RA Padmanabharao

Inspirational

5.0  

RA Padmanabharao

Inspirational

చిన్నిచిన్ని ముద్దు

చిన్నిచిన్ని ముద్దు

2 mins
484


జనార్దన్ బెంగుళూరులో సాఫ్టువేర్ ఇంజనీరుగా 20 ఏళ్ళుగా పని చేస్తూ ఇల్లు ఇల్లాలితో స్థిరపడ్డాడు

బెంగుళూరు లోనే యం యస్ రామయ్య ఇంజనీరింగ్ కాలేజిలో కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తిచేసి క్యాంపస్ సెలక్షన్లో బెంగుళూరులోనే ఉద్యోగం సంపాదించాడు

సర్జాపురారోడ్డులో డూప్లెక్సు హవుస్ కొన్నాడు

డిల్లీలో స్థిరపడ్డ తెలుగుఅమ్మాయి జ్యోతితో 24వ ఏట పెళ్ళి అయింది

రెండేళ్ళు తిరిగే సరికి ఓకొడుకు పుట్టాడు

అంశుల్ అని పేరు పెట్టారు

నాన్న కందు కూరిలో తెలుగు లెక్చరర్ గా పని చేస్తున్నపుడు తాను పుట్టడం వల్ల అక్కడి జనార్దనస్వామి పేరు తనకు పెట్టారు

నాన్న ఉద్యోగం మారి ఆకాశవాణిలో చేరడంతో కడపకు తన చినతనంలోవెళ్ళిపోయారు

పిల్లి పిల్లల్ని మార్చినట్లు వాళ్ల నాన్న బదిలీ అయినప్పుడల్లా పిల్లలూ ఊరూరూతిరగక తప్పలేదు

కడప, విజయవాడ , హైదరాబాదు,ఢిల్లీ అనంతపురం -ఇలా ఊరూరూ తిరిగాడు జనార్దన్

అలా తిరగడంవల్ల పిల్లల హొరైజన్ పెరుగుతుందని వాళ్ళ నాన్న చెప్పే వాడు

జనార్దన్ బాల్యపుగుర్తులు ఆరోజు ఫోటో ఆల్బం తిరగవేస్తూ కొడుకుకు వివరాలు చెబుతుంటే గుర్తుకొచ్చాయి

రవీంద్రభారతి స్టేజి మీద ఫోటో చూపిస్తూ -

‘అంశుల్! నా 11 వ ఏట మా మ్యాజిక్ గురువుగారు బి వి పట్టాభిరాం పక్కన మ్యాజిక్ చేస్తున్న ఫోటో ఇది’

‘నువు నాతో మ్యాజిక్ చేసేది తెలుసుగానీ స్టేజిమీద చేయడం గ్రేట్’ అన్నాడు అంశుల్

‘ఆరోజు మా సార్ నా చేతికి ఒక బెలూన్ బాగా ఊది ఇచ్చారు

అది పిన్నుతో నేను గుచ్ఛాలి. అది పగలకపోవడం మ్యాజిక్

కానీ అది టప్ మని పగిలి పోయింది

గురువుగారు దాన్ని ఎలానో కవరప్ చేశారు

భలే అంటూ పగలబడి నవ్వాడు అంశుల్

’ఏమైందంటూ భార్య జ్యోతి వచ్చి సోఫాలో కూర్చొని మిగతా ఫోటోలు చూస్తోంది

’ఓ! యన్ టి రామారావు గారు’ అంటూ ఆశ్చర్య పోయింది

దీనికో కధ వుంది అంటూ మరో ఫోటో చూపాడు

జనార్దన్ కు ముద్దు పెడుతున్నాడు రామారావు

‘ నా కెప్పుడూ చూపలేదని నవ్వింది జ్యోతి

’నేను ఢిల్లీ లో ఐ టి వో ఆంధ్రాస్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాను. చూసేందుకు చాలా చిన్నవాణ్ణిగా ఉండేవాడిని

నవంబర్ ఫెస్టివల్ ఆంధ్రోత్సవాల సందర్భంగా స్కూల్లో అనేక పోటీ లు పెట్టారు

నాన్న ప్రోత్సాహంతో నేను, అన్నయ్య రమేష్ అన్ని పోటీల లో పాల్గొన్నాం

ఇద్దరికీ బహుమతులొచ్చాయి

ఏ పిభవన్ లో పెద్ద సభ

ఆరోజు ఆంధ్రముఖ్యమంత్రి రామారావు గారి చేతులమీదుగా బహుమతి ప్రదానం

రమేష్ ముందుగా తీసుకున్నాడు

ఆర్ జనార్దన్ ఆంధ్రా స్కూల్ -అనగానే నేను స్టేజి మీది కెళ్ళాను.

నా మెడలో మెడల్ వేసి ఒక్కసారిగా రామారావు నన్నుపైకెత్తి

చిన్నిముద్దు పెట్టారు

సభలో చప్పట్లు మారుమోగాయి

కిందికి రాగానే ఎలక్షన్ కమీషనర్ జి వి జి కృష్ణమూర్తి మరో ముద్దుపెట్టి మీ నాన్న పేరు నిలబెట్టావని వీపు తట్టారు

నిజంగా అది మరచిపోలేని విషయం’ అంటూ జనార్దన్ ఎమోషనల్ అయి అంశుల్ కి , జ్యోతికీ ముద్దులు పెట్టాడు



Rate this content
Log in

Similar telugu story from Inspirational