విలువున్నది
విలువున్నది
ఎవ్వరేమి అనుకున్నా..కాలానికి విలువున్నది..!
తెలియకనే పోతున్నా..ప్రాణానికి విలువున్నది..!
సేవకన్న భాగ్యమేది..లేదన్నది తెలియాలోయ్..
ధనం ఎంత నీకున్నా..ధర్మానికి విలువున్నది..!
జీవులన్ని సమమన్నది..చాటుతుంది ఒక గాయం..
వెలకట్టగ లేకున్నా..స్నేహానికి విలువున్నది..!
కార్పొరేటు రేటుముందు..రేటులన్ని బలాదూరె..
వ్యాధితగ్గు టెట్లున్నా..మరణానికి విలువున్నది..!
రైతు రాజు కావడమా..ఖరీదైన మాటలేల..
పంటకు వెల రాకున్నా..స్వేదానికి విలువున్నది..!
ప్రేమమయం జగమంతా..ప్రేమదొరుకు స్వర్గమేది..
ఎంత లేదు అనుకున్నా..నరకానికి విలువున్నది..
