Dr.R.N.SHEELA KUMAR

Inspirational

4  

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

ఆధునికత

ఆధునికత

1 min
146


ఇది ఓ పట్టణం లో చిత్రీకరించిన ఘటన. సుదీర్ +2చదువుతున్నాడు. తనకి చిన్నప్పటి నుండి వేసవిశెలవులలో అమ్మమ్మ గారింటికి వెళ్ళటం అలవాటు. అది ఓ గ్రామం. పచ్చ పచ్చగా చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది రోజు ఏటికి వెళ్లి ఈత కొడుతూ స్నేహితులతో ఆడుకుంటూ ఎక్కడో ఒక దగ్గర భోజనం చేస్తూ ఉంటాడు పల్లె అవ్వటం వలన అందరు చాలా కలుపుగోరు తనం తో ఉంటారు. సెలవులు అయిపోయి తిగి పట్టణం వస్తే ఇక అంతా మాములే. ఇరుగు పొరుగు వారితో సంబందాలే లేక ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు ఉంటారు. ఇక చదువుల విషయానికి వస్తే ఉదయం 5నుండి రాత్రి 9వరకు స్కూల్ ట్యూషన్ అని పిల్లలకి అసలు వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారా అనే సందేహం కలుగుతుంది. సుదీర్ స్నేహితులు సుభాష్ వాళ్ళ నాన్న సుభాష్ ని కాలేజీ లో చేర్చాను నువ్వు C. A. చదువు అని ఆ కుర్రవాడిని కోచింగ్ సెంటర్ లో చేర్చారు తల్లితండ్రులు ఆ కుర్రవాడి వల్ల చదవ గలడా లేదా అనేది ఆలోచించ లేదు. ఇక సుదీర్ నాన్న ఏది చదవాలనుకుంటే అదే చెయ్యమ్మా అన్నారు. అప్పుడు సుధీర్ నాన్న కి ఊరిలో పొలాలున్నాయి కదా నాన్న నేను అగ్రికల్చర్ చదువుతాను అని చెప్పాడు అది విన్న వాళ్ల తాతయ్యకు సంతోషం ఆగలేదు సరేనమ్మా అంటుకాలేజీ లో చేర్చారు తను బాగా చదివేడు. ఇక సుభాష్ 4 ఏళ్ళైనా కనీసం మొదటి గ్రూప్ కూడా పూర్తి చెయ్యలేదు. వాళ్ళ నాన్న తిడుతూనే ఉండటం వలన ఆత్మహత్యకు పాల్పడినాడు. సుదీర్ సుభాష్ ని రక్షించి వాళ్ళ నాన్న దగ్గరకు తీసుకు వెళ్ళాడు సుదీర్ వాళ్ళ నాన్న సుభాష్ కి బుద్ది చెప్పి వాళ్ళ నాన్న ను పిలిచి మొదట పిల్లలకి ఏది ఇష్టమో కనుక్కొని చదివించండి అని చెప్పారు. అప్పుడు సుభాష్ కి లిటరేచర్ చదవాలని ఉందని చెప్పి కాలేజీ లో చేరి పెద్ద రచయిత అయ్యాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను బాధ్యత అని పెంచక ప్రేమతో పెంచితే సమస్యలే రావు. 


Rate this content
Log in

Similar telugu story from Inspirational