ఆమెతో గడిపిన క్షణాలు
ఆమెతో గడిపిన క్షణాలు
ఆమెతో గడిపిన క్షణాలు
అల్లంత దూరాన అనుక్షణం ఆమెతో గడిపిన క్షణాలు
అల్లంత సుదూరాన లెక్కలేనన్ని వెలుగు జాడలు ఆమెతో గడిపిన క్షణాలు
కునుకు తీద్దామంటే కుదురుగా పడుకొనియవు ఆమెతో గడిపిన క్షణాలు
మినుకు మినుకుమంటూ మిన్నంటుతూనేవుంటాయి ఆమెతో గడిపిన క్షణాలు
ఎప్పుడూ ఏదో పని చేస్తున్న ప్రతిక్షణం పలకరిస్తూనేవుంటాయి ఆమెతో గడిపిన క్షణాలు
ఏకబారున తిరుగాడుతూనే వుంటాయి ఆకాశమార్గాన ఆమెతో గడిపిన క్షణాలు
అవకాశం ఉంటే ఆకాశం వీధి నుంచి భూవీధుల్లో విరాజిల్లుతాయి ఆమెతో గడిపిన క్షణాలు
మనస్సుతో ఏదో చెప్పాలని మళ్ళీ మళ్ళీ గుర్తుకువస్తునేవున్నాయి ఆమెతో గడిపిన క్షణాలు
ఆమెతో గడిపిన క్షణాలన్నీ నా జీవితంలో మర్చిపోలేని మధురమైన తీపి జ్ఞాపకాలే-నర్ర పాండు✍️

