ప్రేమ కావ్యం...❤️❤️❤️
ప్రేమ కావ్యం...❤️❤️❤️
కళ్ళు ప్రేమిస్తే ఆ ప్రేమకు ఆయుష్షు ఎక్కడిది....?
మనసు ప్రేమిస్తే ఆ ప్రేమకు మరణమెక్కడిది...?
కోరిక తలయెత్తితే ఆ ప్రేమ లో నిజాయితీ ఎక్కడిది..?
అంకితం అనుకున్న చోట భాగం ఎక్కడిది...?
గుండె నిండిన ప్రేమకు కొరత ఎక్కడిది...?
అర్పణం తెలియని ప్రేమకు అర్థంమెక్కడిది...?
స్పర్శ తెలియని మనసుకు స్పందన తెలియదా...?
భావం ఎరుగని దేహం పరవశానికి దూరమా...?
పెదవికి తెలిసిన ముద్దుకు తడవని ప్రేముంటుందా..?
హృదయానికి తెలియని ప్రేమకి విలువంటూ ఉందా..?
ప్రేమంటే ప్రేమే వివరణలు అనవసరం...
అర్ధాలకు, తాత్పర్యాలకు అది లొంగని కావ్యం..ప్రేమ..!!