ప్రేమ చిరునామా
ప్రేమ చిరునామా
ఎక్కడ వున్నావు హృదయేశ్వరా ఎక్కడ వున్నావు?
ప్రేమపూల తోటలోనా
గుండెలయల పాటలోనా
ఎక్కడున్నావు
నీవేక్కడున్నావు?
నీవులేక సరసవీణ మూగబోయింది,
పరిమళంలేని
చిరుగాలి మాట
మనసును చేరలేకున్నది,
విరహరాగంలో
ప్రేమసొగసే బోసిపోయింది,
మనోవేదన తెలుసుకోవా,
మదిగాయం మాన్పగా రావా.
చెలి చూపుల్లో అమృత ప్రేమ
త్రాగెందుకే నేవస్తున్నా,
అంతరంగ కలలతోటలో
నీతోనే నే విహారిస్తున్నా,
విరహానికి బహుమతిగా
అల్లరిమనసే అర్పణ చేస్తున్నా,
సరసరాగ పల్లవులతో
ప్రేమగీతి ఆలపిస్తున్నా,
నిదురపోని తలపులతో
ఒకరికై ఒకరుగా
సరాగాల తోటలో కలసుందాం అంటున్నా.