డబ్బు
డబ్బు


నిన్నటి వరకు అందరూ ఆప్తులే ఇప్పడు అయినవాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయ్యారు కారణం నువ్వే కాదు.. నిన్ను లెక్క చేయని నేనే.
నువ్వు ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి పేరు కు పేరు పరపతి కి పరపతి కానీ అప్పుడు నిన్ను గుర్తించలేదు ఇప్పుడు అనుభవిస్తున్నాను.నువ్వు లేని నేను సున్నా అని ఖచ్చితంగా చెప్పగలను.నువ్వు ఉన్నప్పుడు నాకు ఈ లోకం పోకడ అర్థం కాలేదు ఇప్పుడు నువ్వు లేని ఈ క్షణాన అర్థమైంది ఈ లోకం తీరు.ప్రతి క్షణం ఎవరికి వాళ్ళు అందరి చేత మంచి వాళ్ళు అని అనిపించుకోవలనుకుంటారు కానీ నువ్వు ఉంటే నేను ఎప్పుడూ ఎప్పటికీ మంచివాడినే.
నువ్వు నా పక్కన నాతో ఉంటే ఈ ప్రపంచం లో నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు. అదేంటో నువ్వు ఉంటే నా విలువ అమాంతం పెరుగుతుంది అది నీకూ తెలుసు.నువ్వు నా దగ్గర ఉంటే నేను కొరినవి,కోరుకున్నవి నా దగ్గరకు అవే వస్తాయి అన్నీ నీ వల్లే సాధ్యం.నువ్వు ఉంటే ఆకలి ఉండదు అసలు ఆ పదమే గుర్తుండదు అంత శక్తి ఉంది నీలో.నువ్వు ఉంటే నా మాట కి విలువ పెరుగుతుంది ఆ మాట ను అందరూ గౌరవిస్తారు అది నీ గొప్పతనం.ఇంతకీ ఆ నువ్వు ఎవరో తెలుసుకోవాలని ఉంది కదూ ఆ నువ్వు మరెవరో కాదు "డబ్బు" అవును డబ్బు.డబ్బే లేకపోతే ఈ ప్రపంచమే నీతో సంబంధం తెంచుకుంటుంది అది డబ్బు కి ఉన్న పవర్.ఎప్పుడైతే డబ్బు ను జాగ్రత్తగా చూసుకోలేదో చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను మర్చిపోతుంది.డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు నీ మాట సిద్ధాంతం అవుతుంది అదే డబ్బు నీ దగ్గర లేకపోతే నీ మాటే రాద్ధాంతం అవుతుంది.
లోకం డబ్బు చుట్టూ తిరగదు డబ్బు చుట్టే లోకం ఉంటుంది.డబ్బుకు విలువ ఇవ్వండి మీకు మీ జీవితాంతం అందరూ విలువిస్తారు.వెలుగులో నే మన నీడ మనతో ఉంటుంది అదే డబ్బు ఉంటే అందరూ నీడ లాగా నీ వెనుకే వస్తారు.నీ దగ్గర డబ్బు లేకపోతే నీడ కూడా నిన్ను ఒంటరి ని చేసి వెళ్లిపోతుంది.