ప్రేమ రుచులు
ప్రేమ రుచులు
మౌనిలాగ వుండాలని అనుకుంటావా
ప్రేమరుచులు చూడాలని కలగంటావా
ఎక్కడైన ఎప్పుడైన నీప్రక్క నేను
నేనునువ్వు ఒకటేకద కాదంటావా
మరుశరములు నిన్ను తాకి బాధించాయా
నా చూపుల గాయాలే ఔనంటావా
అక్షరాలా అర్చనంటె ఇష్టమన్నావు
కవితలల్లి వేడుకొంటె మొరవింటావా
నింగిలాగ పరచుకున్న నీహృదయంలో
ప్రేమార్ధికి చిన్నచోటు లేదంటావా

