STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

శిశిరశోభ (కవిత )

శిశిరశోభ (కవిత )

1 min
378


చలి దుస్తుల్ తనువులకు వెచ్చదనమీయ

వేడి నీటిని త్రావుచు విధులు నడిపి

భారతంబున జనులిట్లు వరలు చుండ

 శిశిర ఋతువు తా జనుదెంచి చెలగు చుండె 


ధరణి యందున ముత్యంపు ధార వోలె

మిహిక బిందువు ల్జారగా మిలమిలంచు

సొగసు లింపారు నీభువి శోభ లిపుడు

కాంచు వారల మదినిండ కల్గు ముదము.

చల్లచల్లగా జలములు జారు చుండ

పూని వెడలిన యారుద్ర పురుగు లచట

నెఱ్ఱ పగడంపు రాశిగా నింపు గొలుప

బీర పాదులో పూవులు విరగ బూసె

బంతి చామంతి పూవుల వరుసలోన 

పారి జాతమ్ములట రాలి పలకరించె.

నంది వర్ధనముల సౌరు విందు చేయ

నొళ్ళు మరచిన తుమ్మెద లుత్సహించి 

కాంచు చుండెను పూవుల కాంతి నపుడు.

కాల మీవిధి ధరణిలో కలియ తిరుగ 

వచ్చె శిశిరంపు శోభలు వసుధ యందు 

మనసు కాహ్లాద మొసగెడి మాసమిదియె.

అంబరంబున వెన్నెల లావరించ

వెండి ముద్దగా నింగిలో వెలుగు చుండి 

నమృతంబును కురిపించి యాడుకొనుచు

కొంటె జాబిల్లి తారల వెంట నడిచె.

కదిలి పోయెడి కాలపు గమనమందు 

ప్రకృతి యందముల్ కలిగించు పరవశమును/



----------------------------


Rate this content
Log in

Similar telugu poem from Classics