రైతు ఎదురుచూపు
రైతు ఎదురుచూపు
దుక్కి దున్ని విత్తనాలు వేసి
మొలకకై ఎదురు చూపు
మొలకెత్తాక దానిని నెలలో నాటి
అప్పటి నుండి పంట కోసే వరకు
రైతు ఎదురుచూసే చూపు
ఓ పైరు తల్లి నీకు మొక్కగా జన్మనిచ్చాను
నా ఊపిరి దారపోసి నీకు ప్రాణం పోసాను
నా ప్రాణం పోతున్నా నేను నీ కోసమే బ్రతికున్నది
నువు మళ్ళీ నన్ను నీలా బ్రతికిస్తావనే ఆశతో
నీ ఇచ్చే పంటకై దానికోసమే
ఎదురుచూస్తున్న అని పంట తల్లితో
రైతు మనసులో మౌనంగా
ఎదురుచూసేను పంట కరుణించి
సిరుల పంట కురిపించే రైతు ఇంట పంట తల్లి
ఎదురు చూపు అంటే
రైతులా నమ్మకంగా ఉండాలి కానీ
ఆశలతో కాదు అందనిదాని గురించి కాదు
