STORYMIRROR

Tejoram Chamarthi

Romance Tragedy Fantasy

4  

Tejoram Chamarthi

Romance Tragedy Fantasy

ప్రేమ

ప్రేమ

1 min
2.4K

తల్చుకున్నవి అన్ని జరిగితే అవ్వున అది జీవితం

వినసొంపైన పాట తో అయ్యెను నీ పరిచయం 

నా మాట తీరు ఆట తీరు నచ్చి అయ్యావు నేస్తం 

అనుకోకుండా ప్రేమ వైపు మళ్లింది మన స్నేహం 

ఎప్పుడు నీ తలపులలో సాగిపోయే హృదయం 

నాకోసం నిరంతరం వేచి చూసే నీ నయనం 

నిన్ను చేరాలని రోజు ఆరాటపడే నా అధరం 

కళ్ళతో మాటలు మార్చుకునే మన విన్యాసం 

నా ఒడిలో ఎల్లపుడు ఒదిగే నీ శరీరం 

తనువులు ఏకం చేయడం కోసం మన ఆరాటం 

అవి కలుసుకున్నప్పుడు చేసిన పోరాటం 

చిరకాలం నాతో ఉంటాను అని చేసిన ప్రమాణం 

నువ్వు దూరం అవ్వడం తో అయ్యేనుగ మాయం 

మొదలు పెట్టావ్ కదా కావాలి అనుకున్న కొత్త జీవితం 

నన్ను తలచి రోజు బాధ పడుతున్న అనే మాటలో అర్ధం 

అంత బాధ ఉంటె చేయాలి గ మరి మన కోసం పోరాటం  

మర్చిపోలేం ఇలాంటి మాటలకు ఉందా అవసరం

పరిస్థితి అని చెప్పి మాయం కదా మరి ఎందుకు తలవడం 

అనుకోవాలా ప్రపంచం అంత అది గొప్ప త్యాగం 

కానే కాదు తెలుసుకో ముందు జీవితం యొక్క సత్యం

నీతో ఉన్నవారికి పంచి పెంచు ప్రేమ అనే భావం 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance