STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ఉన్నది

ఉన్నది

1 min
5


కన్నుదోయి మెచ్చిన కల మబ్బుతునకలా ఉన్నది

మనసుపడిన చెలిరూపం మెరుపుతీగలా ఉన్నది


చెలి రువ్విన వాలుచూపు వెలుగుమొగ్గలా ఉన్నది

అమావాస్యలను కాల్చే పిడుగుదెబ్బలా ఉన్నది  


పెదవులలో చిరునవ్వుకి దివ్యకాంతులెక్కడివో 

కెంపుల గుడిలో పెట్టిన మణిదీపికలా ఉన్నది


కలసిన మనసులు గడిపిన జీవితాన్ని చూస్తున్నా  

పరిమళించు జ్ఞాపకాల మధువాటికలా ఉన్నది


మేనివీణలో పలికే కృతికి వే(ల)ళ్ళ వందనాలు  

వింటుంటే ఎలకోయిల నవగీతికలా ఉన్నది


సిగ్గులలో స్నానించే నగుమోమును తిలకించా  

ఎరుపెక్కిన వేకువలో తూరుపుదిశలా ఉన్నది 


అల్లరిగాలిని పిలిచే పైటకొంగు 

మన్మథపురిలో ఎగిరే జయపతాకలా ఉన్నదది


Rate this content
Log in

Similar telugu poem from Romance