STORYMIRROR

Sri N

Romance

4  

Sri N

Romance

అనుభూతి

అనుభూతి

1 min
353

నలిగి అలసి మాసిన

పరుపుపై మల్లెల కేకలు

సంగీతమై కవ్వించదా


ఊసు ఊపు గెలుపుని

మంచాల కాళ్ళన్నీ

నర్తించి కీర్తించదా


పురి విప్పిన నెమలిలా

కొంగు జారగా చేసిన

గాలికి నమస్కరించదా


పెదవి అడిగిన ఆకలి

అధర తాకిడి తీర్చగా

అలిగిన కడుపు మురిపించదా


పరుగు నేర్పిన గసలు

సెమట మెచ్చి నచ్చే

పూటకై ప్రయోగించదా


ఆట సేర్సే అలసట

శక్తినిచ్చే ముచ్చటకై

ఇష్టంగా పరితపించదా 


ఊపిరసలు ఆడకున్న

బరువు మోసే తాపము

రేతిరంతా వికసించదా


వెలుగుల్లో నిను దాచిన

చిలిపి ధూప రూపము

చీకటినే ప్రేమించదా


Rate this content
Log in

Similar telugu poem from Romance