STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

సాగిపోతున్న జీవితం

సాగిపోతున్న జీవితం

1 min
252

సాగిపో.... ముందుకు సాగిపో......

ముళ్ళలో అడుగులు తడబడినా.......

కాలనాగులే ఎదురుగా కనబడినా.......

కొండలే అడ్డుగా నిలబడినా........

ఆబోతులే నీతో కలబడినా........

నిరాశలే నీలో చొరబడినా........

నిస్పృహలతో తనువే కూలబడినా........ 

నడపరా.......నీ ఆశయం మునుముందుకు

నడవరా......విజయంపై అనుమానమెందుకు

మట్టి తొలుచుకు వచ్చే బీజమవ్వరా

నీ సంకల్పానికి నీరు పోయరా

చివురులేసే మొలక ఆశ ఎదగనీయరా

మహా వృక్షమై జగతికంతటికి నీడనివ్వరా

అనుకుంటే కాదు అసాధ్యం

నీ చరిత రేపు ఒక పాఠం

కష్టం ఓడిపోయిన కథ విధి ఏనాడూ రాయలేదురా

నీకై వేచే ఉషోదయాన్నిలా స్వాగతించరా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational