పో పోవే
పో పోవే
మేఘమా నిదురపో
అన్నదాతల ఆక్రందనలు ఆగని వేళ
బాల్యమా నిలిచిపో
యౌవనపు భాద్యతలు మోయలేని వేళ
ప్రాయమా పారిపో
మృగాలు కనులతో విందు చేసే వేళ
ఆడతనమా చచ్చిపో
అమ్మతనం మనసు గుర్తించని వేళ
ప్రాణమా ఆగిపో
ఈ మాయాలోకం లో బ్రతకలేని వేళ
శూన్యమా నాలో చేరిపో
నా మది మాటలు మరిచే వేళ