నువ్వు నేను ప్రేమ
నువ్వు నేను ప్రేమ
నువ్వు నేను ప్రేమ
నిన్ను చూసాకే నా మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది
ఆ అలజడికి కారణం నాకు ఇపుడే తెలిసింది
అది నీపై నాకు ఉన్న అంతులేని ఇష్టం అని
ఉదయించే సూర్యుడు అస్తమించక తప్పదు
వికిసించిన పువ్వు వాడిపోక తప్పదు
కానీ నీపై నాకున్న ప్రేమ అలా ఎప్పటికి తగ్గిపోకుండా
కడలిలో నీరు ఎప్పటికి ఎలా అయితే నిలిచి ఉంటాయో అలా
నా మనసులో నీపై ఉన్న ప్రేమ ఎప్పటికి ఉండిపోవాలి
ఆ సూర్యుణ్ణి చూడగానే తామరలు ఎలా వికశిస్తాయో
నిన్ను చూడగానే నా పెదవులపై చిరునవ్వు వికసిస్తుంది
ఆ సూర్యుడు ఎటు ఉంటే పొద్దుతిరుగుడు పువ్వు కూడా అటు తిరుగుతుంది
అలానే నువ్ ఎక్కడ ఉంటే నా చూపు కూడా నీవైపుకు తిరుగుతుంది
కానీ నువ్ మండే సూర్యుడివి కాదు
చల్లటి వెన్నెల కురిపించే చంద్రుడివి
అదే మనకు వాటికి ఉన్న తేడా ప్రియతమా

