గంగజాతర
గంగజాతర


రాచవారిపాళెం మారుమూల గ్రామం.
300 గడప ఇళ్ళు పురాతనకాలం నుంచి అక్కడున్నాయి
ఊరంతటికీ రెండే బావులు
ఊరి మధ్యలో ఉన్న బావినీళ్ళుఅగ్రకులాలవారికే పరిమితం
ఊరి చివర ఉన్న బావినీళ్ళు అట్టడుగు వర్గాల వారు నానాగొడవలు పడుతూ తోడు కొంటారు
ఎలిమెంటరీ స్కూలు తప్ప వేరే ఏమీ లేదు
హాస్పిటల్ కళ్ళాలంటే అనంతగిరి వాగు దాటి ముందుకు వెళితే 10 మైళ్ళ దూరంలో ఉంది
యానాది రమణమ్మ ప్రసవించిన తర్వాత రోజు వాతంవచ్చిచనిపోయింది
మూడు కి లో మీటర్లు నడిచి వెళ్తే పల్లెవెలుగు బస్సు పలకరిస్తుంది
మేనెల వేస్తే బావులు ఎండిపోతాయి
రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగు లో ఉన్న నీళ్ళు ఆడంగులు బూతు పురాణం మాట్లాడుతూ నానాయాతనపడి తెచ్చుకుంటారు
జనరల్ ఎలెక్షన్ వచ్చినప్పుడు నాయకులు కార్యకర్తలు గొప్ప గొప్ప వరాలు కుమ్మరించి వెళ్లి పోతారు
పట్నం లో డిగ్రీ చదివివచ్చిన హరి పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలొచ్చిన వారం ముందు అందరి
నీ సమావేశపరిచి ఇలా అన్నాడు
సర్పంచ్ కావాలంటే 40 లక్షలు ఖర్చు పెట్టాలి గదా! ఏకగ్రీవంగా ఎన్నుకొంటే విరాళంగా ఇచ్చిన మొత్తంతో ఓవర్ హెడ్ ట్యాంకు కట్టి నీళ్ళ కొళాయి లు రూపాయి స్కీమ్ కింద తెప్పించుకుందాం. నా ఫ్రెండ్ జాయింట్ కలెక్టర్ గా వచ్చాడు' అని అందరినీ ఒప్పించాడు
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకొంటే విరాళంగా 30 లక్షలు ఇస్తానన్నాడు రమణారెడ్డి
మా ఆవిడ ను ఉపసర్పంచ్ చేస్తే 20 లక్షలు ఇస్తానన్నాడు రామానాయుడు
గంగజాతర నాటికి నీళ్ళు తెప్పించే ప్రయత్నం చేశారు
ఏటా గంగజాతర పండుగలా చేసుకొంటారు
హరి కృషి ఫలితంగా జాతరనాటికి కొళాయి లు ప్రారంభోత్సవం జాయింట్ కలెక్టర్ చేత చేయించారు
ఆ సభలో మాట్లాడుతూ హరి ఇలా అన్నాడు:
ఈరోజే మనకు నిజమైన పండుగ.
గ్రామదేవతల చల్లని చూపులతో మన అక్కా చెల్లెళ్ళు హాయిగా బ్రతుకు సాగించ వచ్చు.'
జాయింట్ కలెక్టర్ సంతోషంగా హరి మెడలో పూలమాల వేశారు
చప్పట్లు మారుమోగాయి.