ఒక చిన్న ఆలోచన
ఒక చిన్న ఆలోచన


ఒక చిన్న ఆలోచన నా మనసును తన సహజ స్థితిలో ఉంచకుండా చేస్తోంది
ఒక చిన్న ఆలోచన స్వీకరించలేని చెవులలో పడి నలిగిపోతోంది
ఒక చిన్న ఆలోచన నాపై పక్కవారి అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తోంది
ఒక చిన్న ఆలోచన నా అభిప్రాయాలు సరైనవే అని బెజూరు వేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది
ఒక చిన్న ఆలోచన నా మనసును మరింత స్థిరంగా మునపటికన్నా ఉన్నతంగా మారేందుకు తోడ్పడుతోంది
ఒక చిన్న ఆలోచన నా అంతరంగాలలో సమూల మార్పు కోసం తన వంతు సాయం చేస్తోంది
ఒక చిన్న ఆలోచన వేరొకరి భావనలు నాపై ప్రభావం చూపకుండా చేయడానికి సమిధలా మారుతోంది
ఒక చిన్న ఆలోచన నా అభిప్రాయాలు బలంగా మారడానికి అవకాశమిచ్చిన గురువులా కనిపిస్తోంది
ఒక చిన్న ఆలోచన నాలోనే కలిసిపోయి నేనుగా కనిపిస్తోంది