వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే....
వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే....
చుట్టు ఉన్న ప్రపంచం అంతా నెమ్మదిస్తున్న వేళ..
నీటి అల ఒకటి ఆ సూర్యుడిని కౌగిలించుకోవడం చూసాను
ఒక రోజు అంత మనోజ్ఞంగా ముగుస్తుందని అప్పుడే తెలిసింది
ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా
ప్రపంచాన్ని మరచి...మబ్బు మధ్యలో కనిపించే మెరుపు లాగా
అందమైన చిరునవ్వు తో...ముంత మసాలాను ఆస్వాదిస్తున్న ఒక పెద్దావిడని చూసాను
నవ్వు లో అంత అందం దాగి ఉందని అప్పుడే తెలిసింది
ప్రపంచం అంతా కేరింతలు తీస్తుండగా
చెల్లెలి చెయ్యి పట్టు వదలక ,వెనువెంటే నడిచే ఆ అన్నలో
మగవాడి కన్నీటి చుక్కలో ఉండే బాధ్యత విలువ తెలుసింది
కొంత సమయం తరువాత నీటి పైన బంతిలా
సరిగ్గా అరచేతిలోకి కాంతిలా
నేను ఎదురు చూసిన నిండు పౌర్ణమి చందమామను చూసాను
జీవితం అంటే ఇదేనేమో కదా అనిపించింది
వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే
ఆ క్షణం చూపు ఆశ్చర్యాలు ఎన్నో
ఆ యుగం నేర్పు పాఠాలు ఎన్నెన్నో....
