స్వప్నమే....
స్వప్నమే....
ఏనాటి సందె వెన్నెలో..............
నా కలువ కనుల లోగిళ్ళలో.............
ఏ ఏటి పరవళ్ళ సవ్వళ్ళో............
నా పెదవి నవ్వు సవ్వడిలో...........
గొంతుదాటి సాగుతోంది జోలపాట............
రేయి అంతా సాగనీ కలల వేట............
గుండెలోన కురిసిన వెన్నెలంతా............
గుట్టుగా ఉండదే ఇదేమి వింతా............
మది ముడే విప్పుతున్నదా............
ఆ అలజడి రాగమల్లుకున్నదా...........
ఆకు చాటు నుంచి తొంగి చూసే జాబిలి...........
జావళీలు పాడుకుంటూ చేరు కునుకు కౌగిలి.........
లాలి లాలి అంటూ చిరుగాలి అలికిడి............
కమ్మనైన నిదుర కొరకు జోకొట్టే సవ్వడి...........
భారమైన రెప్ప మీద వాలే ఓ స్వప్నమే ఇది...........
మరేదో లోకాన్ని చూపి మైమరపిస్తున్నది...........

