ఒక్క క్షణం
ఒక్క క్షణం
నిన్ను వదిలి ఒక్కక్షణం..ఉండలేను అసలు..!
నీ జతలో ఉన్న హాయి..కొలవలేను అసలు..!
దూరాలను తొలగించే..చతురతయే నీది..
నీవు పెంచు విరహమెంతొ..తూచలేను అసలు..!
నీ మాయకు దాసోహం..అయినది నా మనసు..
జారిపోవు కాలమునే..నిలుపలేను అసలు..!
ఊహలన్ని పరిమళించు..అక్షరాలు ఇపుడు..
ఎందుకనో నా ప్రేమను..తెలుపలేను అసలు..!
తెలియకనే నా హృదయం..గెలిచినావు భలే..
నీ జాలరితనము పట్టి..పొగడలేను అసలు..!
ఊరించే సకలకళా..కల్పతరువు నీవు..
నామతికే బహుమతివే..మరువలేను అసలు..
