఎలా మెసెలుకోవాలో కూడా చెప్పారు.

అతనికి ఈ పిల్లలను గురించి తెలుసుకోవాలని వీళ్లంతా ఏ స్కూల్ లో చదివారు అన్నీ ఆరా తీశారు. ఎందుకంటె అతని చిన్నప్పుడు ఎలా ఉండే వారో అలానే ప్రతి ఒక్కరు వున్నారు. ప్రిన్సిపాల్ అప్పుడు చెప్పారు ఈ పిల్లలంతా మీ గురువుగారి శిష్యులే. అందుకే నీకు నిన్ను చూసినట్లు అనిపిస్తుంది అన్నారు. ఆ పిల్లల చదువులయి అందరు మంచి ఉద్యోగాలలో చేరారు. ఓకే గురు పౌర్ణమి నాడు అందరు కలిసి వాళ్ల గురువుగారికి సన్మానం చేయాలనీ నిర్ణయ్యించుకున్నారు.. ఆ రోజు పెద్ద గురువుగారైన సుబ్బయ్య గారిని, తమ కాలేజీ ప్రొఫసెర్ అయిన వెంకట్ ను పిలిచి ఇద్దరికీ సన్మానించారు.

అందరు 5ఏళ్ళ తరవాత కలిసేమనే సంతోషం, గురువుగారిని ఆనందపరిచేమనే సంతృప్తి కలిగాయి. ఎంత పెద్ద వాళ్ళమయినా ఓనమాలు నేర్పిన గురువులను గౌరవించాలి, ఎప్పుడు వాళ్లతో కలుస్తూ మన ఎదుగుదలకు కారణం మీరే అనేది చెపుతు వాళ్ళను సంతోష పరచాలి. శ్రీ గురుభ్యోనమః 


Rate this content
Log in

Similar telugu story from Inspirational