srinath pakala

Drama

4.6  

srinath pakala

Drama

వివాహ బంధం...!!!

వివాహ బంధం...!!!

4 mins
1.0K


                          


                 "నాన్న నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను".ఆ మాట విన్న నారాయణ రావు గారి కి నోటి నుండి మాట రాలేదు.ఐదు నిమిషాలు తండ్రి కొడుకుల మధ్య నిశబ్దం రాజ్యమేలింది.చివరికి తాను విన్నది ఏంటో అర్థమై "ఏమయిందిరా కృష్ణ ".అంటూ విషయానికి వచ్చారు నారాయణ రావు గారు."అవన్నీ తరువాత నాకు అర్జెంటు గా విడాకులు కావాలి అంతే..".అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు కృష్ణ.


        "ఏవండీ ఏవండీ అది మన కృష్ణ...." ఆ తెలుసు అంటూ కను సైగ చేసారు నారాయణ రావు గారు."మరి తెలిసి కూడా ఏంటండీ ఇలా ఉన్నారు ఎదో ఒకటి చేసి వాడికి అర్దమయ్యేట్టు చెప్పండి"."చూడు లక్ష్మి వాడికి చెప్పించుకునే వయసు దాటిపోయింది.ఇంతకూ మన కోడలు పిల్ల ఏమంటుంది". "తను ఏమంటుంది అండి చిన్నపిల్ల అడిగితే ఎం చెప్పలేదు.సరే నేను రాత్రి కి కృష్ణ తో మాట్లాడుతాను నువ్వు కూడా కోడలు పిల్ల తో మాట్లాడు". అని చెప్పాడు ప్రస్తుతానికి అంతకన్నా ఏమి చెప్పలేక.....!


                'రాధా కృష్ణ ల వివాహం జరిగి ఒక సంవత్సరం కావొస్తుంది.పెళ్ళిలో వీరి జంట ను చూసి మెచ్చుకోనివారంటూ లేరు అంత చూడ ముచ్చని జంట.ఇద్దరు సాఫ్ట్వేర్ (software) ఉద్యోగస్తులే.కాకపోతే వేరు వేరు కంపెనీలు.ఇద్దరికీ లక్షల్లో జీతం


            ఆ రోజు సాయంకాలం ఇద్దరు ఆఫీస్ నుండి వచ్చాక కొడుకు తో మాట్లాడడానికి నారాయణరావు,కోడలు తో మాట్లాడానికి లక్ష్మి గారు వారి వారి గదుల్లోకి వెళ్లారు.అవును వాళ్ళు నెల నుండి వేరు వేరు గదుల్లో ఉంటున్నారు.

 

                      "రేయ్ నాన్న తిన్నావా..?".కొడుకు మీద ఉన్న ప్రేమ తో అడిగారు నారాయణరావు గారు.ఆ తిన్నాను నాన్నా.ఎదో ముక్తసరిగా సమాధానమిచ్చాడు కృష్ణ."ఏంటి నాన్న ఏదయినా సమస్య ఉంటె నాతో చెప్పురా"...?"ఎం లేదు నాన్న నేను,తను ఇక కలసి ఉండలేం.నేను ఎం చెప్పిన వినటం లేదు.బదులు గా రోజు ఎదో ఒక గొడవ నా వాళ్ళ కాదు నాన్న".


                       "అరే నాన్న నేను ఈ కాలం పిల్లలకు చెప్పే వాడిని కాదు కానీ భార్య భర్తలు మధ్య మాట పట్టింపు ఉండకూడదు ఐనా ఒకరి మాట ఇంకొకరు వినాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది.ఇద్దరి గొంతులు కలిసి ఎప్పుడైతే ఒకే మాట మాట్లాడుతారో అప్పుడు ఆ సంసారం సజావు గా ఉంటుంది."


                    ఇదే సమయంలో అక్కడ "ఎమ్మా ఆలా ఉన్నావు." ఏమి అడగాలో తెలియక అడిగింది లక్ష్మి."ఏముంది అత్తయ్య ఈ ప్రాబ్లెమ్ గురించే ఆలోచిస్తున్నా".చెప్పమ్మా ఏమైంది అసలు?".


           "ఏముంటుంది అత్తయ్య నేను చెప్పిన ప్రతి పని ఆయనకు కష్టమే.అసలు నాతో మాట్లాడడానికే టైం ఉండదు కానీ గొడవ పడడానికి టైం ఉంటుంది"."చూడమ్మా మగవాడు ఏమి చేసిన తన కుటుంబం కోసమే కాకపోతే అలాంటి టైం లో కొంచెం సమయం మనకి కేటాయించడానికి ఉండదు దాన్ని మనం అర్ధం చేసుకొని నడుచుకోవాలి.భర్త బయట నుండి ఇంటికి వచ్చినపుడు మనం ఒక గ్లాస్ మంచి నీళ్లు ఇస్తే చాలమ్మ తను పడ్డ కష్టం అంతా మర్చిపోయి ఎంత సంతోషిస్తాడో."


                  "రేయ్ నాన్న మనం ఎం చేసినా మన భార్య కు చెప్పే చేయాలి.మన చేసే ప్రతీ పని లో భార్య ను సలహాలు అడిగితె మనం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ.మన మగ వారికి ప్రతి చిన్న పనికి అహం అడ్డొస్తుంది.అహాన్ని విడిచి ఆడదాన్ని అర్ధం చేసుకోగలిగితే మనం జీవితం లో ఎంతో సంతోషం గా ఉంటాం".


