సాయిరాం
సాయిరాం
సాయి అనే నీ నామము
పలికితే వచ్చెను పుణ్యము
మాపై నీ చల్లని చూపు
ఉంచును మమ్ములను క్షేమము
అసూయా, ద్వేషం అనే గుణములు
దరి చేరవు నీ భక్తుల చెంతకు
మా శిరస్సు వద్ద నీ పాదములు
తొలగించును మా అనారోగ్యములు
ద్వారకామాయి నీ నివాసా స్దలము
కలిగించు మాకు నీ దర్శన భాగ్యము
