STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

ప్రథమ మహిళ.

ప్రథమ మహిళ.

1 min
298


----------------------


నూతన చరితకు నాంది పలుకుచు

అడవిబిడ్డ నేడు అందల మెక్కెను.

ప్రథమ మహిళగా పేరు తెచ్చిన వనిత

గిరిజన వాడకే చేకూర్చె ఘనత

మహిళకుపట్టము కట్టిన చాలును

మహిలో వెలుగుల వెన్నెల నింపును

తరతరంబుల చీకటి పోద్రోలి

తలరాత మార్చును తరుణి మేధ

పలుకు తోడుగ నిలిచి

బాధలు తొలగించి

భవిత నిలిపెడి మహిళ

భారతావనిలో

దేశ ప్రగతికి చేయాత నిచ్చు పెద్దదిక్కు దొరికె ప్రగతి కొఱకు 

సంబరంబులు సల్పుచు సంతసించి

ఉత్సవంబులు జరుపుచు ఉద్యమించి

ప్రథమ మహిళకు స్వాగతమిచ్చి ప్రజలు

వెనుక ముందుగా చరియించి బాధ్యతగా మెలగ వలయు.

దేశ కీర్తిపతాక గగనమందు ఎగుర వేయుచు గర్వముగ జోతలిడుచు

భావి భారత యువత వర్ధిల్లవలయు.

-----------------------


Rate this content
Log in

Similar telugu poem from Classics