ఓ సైనికుడా!
ఓ సైనికుడా!
ఓ సైనికుడా! నీకు వందనాలు
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీవు క్షేమంగా ఉండాలనే ఆశ
నీవు లేనిదే సాగదు మా జీవితం
నీవు లేకుండా నడవదు మా పయనం
నీ త్యాగమే మా ఆశయాలకు వేసిన దారి
నీ ధైర్యమే మా జీవితాలకు వెలుగు
నీ కుటుంబానికి దూరంగా ఉండి మమల్ని నీ కుటుంబంలా
రక్షిస్తున్నావు
నిత్యం జనగణమన అంటూ సాగెను నీ పయనం
నీ నిస్వార్థమైన ప్రేమ పెంచును దేశభక్తి
నీ జీవితమే ఓ ఆదర్శజీవనం
మా అందరి యుద్ధం నీ ఒక్కడి పోరాటం
ప్రతిక్షణం దేశ భవిష్యత్తుకై ఆరాటం
నీ భక్తి చూసి పరవాశించేను భరతమాత
ఓ సైనికుడా!నీకు జోహార్లు...