                 "మనం భర్త కోసం తీసుకునే ప్రతీ జాగ్రత్త వారికీ ఒక కొత్త బలాన్ని ఇస్తుంది.అక్కడ ఇంట్లో తన భార్య తన కోసం ఎదురుచూస్తుంది అనే ఆలోచన భర్త కు వస్తే తను భార్య ను జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు.మనం ఎం చేయక్కర్లేదమ్మ భర్త పట్ల ఆవగింజ అంత ప్రేమ చూపిస్తే చాలు తను దానికి వంద రెట్ల ప్రేమ మన మీద చూపిస్తారమ్మా".


                   "రేయ్ కన్నా ఒక అమ్మాయి మన కోసం కేవలం మన కోసం తన పుట్టినిల్లు,అక్కడ ఆచారాలు,అలవాట్లు ముఖ్యంగా తన కన్న వాళ్ళను కూడా వదిలి ఎవరో తెలియని వాడితో పెళ్లి అన్న బంధం తో అన్నీ వదిలేసి మెట్టినింటికి వస్తారు ఎందుకంటే ఏమైనా నా భర్త ఉన్నాడు అన్న నమ్మకం మరి ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మగవారిమీద ఉంది.తనకి పెళ్లి ఐన తరువాత ఏ కష్టం వచ్చిన మొదట భర్త గుర్తుకు రావాలి అంతే గాని భర్తే ఒక సమస్య ఐతే తను ఎవరితో చెప్పుకుంటుంది".


                   "మన ఆడవారు కష్టాలను వ్యక్తపరిచినట్టు మగవారు వ్యక్తపరచలేరు అమ్మ.ఒక భార్య గా మనమే మన భర్త కష్టం ఏంటో తెలుసుకొని వారితో ఆలా మెలగాలి.భర్త ఎంత కష్టపడినా భార్య కోసం తన కుటుంబం కోసమనేనని భార్య గుర్తించాలి.భర్త కష్టాన్ని భార్య గుర్తిస్తుంటే భర్త ఎంత కష్టాన్నయినా ఎదుర్కొంటాడు...రాధ"


                "అరే కృష్ణ మన మగవారు శారీరకంగా బలం గా ఉన్నా మానసికంగా ఆడవారే దృడంగా ఉంటారు.అందుకే మగవారికి ఏ చిన్న కష్టం వచ్చినా టెన్షన్ పడి ఆరోగ్యం పాడుచేసుకుంటారు కానీ ఆడవారు ఆలా కాదు ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యం గా ఎదురుకుంటారు.కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగున్నా,బాగోలేకపోయినా ఆడవారు ఒకే రకంగా ఉంటారు కానీ మగవారు ఆత్మహత్య వరకు వెళ్తారు.

దీన్ని బట్టి చెప్పు కుటుంబం లో భార్య పాత్ర ఎంత విలువైనదో....!అందుకే మన పెద్దవారు రామాయణ,భారతాలను చదవమనేది".


                   "చూడు రాధా మనం కన్న బిడ్డల్ని ఎలా చూసుకుంటామో అలానే మన భర్త ను కూడా అలానే చూసుకోవాలి.తను ఆనందం లో ఉన్నపుడు స్నేహితుడిలా ,తనకి ఆకలేస్తే తల్లి లా,కష్టం వస్తే తండ్రి లా,మార్గనిర్దేశము చేసే గురువు లా..ఇలా ఎప్పుడు భర్త క్షేమమే తన క్షేమమని కోరుకోవాలి భార్య అంటే".


                      "కృష్ణ ఒక స్త్రీ ని తల్లి ఎప్పుడవుతుందో తెలుసా..?"."ఏంటి డాడీ ఆలా అడిగారు బేబీ కి జన్మ ని ఇస్తే అప్పుడంటారు అంతే గా.."."కాదురా కృష్ణ ఎప్పుడైతే ఓ స్త్రీ మేడలో తాళి పడుతుందో ఆ కట్టిన వాడిలోనే 'తన మొదటి బిడ్డ' ను చూసుకుంటుంది.నిజంగా మగవారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మగ వారి జీవితంలో భగవంతుడు ఇద్దరమ్మలని ఇస్తాడు ఒకరు 'కన్న తల్లి' ఒకరు 'కట్టుకున్న భార్య'.అలంటి భార్య ని మనం ఎలా చూసుకోవాలి చెప్పు."


             అంతే ఆ మాటలకూ కృష్ణ కంటి నుండి జల జల నీళ్లు రాలాయి."నన్ను క్షమించండి నాన్న భార్య విలువ తెలియకుండా ప్రవర్తించాను ఇక నుండి అమ్మ ను ఎలా చూసుకుంటానో రాధా ను అలానే చూసుకుంటాను."ఆ మాట విన్నాక తండ్రి మనసు కుదుటపడింది.


                "అత్తయ్య నేను ఒక మాట చెప్పనా..?"."చెప్పమ్మా"." నాకు వెంటనే కృష్ణను చూడాలని ఉంది.అని చెప్పింది కొంచెం సిగ్గుతో".అలా ఇద్దరు బయటకు వస్తుండగా అటు నుండి కృష్ణ,నారాయణరావు గారు ఎదురొచ్చారు.అంతే ఇద్దరు సిగ్గు తో తలా దించుకున్నారు.


                "రాధా ఇక నుండి నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది ఈ కృష్ణను నమ్ము.రాధ కృష్ణను కాకపోతే ఎవరిని నమ్ముతుంది చెప్పండి".


                పక్కనే ఉండి వీరి మాటలను వింటున్న నారాయణరావు,లక్ష్మి గార్ల మొఖము ఫై చిరునవ్వు విరిసింది.


                    

             


          


           


Rate this content
Log in

Similar telugu story from Drama